సినీరంగుల ప్రపంచంలోని తారల జీవితాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయని అనుకుంటారు. కానీ వెండితెర పై కనిపించే చాలా మంది జీవితాలు చీకటితో నిండి ఉంటాయి. ఎన్నో సవాళ్లు, ఒడిదుడుకులను ఎదుర్కోంటారు. సినిమాల్లో లాగే హీరోహీరోయిన్స్ సైతం ప్రేమను పొందుతారు అనుకుంటాము. కానీ ఆ ప్రేమకథలు కొన్నిసార్లు విషాదాంతో ముగుస్తాయి. కొంతమంది జీవితాల్లో ప్రేమ అందుకోలేనంత అద్భుతంగా.. చేరుకోలేనంత దూరంలో ఉండిపోతుంది. లవ్ మరికొందరి జీవితానికి శాపంగా మారుతుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ జీవితంలో ప్రేమ విషాదంగానే ముగిసింది. పెళ్లి చేసుకోకుండానే ఆమె వితంతువుగా జీవించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరు.
ఒక దర్శకుడిని ప్రాణంగా ప్రేమించింది. కానీ అతడు మరణించడంతో పెళ్లి కాకుండానే వితంతువుగా జీవించింది. ఆ హీరోయిన్ పేరు నందా. బాలనటిగా కెరీర్ ప్రారంభించి, తరువాత కథానాయికగా అనేక హిట్ చిత్రాల్లో నటించింది. దాదాపు 70 సినిమాల్లో నటించింది. నందాకు 7 సంవత్సరాల వయసులో ఆమె తండ్రి మరణించాడు. కుటుంబాన్ని పోషించడానికి చైల్డ్ ఆర్టిస్ట్‌గా పనిచేయడం ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేసింది. భాభి, చోటి బహెన్, కానూన్, హమ్ దోనో, ఆషిక్, జబ్ జబ్ ఫైల్ ఖిలే, ఇత్తెఫాక్, ది ట్రైన్, ప్రేమ్ రోగ్ వంటి చిత్రాలలో పనిచేశారు. అప్పట్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన హీరోయిన్లలో ఆమె ఒకరు.
డైరెక్టర్, నిర్మాత మన్మోహన్ దేశాయ్ అప్పట్లో నందాను ప్రేమించారు. అప్పటికే ఆయన భార్య 1979లో మరణించింది. కానీ 90లో నందాకు ప్రపోజ్ చేశారు మన్మోహన్. అతడి ప్రేమను నందా సైతం అంగీకరించింది. కానీ ఆ రెండేళ్లకే 1992లో మన్మోహన్ ఒక ప్రమాదంలో మరణించాడు. అతడి మరణంతో నందా తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఆ తర్వాత ఆమె రంగురంగుల దుస్తులు ధరించడం మానేసింది. హిరంగ కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదని , ఆమె తెల్లటి దుస్తులు ధరిస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆమె వితంతువులా జీవించడం ప్రారంభించిందని అప్పట్లో ఆమె సోదరుడు జయప్రకాష్ వెల్లడించారు. నందా 2014 మార్చి 25న మరణించారు.

Nanda Movies
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..
Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..
OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‌స్టాప్ సస్పెన్స్..
Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..