Toxic Movie: రాఖీ భాయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యశ్ టాక్సిక్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. అధికారిక ప్రకటన

Toxic Movie: రాఖీ భాయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యశ్ టాక్సిక్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. అధికారిక ప్రకటన


‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయాడు కన్నడ సూపర్ స్టార్ యశ్ అలియాస్ రాఖీ భాయ్. అయితే ఈ కేజీఎఫ్ 2 తర్వాత భారీ గ్యాప్ తీసుకున్నాడు రాఖీ భాయ్. దీంతో అతని తర్వాతి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం టాక్సిక్ అనే మరో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు యశ్. ఈ సినిమా విడుదల కోసం భారతదేశంలోనే కాదు, విదేశీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ‘టాక్సిక్’ సినిమా హాలీవుడ్ స్థాయిలో నిర్మిస్తున్నారు. దీనికి నిదర్శనంగా ఇప్పుడు ఒక పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. దీంతో పాటు, యష్ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగ ప్రకటించారు. ‘టాక్సిక్’ సినిమా విడుదల ఒక సంవత్సరం తరువాత అంటే 2026 మార్చి 19 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కొత్తగా రిలీజ్ చేసిన పోస్టర్ లో యశ్ ఒక కరుడు గట్టిన గ్యాంగ్ స్టర్ లా మెషిన్ గన్ తో నడుస్తూ కనిపించాడు. ఇక రాఖీ భాయ్ ధరించిన చెవిపోగులు, హెయిర్ స్టైల్, కౌబాయ్ టోపీ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘టాక్సిక్’ సినిమా పోస్టర్ విడుదలైన నిమిషాల్లోనే వైరల్ అయింది. అభిమానులు, నెటిజన్లు ఈ పోస్టర్ పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రముఖ మలయాళ చిత్ర దర్శకురాలు గీతు మోహన్‌దాస్ ‘టాక్సిక్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ‘కేజీఎఫ్ 2’ తర్వాత యష్ నటిస్తున్న సినిమా ‘టాక్సిక్’ కాబట్టి, ‘టాక్సిక్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయన తార, బాలీవుడ్ అందాల తార కియారా అద్వానీలు కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సమ్మర్ కానుకగా..

ఇక టాక్సిక్ సినిమాకు ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. ముంబైలో ఉంటున్న ప్రముఖ బ్రిటీష్ నటుడు బెనెడిక్ట్ గారెట్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

టాక్సిక్ సినిమా గ్లింప్స్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *