Tollywood: స్టార్ హీరోయిన్ తమ్ముడి భార్య.. బుల్లితెరపై తోపు హీరోయిన్.. ఇప్పుడు ఆర్థిక సమస్యలతో..

Tollywood: స్టార్ హీరోయిన్ తమ్ముడి భార్య.. బుల్లితెరపై తోపు హీరోయిన్.. ఇప్పుడు ఆర్థిక సమస్యలతో..


బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో అందం, సహజ నటనతో కట్టిపడేసింది. కానీ ప్రేమ, పెళ్లి, విడాకులు ఆమె జీవితాన్ని ఊహించని మలుపు తిప్పాయి. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఓ స్టార్ హీరోయిన్ తమ్ముడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప జన్మించింది. కానీ కొన్ని రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. డివోర్స్ తర్వాత పలు ప్రైవేట్ సాంగ్స్ చేసిన ఆ బ్యూటీ.. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంది. ప్రస్తుతం ఆమె బట్టలు అమ్ముకుంటుంది. ఆమె మరెవరో కాదు.. చారు అసోప. కొన్నాళ్ల క్రితం హిందీలో వరుస సీరియల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చారు అసోప.. మిస్ యూనివర్స్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుష్మితా సేన్ మరదలు. అంటే ఆమె తమ్ముడి భార్య.

సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్, చారు అసోపా 2019లో వివాహం చేసుకున్నారు. వీరికి 2021లో కుమార్తె జియానా జన్మించింది. కానీ పెళ్లైన మూడు సంవత్సరాలలోనే మనస్పర్థలు రావడంతో 2023లో విడాకులు తీసుకున్నారు. కూతురితో కలిసి చారు అసోప ఒంటరిగా జీవిస్తుంది. తాజాగా చారు అసోప బట్టలు అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. దీంతో ఆమె ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతుందని.. అందుకే ముంబై వదిలి వెళ్లిపోయిందని.. ప్రస్తుతం అవకాశాలు రాకపోవడంతో బట్టలు అమ్ముతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై చారు అసోప స్పందించింది.

హిందూస్తాన్ టైమ్స్‌తో చారు అసోప మాట్లాడుతూ ..”ముంబైలో నివసించడం అంత సులభం కాదు. అక్కడ అద్దె, ఇతర ఖర్చులతో సహా నెలకు రూ.లక్ష నుంచి 1.5 లక్షల వరకు అవుతుంది. అలాగే నేను షూటింగ్ కోసం నైగావ్ వెళ్ళినప్పుడు, జియానాను నానీ సంరక్షణలో వదిలి వెళ్లడం నాకు ఇష్టం ఉండేది కాదు. అప్పుడు ఎంతో కష్టంగా అనిపించేది. అందుకే నేను నేను పూర్తి ప్రణాళికతో బికనీర్ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఇది తొందరపాటు నిర్ణయం కాదు. ఇప్పుడు బట్టలు అమ్మడం గురించి చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఒక వ్యక్తి కొత్తగా ఏదైనా ప్రారంభించినప్పుడల్లా, ఇబ్బందులు తప్పవు. నాకు కూడా అదే జరుగుతోంది. నేనే ఆర్డర్లు తీసుకుంటున్నాను, ప్యాకేజింగ్ చేస్తున్నాను, స్టాక్ మేనేజ్ చేస్తున్నాను, అన్నీ నేనే చేస్తున్నాను. నేను నటించడం ప్రారంభించినప్పుడు కూడా చాలా కష్టపడ్డాను. ఇప్పుడు నేను జియానాపై నా పూర్తి శ్రద్ధ పెట్టడానికి ఈ పనిని ప్రారంభించాను” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *