Tollywood: ఈ అందాల తారది ఎంత గొప్ప మనసో.. 100 మంది పేద విద్యార్థినులకు సైకిళ్లను కొనిచ్చిన బుల్లితెర నటి

Tollywood: ఈ అందాల తారది ఎంత గొప్ప మనసో.. 100 మంది పేద విద్యార్థినులకు సైకిళ్లను కొనిచ్చిన బుల్లితెర నటి


ప్రముఖ బుల్లితెర నటి, కమలి సీరియల్ ఫేమ్ విజయ బాబర్ తన గొప్ప మనసును చాటుకుంది. పేద విద్యార్థినులకు అండగా నిలిచి అందరి మన్ననలు అందుకుంటోంది. కొల్హాపూర్ జిల్లాలోని కురుంద్వాడ్‌లోని ఒక పాఠశాలను సందర్శించిన నటి 100 మంది బాలికలకు సైకిళ్లను కొనిచ్చింది. ఈ బాలికలు ప్రతిరోజూ ఇంటి నుంచి పాఠశాలకు 8 నుంచి 10 కి.మీ దూరం ప్రయాణిస్తారు. ఆ ప్రాంతంలో పాఠశాలకు వెళ్లి రావడానికి ఉన్నది ప్రజా రవాణా వ్యవస్థనే. కానీ ఆ మార్గంలో బస్సులతో పాటు ఇతర వాహనాలు పరిమిత సంఖ్యలోనే తిరుగుతుంటాయి. కాబట్టి సమయానికి పాఠశాలకు చేరుకోవడం. తిరిగి రావడం ఈ బాలికలకు బాగా ఇబ్బందికరంగా తయారయ్యింది. ఈ విషయాన్ని గ్రహించిన విజయ బాబర్ తన వంతుగా 100 మంది విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసింది. ‘ఈ బాలికల కళ్లలో చదువుకోవాలన్న కలను చూశాను. ఇప్పుడు ఆ కలను సాకారం చేయడంలో నేను ఓ చిన్న పాత్ర పోషించినందుకు చాలా ఆనందంగా ఉంది.
రోజువారీ హడావిడి, దూర ప్రయాణం.. ఇలా విద్యార్థినుల ఇబ్బందులను చూసిన తర్వాత వారికి నా వంతు ఏదైనా సహాయం చేయాలనిపించింది. అందులో భాగంగానే అమ్మాయిలకు సైకిళ్లను కానుకగా అందజేశాను. వారు తమ చేతుల్లోకి సైకిళ్లను తీసుకున్నప్పుడు వారి ముఖాల్లోని చిరునవ్వును చూసి, నాకు తెలియకుండానే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఒక సాధారణ సైకిల్ చదువుకునే అమ్మాయిలకు ఎంత సహాయం చేస్తుందో నాకు బాగా తెలుసు’ అని నటి కమ్లి సీరియల్ నటి విజయ బాబర్ చెప్పుకొచ్చింది.

ఈ నటి చదువుకోవడం ద్వారా ఇంత దూరం వచ్చింది. చదువు ప్రాధాన్యం ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆమె తన సొంత గ్రామంలో ఒక కళాశాలను ప్రారంభించాలని కలలు కంటుంది. అక్కడ తనలాంటి నేర్చుకోవాలని దృఢనిశ్చయంతో ఉన్న చాలా మంది అమ్మాయిలు చదువుకోవచ్చు. కమలి నటి ప్రయాణం ఆమె విజయాలు ప్రశంసనీయం మాత్రమే కాదు, స్ఫూర్తిదాయకం కూడా.

ఇవి కూడా చదవండి

పేద విద్యార్థినులతో కలిసి సైకిల్ తొక్కుతోన్న నటి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *