సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వాలంట పెద్ద స్టార్లు కావాలా? మిలియన్ బడ్జెట్ కావాలా? భారీ విజువల్స్ కావాలా? ఇవేం అక్కర్లేదు.. కంటెంట్ ఉంటే చాలు.. కథనం జనాల్ని ఎంగేజ్ చేస్తే చాలు.. మంచి ఫీల్ ఇస్తే చాలు… జనాల్ని మనసారా నవ్విస్తే చాలు. అలా వచ్చిన చాలా చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేసి సంచలన విజయాలు నమోదు చేశాయి. అలా 2006లో వచ్చి మంచి విజయం సాధించిన మూవీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
‘కితకితలు’ మూవీ తెలియని తెలుగు ప్రేక్షుకులు ఉండదు. ఈ సినిమా ఇప్పుడు టీవీలో వచ్చినా ఎవరూ చానల్ మార్చరు. పొట్టచక్కలయ్యేలా చేసే కామెడీతో పాటు మంచి మెసేజ్ ఈ సినిమా సొంతం. అందుకే మూవీ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. కామెడీ సినిమాలు తీయడంతో అందె వేసిన చేయిగా గుర్తింపు పొందిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు ఈ సినిమా లైఫ్ టైం మెమరబుల్. అయితే ఈ సినిమాను కేవలం రూ. 60 లక్షలు బడ్జెట్‌తో తీస్తే పెట్టిన మొత్తానికి 15 రెట్లు అంటే రూ. 9 కోట్లకు పైగా వసూలు చేసి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
దర్శకుడు, రచయిత, నిర్మాతగా ఈ.వీ.వి. సత్యనారాయణ తన బ్రాండ్ గట్టిగా చూపించారు. అప్పటి వరకూ లైట్ కామెడీ రోల్స్‌లో కనిపించిన అల్లరి నరేష్.. ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ లీడ్‌లో అదరగొట్టేశాడు. కథానాయిక గీతా సింగ్ ఈ సినిమాకు ఆయువు పట్టు. సినిమాలో తనను ఇబ్బంది పెట్టే సీన్లు ఉన్నా.. అవేమీ పట్టించుకోకుండా.. ఆమె ప్రేక్షకులకు వినోదం పంచడానికి ముందుకొచ్చింది. ఇక బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, ధర్మవరపు, ఎల్బీ శ్రీరామ్, వేణు మాధవ్, సునీల్, జయప్రకాష్ రెడ్డి, బాబు మోహన్, ఏ.వి.ఎస్ వంటి నటులు తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయి నవ్వులు పంచారు. కితకితలు.. ఒక్క సినిమా కాదు… ప్రేక్షకులకు నవ్వులు పంచితే.. వారు కాసుల పంట మేకర్స్‌కు అందిస్తారని చెప్పిన ఓ విజయ గాథ. టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు గొప్ప కలలుంటే, అలాంటి కలల్లో మొదటి చాప్టర్ ఇదే అని చెప్పవచ్చు!

Kitakitalu Movie
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.