Tollywood: 17 ఏళ్లకే యాక్సిడెంట్‏లో కాలు పోగొట్టుకున్న హీరోయిన్.. ఇప్పుడు విలన్‏గా రఫ్పాడిస్తోంది.. ఎవరంటే..

Tollywood: 17 ఏళ్లకే యాక్సిడెంట్‏లో కాలు పోగొట్టుకున్న హీరోయిన్.. ఇప్పుడు విలన్‏గా రఫ్పాడిస్తోంది.. ఎవరంటే..


భారతదేశంలోనే అత్యంత ప్రశంసలు అందుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. చిన్నప్పటి నుంచి శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న ఆమె.. ఒకప్పుడు లెజెండరీ డ్యాన్సర్. కానీ 17 ఏళ్ల వయసులోనే భయంకరమైన ప్రమాదంలో చిక్కుకుపోయింది. ఆ ఘటనలోనే తన కాలును కోల్పోయింది. దీంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. యాక్సిడెంట్ లో కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు తన కాలును తొలగించాలని చెప్పారు. జీవితం మీద ఎన్నో ఆశలతో ఉన్న ఆమె తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. కాలు పోగొట్టుకున్న తర్వాత ఎన్నో అవమానాలు, సవాళ్లను ఎదుర్కొంది. చివరకు కృత్రిమ కాలు ధరించి తిరిగి తన కలలను నెరవేర్చుకుంది. మళ్లీ డ్యాన్సర్ గా మారి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. అత్యంత ప్రతిభావంతులైన భరతనాట్య నృత్యకారులలో ఒకరిగా నిలిచింది. ఆమె మరెవరో కాదు.. సీనియర్ నటి సుధా చంద్రన్.

సుధా చంద్రన్.. ఈ పేరు ఇప్పటి తరానికి అంతగా తెలియకపోవచ్చు. కానీ 90’s సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు కథానాయికగా వెండితెరపై అలరించిన ఆమె.. ఇప్పుడు బుల్లితెరపై విలన్ పాత్రలతో రఫ్పాడిస్తుంది. కానీ 1981లో జరిగన ఘోర ప్రమాదం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. కాలు పోగొట్టుకున్న తర్వాత తాను బ్రతకాలని అనుకోలేదని.. కానీ ఆ సమయంలో తన తల్లిదండ్రులు తనకు తోడుగా ఉన్నారని.. తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగడానికి వారే కారణమని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కాలు పోగొట్టుకున్న తర్వాత తన జీవితం ఆధారంగా తెరకెక్కించిన మయూరి చిత్రంలో తన పాత్రలో సుధా చంద్రన్ నటించింది.

ఇవి కూడా చదవండి

మయూరి సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది. ఆతర్వాత బుల్లితెరపై పలు సీరియల్స్ చేసింది. ఇప్పటికీ సీరియల్స్ లో తల్లిగా, అత్త పాత్రలో నటిస్తుంది. అలాగే విలన్ పాత్రలతో అదరగొట్టేస్తుంది. సుధా చంద్రన్ 1994లో అసిస్టెంట్ డైరెక్టర్ రవి డాంగ్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. దీంతో వీరు చెంబూర్‌లోని ఒక ఆలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. వీరు పిల్లలు కనకూడదని వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు సుధా చంద్రన్.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *