Headlines

Tollywood: ఈ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్స్ లిస్టు పెద్దదే.! సినిమాల కంటే ఎక్కువగా డేటింగ్ రూమర్స్ ..

Tollywood: ఈ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్స్ లిస్టు పెద్దదే.! సినిమాల కంటే ఎక్కువగా డేటింగ్ రూమర్స్ ..


బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే ఒక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత జీవితం కంటే వృత్తిపరమైన జీవితమే ఎక్కువగా వార్తలలో నిలిచింది. అనన్య తన షార్ట్ ఫిల్మ్ కెరీర్‌లో చాలా మంది ప్రముఖ సెలబ్రెటీలతో డేటింగ్ చేసిందని రూమర్స్ వినిపించాయి. ఇప్పటివరకు అనన్య పేరు చాలా మంది సెలబ్రిటీలతో ముడిపడి వచ్చింది. అనన్య పాండే బాయ్‌ఫ్రెండ్స్ లిస్ట్‌లో మొదటి పేరు నటుడు ఇషాన్ ఖట్టర్. ఇషాన్, అనన్య కలిసి ‘ఖాలీ పీలీ’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సినిమా విడుదలైన తర్వాత కూడా చాలా చోట్ల వీరిద్దరూ కలిసి కనిపించారు. కానీ వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. చివరకు ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

ఆ తర్వాత అనన్య పాండే, బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం నడిచింది. ఇద్దరు కలిసి విదేశాల్లో కనిపించారు. వీరిద్దరూ విదేశాల్లో ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది మాత్రమే కాదు, ఇద్దరూ ఒక డిన్నర్ డేట్ సమయంలో కూడా కనిపించారు. అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరి బ్రేకప్ టాక్ నడుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. అలాగే అనన్య పేరు క్రికెటర్ హర్దిక్ పాండ్య, విజయ్ దేవరకొండ పేర్లు కూడా వినిపించాయి.

కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంతో సినీ కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ మూవీ తర్వాత ‘లైగర్’, ‘పతి పత్నీ ఔర్ వో’ , ‘డ్రీమ్ గర్ల్ 2’ వంటి చిత్రాలలో కూడా కనిపించింది. అనన్య సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. నెట్టింట ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *