ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటుల్లో చాలా మంది నాటక రంగం నుంచి వచ్చిన వారే. దివంగత నటుడు ఎన్టీఆర్ మొదలు నేటి స్టార్ హీరోలు, సపోర్టింగ్ ఆర్టిస్టుల్లో చాలా మంది సినిమాల్లోకి రాక ముందు రంగ స్థలంపై సత్తా చాటిన వారే. పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ నటి కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆమె స్కూల్ డేస్ లో, కాలేజీ డేస్ లోనూ పలు నాటక ప్రదర్శన పోటీల్లో పాల్గొంది. తన అభినయ ప్రతిభకు ప్రతీకగా పలు బహుమతులు కూడా గెల్చుకుంది. ఆ తర్వాత నటిగా బుల్లితెరకు పరిచయమైంది. యాంకర్ గా పలు టీవీ షోలను సక్సెస్ ఫుల్ గా రన్ చేసింది. కొన్ని సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లోనూ అడుగు పెట్టి జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిపోతోంది. మరి ఇంతకీ ఆమె ఎవరో ఈపాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. యస్.. తన మరెవరో కాదు గత కొన్ని రోజులుగా తన పదునైన రాజకీయ ప్రసంగాలతో వార్తల్లో నిలుస్తోన్న యాంకర్ శ్యామల.
మాజీ సీఎం, వైఎస్సార్సీపీ నేత జగన్ ను అమితంగా ఆరాధించే శ్యామల గత కొన్నేళ్లుగా వైఎస్సార్ సీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేసింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం జగన్ వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్యామలకు కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె పార్టీ కోసం తనదైన శైలిలో గళం వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేస్తోంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ను ఎదుర్కొంటోంది. ఇటీవల కొందరు యాంకర్ శ్యామల పాత ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఆమెను ట్రోల్ చేశారు. తాజాగా వీటిపై స్పందించిన శ్యామల ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో వరుసగా పోస్టులు పెట్టింది.
ఇవి కూడా చదవండి
చిన్నప్పుడు వివిధ సందర్భాల్లో తాను దిగిన పాత ఫొటోల ను షేర్ చేసిన శ్యామల.. ‘మీరు నా కోసం చూపించిన అపారమైన ప్రేమ, అనురాగం, ఆప్యాయతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి నా కుటుంబం కోసం అనేక కష్టాలను ఎదుర్కొంటూ, ఎన్నో పరీక్షలను తట్టుకొని, జీవిత పోరాటంలో ముందుకు సాగాను. అలాంటి నా చిన్ననాటి అమూల్యమైన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసేందుకు మీరు తీసుకున్న శ్రమను మాటల్లో వ్యక్తం చేయలేను. నా బాల్య స్మృతులను వెతికి, నా హృదయానికి చేరువ చేసే ఫోటోలను నా దాకా తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. మీ ప్రేమ, ఆదరణ, నమ్మకానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
యాంకర్ శ్యామల ట్వీట్..
మీరు నా కోసం చూపించిన అపారమైన ప్రేమ, అనురాగం, ఆప్యాయతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి నా కుటుంబం కోసం అనేక కష్టాలను ఎదుర్కొంటూ, ఎన్నో పరీక్షలను తట్టుకొని, జీవిత పోరాటంలో ముందుకు సాగాను.
అలాంటి నా చిన్ననాటి అమూల్యమైన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు… pic.twitter.com/tJWEsHOr5c
— Are Syamala (@AreSyamala) February 16, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.