US Election 2024: మ్యాజిక్‌ మార్క్‌ 270.. ట్రంప్‌ వర్సెస్ కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..

US Election 2024: మ్యాజిక్‌ మార్క్‌ 270.. ట్రంప్‌ వర్సెస్ కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..


US Election 2024: మ్యాజిక్‌ మార్క్‌ 270.. ట్రంప్‌ వర్సెస్ కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ మరి కొన్ని గంటల్లో ముగియనుంది. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.. అయితే, పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సుదీర్ఘంగా, సంక్లిష్టంగా ఉండే అమెరికా ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుందో ఓ సారి చూడండి.. అమెరికా అధ్యక్ష పీఠం కోసం డెమోక్రాట్‌ అభ్యర్థి కమలా హారిస్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ హోరాహోరీగా తలపడుతున్నారు. ఇక, అమెరికాలో మొత్తం 23 కోట్లమంది ఓటర్లు ఉన్నారు. వారిలో 16 కోట్ల మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ముందస్తుగానే 7 కోట్లమంది ఓటు వేసేశారు. ఇక 1.9 కోట్ల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఓట్లు ఉంటాయి. గెలుపునకు మ్యాజిక్‌ మార్క్‌ 270. డెమోక్రాట్లు, రిపబ్లికన్లకు కంచుకోటలైన రాష్ట్రాలను మినహాయిస్తే, 7 స్వింగ్‌ స్టేట్స్‌ ఉన్నాయి.

తటస్థ రాష్ట్రాలైన అరిజోనా, జార్జియా, మిషిగన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లలో 93 ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఓట్లు ఉంటాయి. దీంతో ఇవే ఇప్పుడు కీలకంగా మారాయి. అధ్యక్షుడ్ని నిర్ణయించే రాష్ట్రాలుగా మారాయి. అమెరికాలో అధ్యక్షుడ్ని ఎన్నుకునేది ఆ దేశ ఓటర్లు కాదు. ఎలక్టోరల్‌ కాలేజీ. అందులో 538 ఓట్లుంటాయి. వాటిలో కనీసం 270 సాధించిన వారే అధ్యక్షుడవుతారు. ఓటర్లు ఇప్పుడు ఓటు వేసి ఎన్నుకునేది ఈ ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులనే. వారిని ఎలక్టర్లుగా పిలుస్తారు.

పోలింగ్‌ ముగిశాక నెలపాటు వారి ఎన్నిక ప్రక్రియ సాగుతుంది. వారంతా డిసెంబర్‌ 16న సమావేశమై అధ్యక్షునికి, ఉపాధ్యక్షునికి ఓటేస్తారు. జనవరి 6న అమెరికా కాంగ్రెస్‌ సంయుక్త సమావేశం జరుగుతుంది. ఎలక్టోరల్‌ ఓట్లను లెక్కించి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎవరో తేలుస్తారు. సెనేట్‌ అధ్యక్షుని హోదాలో ఉపాధ్యక్షుడు వారి పేర్లను ప్రకటిస్తారు. జనవరి 20న అధ్యక్షుడి ప్రమాణస్వీకారం జరుగుతుంది. ఇలా ఓటింగ్‌ తర్వాత ఎన్నిక ప్రక్రియ మరో రెండు నెలలు సాగుతుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *