TS Cabinet: సన్న బియ్యానికి రూ. 500 బోనస్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!

TS Cabinet: సన్న బియ్యానికి రూ. 500 బోనస్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!


రాష్ట్ర సచివాలయంలో జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. మరో రెండు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవునున్న నేపథ్యంలో ఇవాళ్టి కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికల హామీలు సహా మేనిఫెస్టోపై కేబినెట్ చర్చించింది. ఇప్పటి వరకు వేసిన కేబినెట్ సబ్ కమిటీలు, వాటి నివేదికలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది.

ముఖ్యంగా ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీకి భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మద్నూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసేందుకు మంత్రి మండలి అంగీకరించింది. అలాగే, హన్మకొండ , వరంగల్ జిల్లాల పరిధి పెంపునకు ఆమోదం తెలిపింది. ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు గ్రీనిసిగ్నల్ ఇచ్చింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్‌పై చర్చించిన కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *