పౌర్ణమి తిథి హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ రోజున చంద్రుడు పూర్ణ బింబంగా దర్శనం ఇస్తాడు. పౌర్ణమి రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని మత విశ్వాసం. పౌర్ణమి తిథి విష్ణువు, లక్ష్మీదేవి పూజకు కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున విష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని పూజించడం వల్ల సంపద పెరుగుతుంది. పాపాల నుండి విముక్తి లభిస్తుంది.
వైశాఖ మాసంలోని పౌర్ణమి రోజుని బుద్ధ పూర్ణిమగా కూడా జరుపుకుంటారు. ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ 2025 మే 12న వచ్చింది. ఈ శుభ తిది రోజున శుభ సమయంలో దీపానికి సంబంధించిన ఒక సాధారణ పరిహారం చేస్తే కోరుకున్న ఫలితం పొందుతారు. వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో నాలుగు చోట్ల దీపాలు వెలిగించాలి. దీని ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని..అప్పుల నుంచి విముక్తి పొందవచ్చని నమ్ముతారు.
వైశాఖ పౌర్ణమి 2025 ఎప్పుడంటే
పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం వైశాఖ పౌర్ణమి తిథి మే 11 సాయంత్రం 6:55 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ పౌర్ణమి తిధి మే 12న రాత్రి 7:22 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో వైశాఖ పౌర్ణమిను మే 12న జరుపుకోనున్నారు.
ఇవి కూడా చదవండి
వైశాఖ పౌర్ణమి రోజున ఎక్కడ దీపం వెలిగించాలంటే
ఇంటి ప్రధాన ద్వారం వద్ద: వైశాఖ పౌర్ణమి రోజున విష్ణువును పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. వైశాఖ పౌర్ణమిన ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల అన్ని రకాల ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు.
తులసి పూజ: వైశాఖ పౌర్ణమి శుభ సందర్భంగా.. తులసి మొక్కను పూజించండి. తరువాత తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని.. ఆ వ్యక్తి అప్పులు, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతాడని నమ్మకం.
ఇంటి పూజ గదిలో: వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వైశాఖ పౌర్ణమి రోజున ఇంటి పూజ గదిలో లేదా పూజ చేసే ప్రార్ధనా స్థలంలో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుందని.. ఆర్థిక లాభం తెస్తుందని నమ్మకం.
వంటగదిలో: హిందూ మత విశ్వాసం ప్రకారం వంటగది ఇంట్లో అతి ముఖ్యమైన భాగం. వంట ఇల్లు ఇంట్లో నివసించే వ్యక్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో వైశాఖ పౌర్ణమి రోజున మీరు వంటగదిలో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన అన్నపూర్ణ దేవి ప్రసన్నం అవుతుందని.. ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.