
పై ఫొటోలో కనిపిస్తోన్న స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడామె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. హైదరాబాద్‌లోని పుట్టి పెరిగింది. ఇక్కడే చదువుకుంది. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఎక్స్ ట్రా కరిక్యూలర్ యాక్టివిటీస్ పై ఎక్కువగా దృష్టి సారించింది.
. కథక్, హిప్ హాప్, వాకింగ్, బెల్లీ డ్యాన్స్ తదితర వాటిల్లో శిక్షణ కూడా తీసుకుంది. స్కూల్ డేస్ తో పాటు కాలేజీల్లో పలు డ్యాన్స్ కాంపీటీషన్లలో పాల్గొని ప్రైజులు కూడా గెల్చుకుంది. ఇక సినిమా ఇండస్డ్రీలోకి రాక ముందు ఈ బ్యూటీ హైదరాబాద్‌లో థియేటర్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది. 50 కి పైగా తెలుగు భాషా నాటక నిర్మాణాల్లో పాలు పంచుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని లయోలా అకాడమీ డిగ్రీ పీజీలో గ్రాడ్యుయేషన్ వేడుకల్లో కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ అందాల తారను చూశాడట. ఆ వెంటనే తన సినిమా ఆడిషన్స్ కు పిలిచారట. ఆ వెంటనే తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం కల్పించారట. అలా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిందీ అందాల తార. అయితే ఆ తర్వాత ఈ బ్యూటీకి లక్ కలిసి రావడం లేదు. ఇప్పటివరకు దాదాపు 8 సినిమాలు చేస్తే అందులో రెండు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. చాలా సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ సెకెండ్ హీరోయిన్ గా లేదా క్యామియో రోల్స్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి తోడు ఈ ముద్దుగుమ్మ హైట్ కారణంగా చాలా మంది హీరోలు ఆమెతో నటించడానికి వెనకడుగు వేస్తున్నారు. మరి ఇంతకీ ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు జాతి రత్నాలు చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా.
జాతి రత్నాలు తర్వాత మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, బంగర్రాజు, రావణాసుర సినిమాల్లో స్పెషల్ రోల్స్ తో సందడి చేసింది ఫరియా అబ్దుల్లా. లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్, ఆ ఒక్కటి అడక్కు సినిమాలతో మరోసారి హీరోయిన్ గా అదృష్టం పరీక్షించుకుంది. ఇక మత్తు వదలరా 2 సినిమాతో మరో హిట్ ను ఖాతాలో వేసుకుంది చిట్టి. ఇందులో కామెడీ తోనూ అదరగొట్టింది ఫరియా. ప్రస్తుతం వల్లి మెయిల్ అనే డార్క్ కామెడీ మూవీలో నటిస్తోందీ అందాల తార. ఇందులో బిక్షగాడు విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు నరేష్ అగస్త్య హీరోగా నటిస్తున్న ‘గుర్రం పాపిరెడ్డి’ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా చేస్తోంది.
తన లేటెస్ట్ సినిమా ప్రమోషన్లలో ఫరియా..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.