The Paradise: ఊహించని కాంబో.. నాని సినిమాలో విలన్‌గా ఒకప్పటి స్టార్ హీరో..

The Paradise: ఊహించని కాంబో.. నాని సినిమాలో విలన్‌గా ఒకప్పటి స్టార్ హీరో..


నేచురల్ స్టార్ నాని హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇటీవలే కోర్ట్ సినిమాతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక హీరోగా నాని రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వాటిలో హిట్ 3 సినిమా ఒకటి, ప్యారడైజ్ మరొకటి. ఈ రెండు సినిమాల్లో నాన్ని విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. హిట్ 2 భారీ విజయాన్నిసాధించిన విషయం తెలిసిందే. కాగా ది ప్యారడైజ్ ఒక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ చిత్రానికి శ్రీకాంత్ ఓథెల దర్శకత్వం వహించారు. అతను చివరిసారిగా నానితో కలిసి బ్లాక్ బస్టర్ చిత్రం దసరాలో పనిచేశాడు. ది ప్యారడైజ్ చిత్రం టైటిల్ టీజర్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది.

నాని డిఫరెంట్ లుక్ లో కనిపించాడు,  భయంకరమైన రూపం,  శరీరాకృతి అలాగే రెండు జడలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. విభిన్న కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా మంది నటీనటులు  నటిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో ఆర్ నారాయణమూర్తి నటిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇటీవలే దర్శకుడు శ్రీకాంత్ నారాయణమూర్తిని కలిశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో నటించే విలన్ గురించిన ఆసక్తికర న్యూస్ వైరల్ గా మారింది.

ప్యారడైజ్ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. నాని సినిమాలో మోహన్ బాబు విలన్ గా నటించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి, అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, మోహన్ బాబు తన కుమారుడు విష్ణు నిర్మిస్తున్న కన్నప్ప చిత్రంలో కూడా నటిస్తున్నారు. మోహన్ బాబు తన కెరీర్‌ను నెగటివ్ పాత్రలతో ప్రారంభించాడని చాలా మందికి తెలియదు. చాలా సంవత్సరాల తర్వాత అతను విలన్ ఫీల్డ్‌లోకి తిరిగి రావడం అభిమానులలో ఆసక్తి రేపుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *