Thug Life: కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు తమిళనాడు నిర్మాతల సంఘం లేఖ..

Thug Life: కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు తమిళనాడు నిర్మాతల సంఘం లేఖ..


థగ్‌ లైఫ్ సినిమా వివాదంతో తమిళ, కన్నడ ఇండస్ట్రీల మధ్య టగ్‌ఆఫ్‌ వార్‌ నడుస్తుంది. రెండు రాష్ట్రాల సినిమాలపై ప్రభావం చూపించే స్థాయిలో వివాదం రాజుకుంటుంది. ఇటీవల కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ తమ రాష్ట్రంలో థగ్‌లైఫ్ సినిమాను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని తమిళ ఫిల్మ్‌ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ చాలా సీరియస్‌గా తీసుకుంది. సాఫ్ట్‌గా వార్నింగ్‌ ఇస్తూ లెటర్‌ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాసింది. థగ్‌ లైఫ్‌ వాయిదా వేసినా.. బ్యాన్‌ చేసినా భవిష్యత్తులో ఇండస్ట్రీల మధ్య రిలేషన్‌ దెబ్బతింటుంది. మీరు సినిమాలు బ్యాన్‌ చేసే… తాము కూడా మీ సినిమాలను బ్యాన్‌ చేయాల్సి వస్తుందని ఆ లేఖ సారంశం.

థగ్‌ లైఫ్‌ సినిమా నిషేధంపై వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆ లేఖలో కొన్ని విషయాలను ప్రస్తావించింది తమిళ ఫిల్మ్‌ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌. ఎన్నో ఏళ్లుగా కన్నడ, తమిళ సినీ పరిశ్రమలు కలిసి పనిచేస్తున్నాయి… శివరాజ్‌కుమార్‌, ఉపేంద్ర, సుదీప్‌ లాంటి కన్నడ హీరోలు తమిళ సినిమాల్లో నటించారు. కోలీవుడ్‌ నిర్మాతలు, దర్శకులు సైతం కన్నడ చిత్రాలు తీశారు. కమల్ హాసన్ థగ్‌ లైఫ్‌ మూవీ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం రెండు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతుందని లేఖ రాసింది. అయినా సినిమాపై నిషేధాన్ని కర్నాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ వెనక్కి తీసుకోలేదు. దీంతో తమిళం, కర్నాటక పరిశ్రమల మధ్య నెక్ట్స్‌ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే సినీ పరిశ్రమలో కలహాల కంటే కలయిక అవసరం. ఈ వివాదం తమిళంలో విడుదలకు సిద్ధమవుతున్న కర్నాటక సినిమాలపై ప్రభావం చూపిస్తుంది.

థగ్‌లైఫ్‌ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కమల్ హాసన్‌ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తమిళం నుంచే కన్నడ పుట్టిందని ఆయన కామెంట్స్ చేయడంతో పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు కన్నడిగులు. సారీ చెప్పాల్సిందే అంటూ కర్నాటక హైకోర్టు అల్టిమేటమ్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. మొత్తానికి థగ్‌లైఫ్ సినిమా కమల్‌-కర్నాటక మధ్యే కాదు.. రెండు ఇండస్ట్రీల మధ్య టగ్‌ఆఫ్‌ వార్‌కి కారణమైంది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *