Tollywood: ఒకప్పుడు స్విమ్మింగ్‌లో నేషనల్ ఛాంపియన్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తు పట్టారా?

Tollywood: ఒకప్పుడు స్విమ్మింగ్‌లో నేషనల్ ఛాంపియన్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తు పట్టారా?


Tollywood: ఒకప్పుడు స్విమ్మింగ్‌లో నేషనల్ ఛాంపియన్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడామె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. అలాగనీ ఆమె పాతిక, ముప్పై సినిమాలేమీ చేయలేదు. ఇప్పటివరకు కేవలం 4 సినిమాల్లోనే నటించింది. అయితేనేం తన అందం, అభినయంతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దక్షిణాదికి చెందిన ముద్దుగుమ్మ ఇప్పటివరకు 4 సినిమాల్లో నటించింది. అందులో రెండు ఏకంగా పాన్ ఇండియా సినిమాలే. హీరోయిన్ గా నటించిన రెండో సినిమాతోనే రూ. 450 కోట్లు రాబట్టిందీ అందాల తార. అన్నట్లు టాలీవుడ్ హీరోయిన్ మల్టీ ట్యాలెంటెడ్. చిన్నప్పటి నుంచి ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో బాగా చురుగ్గా పార్టిసిపేట్ చేసింది. ముఖ్యంగా స్విమ్మింగ్ లో స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ లో సత్తా చాటింది. ఎన్నో టైటిల్స్ సొంతం చేసుకుంది. పై ఫొటోలో ఉన్నవి అవే. మరి ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు కాంతార ఫేమ్, ఇప్పుడు నితిన్ తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న సప్తమి గౌడ. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తమ్ముడు సినిమా జులై 04 రిలీజ్ కానుంది. నేపథ్యంలో సప్తమి గౌడకు సంబంధించి కొన్ని ఆసక్తికర ఫొటోలు, విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

బెంగళూరులో పుట్టి పెరిగిన సప్తమి గౌడ 2020లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. పాప్ కార్న్ మంకీ టైగర్ అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత రిషబ్ శెట్టి సరసన కాంతారా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ది వ్యాక్సిన్ వార్ లోనూ కీలక పాత్రలో ఆకట్టుకుంది. ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తోన్న తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తోంది.

వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తమ్ముడు సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ మరో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సుమారు 18 ఏళ్ల తర్వాత అలనాటి హీరోయిన్ లయ మళ్లీ వెండితెరపై కనిపించేందుకు రెడీ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *