గతేడాది కాలంగా ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈ అమ్మడుకు తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇటీవలే మరో సక్సెస్ అందుకుంది. దీంతో స్నేహితులతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.
ఆ వయ్యారి మరెవరో కాదండి.. యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. ఇటీవలే విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి భారీ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్ లో చేరే దిశగా అడుగులు వేస్తుంది.
తాజాగా తన సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న మీనాక్షి ఇప్పుడు ఎడార్లుల్లో విహరిస్తూ మరోకసారి తన తన ఆనందాన్ని రెట్టింపు చేసుకుంది. ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లిన ఈ ముద్దుగుమ్మ. అక్కడ వీధుల్లో తిరుగుతూ ఎడారిలో విహరిస్తూ ఎంజాయ్ చేస్తుంది.
2025లో ఇది తన మొదటి ట్రిప్ అని కూడా చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి. తాజాగా ఇన్ స్టా ద్వారా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో హిట్ అందుకున్న మీనాక్షి.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. దీంతో ఇప్పుడు ఈ అమ్మడు ఫుల్ జోష్ మీదుంది. అలాగే మీనాక్షి చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది.