Ustad Zakir Hussain: జాకీర్ హుస్సేన్‌ ఏ వ్యాధితో మరణించాడో తెలుసా! వృద్దులకు ఈ ఊపిరితిత్తుల వ్యాధి ఎంత ప్రమాదం అంటే..

Ustad Zakir Hussain: జాకీర్ హుస్సేన్‌ ఏ వ్యాధితో మరణించాడో తెలుసా! వృద్దులకు ఈ ఊపిరితిత్తుల వ్యాధి ఎంత ప్రమాదం అంటే..


పద్మవిభూషణ్, ప్రపంచ ప్రఖ్యాత తబలా వాద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. హుస్సేన్ ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (ఐపీఎఫ్) వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఐపీఎఫ్ ప్రమాదకరమైన ఊపిరితిత్తుల వ్యాధి అని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ వ్యాధిలో మొదట ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. మచ్చ కణజాలం ఏర్పడుతుంది. ఈ వ్యాధి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.

హుస్సేన్ ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ వ్యాధి బారిన పడడానికి గల కారణాలు ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు. అయితే ఈ వ్యాధి జన్యుపరమైన కారణాలు, రోగనిరోధక శక్తి సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తులలో ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా సంభవించవచ్చు. పెద్దవారికి ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం అకస్మాత్తుగా తగ్గిపోతుంది. అనంతరం మరణానికి కారణమవుతుంది.

ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ ఎంత ప్రమాదకరమైనదంటే..

IPF వ్యాధి కారణంగా ఊపిరితిత్తులకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకుతుందని పల్మోనాలజిస్ట్ డాక్టర్ భగవాన్ మంత్రి చెప్పారు. IPFలో ఊపిరితిత్తుల కణజాలంలో మచ్చ కణజాలం ఏర్పడటం ప్రారంభమవుతుంది. తర్వాత ఆక్సిజన్ తగ్గే పరిస్థితికి దారితీస్తుంది. ఇది హైపోక్సేమియాకు కారణమవుతుంది. అనంతరం మరణానికి దారి తీస్తుంది. IPAF వ్యాధి కారణంగా పల్మనరీ ఎంబోలిజం కూడా సంభవిస్తుంది. ఇందులో ఊపిరితిత్తుల సిరల్లో అడ్డుపడటం.. కూడా ప్రమాదకరంగా మారుతుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన ఈ వ్యాధి కారణంగా ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఇది గుండెపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. కార్డియాక్ అరెస్ట్‌కు కారణమవుతుంది.

ఇవి కూడా చదవండి

వయసు పెరిగిన వారికి అంటే వృద్ధులకు ఈ IPF వ్యాధి సోకితే .. ఈ వ్యాధి మరింత ప్రమాదకరంగా మారుతుందని డాక్టర్ చెప్పారు. 60 ఏళ్ల తర్వాత ఎవరికైనా ఈ వ్యాధి సోకితే.. ఆ రోగి పరిస్థితి విషమంగా మారవచ్చని అన్నారు.

IPF వ్యాధి లక్షణాలు ఏమిటంటే

  1. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  2. ఛాతీ నొప్పి
  3. విపరీతమైన దగ్గు
  4. విపరీతమైన అలసట
  5. అధికంగా బరువు తగ్గడం
  6. IPF ఎలా చికిత్స తీసుకోవాలంటే

IPF సాధారణ మందులతో చికిత్స ఇస్తారు. ఇందులో ప్రిడ్నిసోలోన్ వంటి మందులు ఉన్నాయి. ఆక్సిజన్ థెరపీ కూడా IPF చికిత్సలో సహాయపడుతుంది. అయితే ఒకసారిగా ఇన్ఫెక్షన్ పెరిగితే.. అప్పుడు ఊపిరితిత్తులపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. రోగి శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడతాడు. అటువంటి పరిస్థితిలో ప్రాణాలను రక్షించడం కష్టం కావచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *