UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో నయా రికార్డు.. ఏడాదిలో 46 శాతం పెరుగుదల

UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో నయా రికార్డు.. ఏడాదిలో 46 శాతం పెరుగుదల


డిజిటల్ లావాదేవీల విషయంలో భారతీయులు ప్రపంచ దేశాలకు గట్టి పోటీనిస్తున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 2024లో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) లావాదేవీల సంఖ్య రికార్డు స్థాయిలో 16.73 బిలియన్లకు చేరిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా వెల్లడించింది. . నవంబర్‌లో యూపీఐ లావాదేవీల సంఖ్య 15.48 బిలియన్‌లుగా ఉన్నాయని తెలిపింది. అలాగే ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, శ్రీలంక, మారిషస్, భూటాన్, నేపాల్ వంటి ఏడు దేశాలలో యూపీఐ ఉపయోగించి లావాదేవీలు చేయవచ్చు.

లావాదేవీల పరిమాణంతో పాటు యూపీఐ లావాదేవీల విలువ కూడా పెరిగింది. విలువ పరంగా నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో యూపీఐ 8 శాతం పెరుగుదలను నమోదు చేసింది. నవంబర్‌లో మొత్తం యూపీఐపీ లావాదేవీల విలువ రూ.21.55 లక్షల కోట్లు కాగా డిసెంబర్‌లో రూ.23.25 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం 2024 సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే 2023లో 118 బిలియన్లుగా ఉన్న లావాదేవీల సంఖ్య భారీగా 46 శాతం పెరిగి 2024లో 172 బిలియన్లకు చేరుకుంది. విలువ పరంగా కూడా 2023తో పోలిస్తే 2024లో పెరుగుదల ఎక్కువగా ఉంది. 2024లో యూపీఐ ద్వారా రూ.247 లక్షల కోట్ల లావాదేవీలు జరగ్గా 2023లో నమోదైన విలువ రూ.183 లక్షల కోట్లుగా ఉంది. 

ఇతర చెల్లింపుల విషయానికి వస్తే ఐఎంపీఎస్ లావాదేవీలు డిసెంబర్ 2024లో 8 శాతం పెరిగాయి. అలాగే నవంబర్‌లో 40.8 కోట్లు, 2024 అక్టోబర్‌లో 46.7 కోట్లతో పోలిస్తే 44.1 కోట్లు నమోదయ్యాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే డిసెంబర్‌లో ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీల పరిమాణంలో 6 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంటే ఈ ఒక్క నెలలోనే లావాదేవీల విలువ రూ.38.2 కోట్లకు చేరుకుంది. నవంబర్‌లో గణాంకాలు రూ.35.9 కోట్లుగా ఉండగా, అక్టోబర్‌లో రూ.34.5 కోట్లుగా ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *