Urine Color: మూత్రం రంగును బట్టి ఆరోగ్య సమస్యలు చెప్పొచ్చు.. ఏ రంగు ఏ వ్యాధిని సూచిస్తుందో తెలుసుకోండి..

Urine Color: మూత్రం రంగును బట్టి ఆరోగ్య సమస్యలు చెప్పొచ్చు.. ఏ రంగు ఏ వ్యాధిని సూచిస్తుందో తెలుసుకోండి..


మనం రోజూ విసర్జించే మూత్రం మన శరీర పనితీరు, ఆరోగ్య సమస్యల గురించి ఎన్నో విషయాలు తెలియజేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. మనం నోటి ద్వారా లోపలికి తీసుకునే ప్రతి పదార్థంలోని విషాలను బయటకు పంపే బాధ్యత కిడ్నీలకే ఉంటుంది. అందుకే కిడ్నీ ఆరోగ్యం ఒక్క సారి పాడైతే దాని నుంచి బయటపడటం అంత తేలిక కాదంటారు. మనం మూత్రం రంగుని బట్టి కూడా మన కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయనే విషయాన్ని గుర్తించవచ్చని వైద్యులు చెప్తున్నారు. చాలా మందికి ఏదైనా చిన్నపాటి అనారోగ్యం వచ్చినా కూడా వెంటనే మూత్రం రంగులో తేడా వస్తుంటుంది. జ్వరం వచ్చినప్పుడు లేదా ఏదైనా సమస్యకు మందులు వాడినప్పుడు కూడా మూత్రం వెంటనే పసుపురంగులోకి మారుతుంది. ఇది సాధారణమైన విషయమే. అయితే, కొన్ని సందర్భాల్లో మూత్రం రంగు ఎరుపు, తెలుపు, ముదురు రంగుల్లో కనిపిస్తుంటుంది. ఇలా జరగడం వెనకాల బలమైన కారణాలే ఉన్నాయని నిపుణులు అంటున్నారు అవేంటో చూద్దాం..

ఎరుపు రంగు

కొన్ని సార్లు బీట్ రూట్ వంటి రంగుతో ఉన్న పదార్థాలు తిన్నప్పుడు మూత్రం ఎరుపు రంగులో కనిపిస్తుంది. కానీ, కొన్ని సందర్భాల్లో ఎరుపు రంగు మూత్రం మీ కిడ్నీల అనారోగ్యాన్ని సూచిస్తుంది. కిడ్నీలో రాళ్లు, ఇతర సమస్యలు ఉన్నప్పుడే మూత్రంలోకి రక్తం వచ్చి చేరుతుంది. అందుకే ఈ సంకేతం ఉన్నప్పుడు తీవ్రమైన అనారోగ్య సమస్యగా భావించి వెంటే వైద్యులను సంప్రదించాలి.

ముదురు పసుపు, నారింజ రంగు

లేత పసుపు రంగు మూత్రం దాని సహజ రంగు కానీ.. ముదురు పసుపు, నారింజ రంగు మూత్రం మీరు నీరు ఎక్కువగా తీగడం లేదని చెప్పే సంకేతం. ఎక్కువగా పని చేయడం, వ్యాయామం, వేడిగా ఉండే ప్రదేశంలో నివసించడం వల్ల ఎక్కువగా డీహైడ్రేషన్‌ వస్తుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే కిడ్నీలో రాళ్లు తయారవుతాయి.

పాల రంగు

యూరిన్ లో ఇన్ ఫెక్షన్ ఉన్నప్పుడు మూత్రం తెలుపు రంగులో కనపడతుంది. ఇది బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్లు, బోధకాలు వ్యాధిని సూచిస్తుంది.

కాఫీ రంగు

మూత్రం కాఫీ రంగులో ఉంటే అది కాలేయ అనారోగ్యాన్ని సూచిస్తుంది. దీంతో పాటు అరుగుదల లోపాలు, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు వేధిస్తుంటే వైద్యులను సంప్రదించాలి.

గులాబీ రంగు

మీ మూత్రం లేత గులాబీ రంగులో ఉంటే అందులో రక్తం ఉండే అవకాశాలెక్కువ. కొన్నిసార్లు దుంపలు వంటి ఆహారాలు తినడం వల్ల మీ మూత్రం లేత గులాబీ రంగులో కనిపిస్తుంది.

ఆకుపచ్చ రంగు – నీలం రంగు

ఆకుపచ్చ మూత్రం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక నీలి రంగు ఎక్కువగా ఉండే బెర్రీలు, దుంపలు వంటివి తిన్నప్పుడు నీలి రంగు మూత్రం కనపడుతుంది. ఆర్టిఫిషియల్ కలర్స్ వాడిన ఆహారాలు తిన్నప్పుడు కూడా మూత్రం ఇలా రంగు మారుతుంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *