
కేజీఎఫ్, కేజీఎఫ్2ల తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని మరీ హిట్ కొట్టింది శ్రీనిధి శెట్టి. నేచురల్ స్టార్ నానితో కలిసి ఆమె నటించిన హిట్ 3
బ్లాక్ బస్టర్ గా నిలిచింది. . శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 100కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇందులో శ్రీనిధి అభినయానికి కూడా మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం మరో టాలీవుడ్ క్రేజీ హీరో సిద్దు జొన్నలగడ్డ తో కలిసి తెలుసు కదా అనే మూవీలో నటిస్తోందీ అందాల తార. ఇందులో శ్రీనిధితో పాటు రాశీ ఖన్నా మరో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ మూ వీ షూటింగ్ లో బిజీగా ఉంటోంది శ్రీనిధి. కాగా మిగతా హీరోయిన్లతో పోల్చితే సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంటుందీ అందాల తార. ఎప్పడో ఒకసారి తన ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తన వృత్తి, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా శ్రీనిధి షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇందులో ఆమె బాబును లాలిస్తూ పాలు పట్టింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు కాసేపు గందరగోళంలో పడ్డారు. ఏంటీ? శ్రీనిధికి పిల్లలు ఉన్నారా? పెళ్లి ఎప్పుడైందని సందేహాలు లేవనెత్తారు.
అయితే శ్రీనిధి షేర్ చేసిన పోస్ట్ పూర్తిగా చూశాక అసలు విషయం అర్థమైంది. ఇంతకీ ఆ పిల్లలు ఎవరంటే ఆమె సోదరుడి పిల్లలు. పిల్లలతో కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రీనిధి శెట్టి.. ‘ఇది నేను నిద్ర లేచినప్పుడు. లేచేసరికి నా పిల్లలు ఇలా నా పక్కనే ఉన్నారు. నాకు తెలుసు. నేను ఉత్తమ అత్త అని. ఈ విషయం ఖచ్చితంగా చెప్పగలను’ అంటూ తన పోస్ట్ కి క్యాప్షన్ రాసుకొచ్చిందీ అందాల తార.
శ్రీనిధి శెట్టి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
శ్రీనిధి శెట్టి షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిని చూసిన వారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఎంత క్యూట్ గా ఉందో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.