ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు.. ఈ మధ్య అన్ని సినిమా వాళ్ల కబుర్లే. వాళ్ల సినిమాకు సంబంధించిన విశేషాలు, డేటింగ్ రూమర్స్, పెళ్లి వార్తలు.. ఇలా కంటెంట్ అంతా వారి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్య సినిమా స్టార్స్ చిన్నప్పటి ఫోటోలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. అందులో ఉన్నవారిని.. ఇప్పుడు పలానా స్టార్ అంటే కొందరు గుర్తుపట్టలేకపోతున్నారు. ఇప్పుడు మీ ముందకు ఓ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో తీసుకొచ్చాం. తను ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న యాక్ట్రస్. క్యూట్ స్మైల్‌తో.. చదువుల తల్లిలా ఉన్న ఆ పాపను ఏమైనా గుర్తు పట్టగలిగారా…? అయ్యో కష్టంగా ఉందా.. ఇక మేమే చెప్పేస్తాం లెండి.
తను సంయుక్త మీనన్. ఈ అమ్మడు తెలుగులో ఫస్ట్ మూవీ పవన్ కళ్యాణ్‌తో చేసింది. ఆ మూవీ హిట్ అవ్వడంతో వరసగా అవకాశాలు వచ్చాయి. తను తర్వాత చేసి బింబిసార, సార్ సినిమాలు కూడా బాగా ఆడాయి. ఆ తర్వాత వీరూపాక్ష, డెవిల్ చిత్రాల్లో నటించింది. లవ్ మీ చిత్రంలో మంచి పాత్రలో మెరిసింది. .. ఆ తర్వాత వరుసగా విజయాలు నమోదు చేసింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ ప్రజంట్ తెలుగులో వరస సినిమాలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉంది. నిఖిల్ సరసన స్వయంభుతో పాటు శర్వానంద్, బెల్లకొండ శ్రీనివాస్‌తో సినిమాలు చేస్తోంది సంయుక్త.
కాగా చదువుకునే రోజుల్లో సంయుక్త స్కూల్ టాపర్ అట. ఇక విషయం తెలిసిన ఫాలోవర్స్ మా హీరోయిన్ మల్టీ టాలెంటెడ్ అని తెగ సంబరపడిపోతున్నారు. తన చిన్నప్పుడు ఫోటో ఇప్పడు వైరల్ అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.