Video:మంచం మీద పడుకున్న ఒంటెపై మహిళ డ్యాన్స్.. వీడియో చూసిన నెటిజన్స్‌ రక్తం ఉడికిపోతుంది

Video:మంచం మీద పడుకున్న ఒంటెపై మహిళ డ్యాన్స్.. వీడియో చూసిన నెటిజన్స్‌ రక్తం ఉడికిపోతుంది


ఒంటె మీద కూర్చుని స్వారీ చేసేందుకు పిల్లలే కాదు.. పెద్దలు సైతం ఇష్టపడుతుంటారు. ఎత్తైన ఒంటె మీద కూర్చుని అలా వెళుతుంటే అదో త్రిల్‌. కానీ ఒంటెమీద స్వారీ చేసే బదులు దాన్ని అడ్డంగా పడుకోబెట్టి కడుపు మీదకెక్కి డ్యాన్స్‌ చేస్తే మాత్రం ప్రతి ఒక్కరి కడుపు మరిగిపోతది. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్‌గా మారిన ఓ వీడియోలో ఓ మహిళ ఒంటెపై డ్యాన్స్ చేస్తూ కనిపిస్తోంది. దీంతో ఆ మహిళపై నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సాధరాణంగా ఒంటెలపై మనుషులను కూర్చోబెట్టి తిప్పుతూ ఛార్జి వసూలు చేస్తుంటారు. ఒంటె వారి జీవనాధారంగా ఉంటుంది. దానికి ఎవరూ అభ్యంతర పెట్టారు. అయితే ఆ వీడియోలో మాత్రం ఓ బహిరంగ ప్రదశంలో ఒంటెను మంచం మీద పడుకోబెట్టారు. రాజస్థానీ దుస్తుల్లో ఉన్న ఓ మహిళ దాని వెనుకకు బదులుగా దాని కడుపుపై ​​నృత్యం చేస్తుంది. రాజస్థానీ పాటకు ఒంటెపై డ్యాన్స్ చేసిన ప్రదర్శనను చూసేందుకు జనం పోటెత్తారు. ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా హాయిగా ప్రదర్శన చూస్తున్నారు. రాజస్థాన్‌లో ఇప్పటికీ అలాంటి నృత్యాలు జరుగుతూనే ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఒంటెపై నిలబడి డ్యాన్స్ చేయడంపై అక్కడ ఉన్న విద్యావంతులు కూడా అభ్యంతరం పెట్టలేదు.

కానీ, సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, జంతు ప్రేమికులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ ప్రదర్శనకారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. రీల్‌ను పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ హోల్డర్‌ దీనిని జంతువులపై క్రూరత్వం అని కూడా పేర్కొన్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్స్‌ డిమాండ్‌ చేశారు.

ఇదంతా వినోదం పేరుతోనే జరుగుతోంది. ఇక్కడ ఓ జంతువును భరించలేనంతగా హింసించారు. అక్కడ ప్రజలు చూస్తూ ఉండి ఏమీ చేయలేదు. మన మానవత్వం ఎక్కడ? అంటూ జంతు ప్రేమికులు సోషల్‌ మీడియాలో స్పందస్తున్నారు. ఇది సంప్రదాయం కాదు, సంస్కృతి కూడా కాదు, ఇది శుద్ధ క్రూరత్వం! దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని మండిపడుతున్నారు.

వీడియో చూడండి:





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *