Tollywood: చేసింది 5 సినిమాలు.. అన్నీ డిజాస్టర్లే.. మిస్ వరల్డ్‏కు కలిసిరాని అదృష్టం..

Tollywood: చేసింది 5 సినిమాలు.. అన్నీ డిజాస్టర్లే.. మిస్ వరల్డ్‏కు కలిసిరాని అదృష్టం..


సినీరంగంలో ఇప్పుడిప్పుడే కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంటుంది ఈ హీరోయిన్. సాధారణంగా మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన తర్వాత చాలా మంది అమ్మాయిలు ఇండస్ట్రీలో సత్తా చాటారు. ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, లారా దత్, సుష్మితా సేన్ ఇలా ఎంతోమంది సినీ పరిశ్రమలో తమదైన ముద్ర వేశారు. వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అమ్మాయి మాత్రం డిఫరెంట్. మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది.. కానీ ఇండస్ట్రీలో సరైన క్రేజ్ మాత్రం అందుకోలేకపోతుంది. ఇప్పటివరకు 5 సినిమాల్లో నటించింది. కానీ ఆ సినిమాలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీకి ఇప్పటివరకు ఎలాంటి గుర్తింపు రాలేదు.. ప్రస్తుతం ఈ అమ్మడు సక్సెస్ కోసం వెయిట్ చేస్తోంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మానుషి చిల్లర్.

2017 మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది మానుషి చిల్లర్. ఆ తర్వాత వెంటనే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సరసన సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీతో వెండితెరకు పరిచయమైంది. డైరెక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ సినిమాను దాదాపు రూ.220 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించగా.. 2022లో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా రూ.68.25 కోట్లు మాత్రమే రాబట్టింది. ఫస్ట్ మూవీ ప్లాప్ కావడంతో మానుషికి అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత హిందీలోనే విక్కీ కౌశల్ జోడిగా ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమాలో నటించినప్పటికీ ఈ మూవీ సైతం ప్లాప్ అయ్యింది. దీంతో మానుషికి సినీరంగంలో ముందుకు వెళ్లడం మరింత సవాలుగా మారింది.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి అలయ ఎఫ్ స్టార్స్ సినిమా సైతం బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత ఆమె నటించిన తారిఖ్ చిత్రం డిజాస్టర్ అయ్యింది. మెగా హీరో వరుణ్ తేజ్ జోడిగా ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది. దీంతో మానుషికి ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు. ప్రస్తుతం మానుషికి ఆఫర్స్ వస్తున్నప్పటికీ క్రేజ్ మాత్రం రాలేదు.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *