Video: ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదిన తొలి ప్లేయర్ ఎవరో తెలుసా? యూవీ మాత్రం కాదు భయ్యో..

Video: ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదిన తొలి ప్లేయర్ ఎవరో తెలుసా? యూవీ మాత్రం కాదు భయ్యో..


On This Day in Cricket: అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టడం గురించి చర్చించినప్పుడల్లా, భారత దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్ పేరు అందరికీ గుర్తుకు వస్తుంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు. అతను ఈ ఘనతను 2007 సెప్టెంబర్ 19న సాధించాడు. కానీ, యువరాజ్ కంటే ముందు, అంతర్జాతీయ క్రికెట్‌లో, మరొక ఆటగాడు 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టాడు. ఈ స్పెషల్ రికార్డ్ 2007 సంవత్సరంలో కూడా కనిపించింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదుగురు బ్యాట్స్‌మెన్స్ ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదారు. దీంతో వీరు చరిత్రలో తమ పేరును చిరస్థాయిగా లిఖించుకున్నారు. కాగా, ఈ లిస్టులో తొలిసారి ఓకే ఓవర్లో 6 సిక్స్‌లు బాదిన ప్లేయర్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన హెర్షెల్ గిబ్స్ నిలిచాడు. 2007 వన్డే ప్రపంచ కప్‌లో గిబ్స్ ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాతే యువరాజ్ సింగ్ టీ20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించాడు.

వెస్టిండీస్‌లో జరిగిన 2007 వన్డే ప్రపంచ కప్‌లో 7వ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తరపున గిబ్స్ నాలుగో స్థానంలో మైదానంలోకి వచ్చాడు.

ఇవి కూడా చదవండి

30వ ఓవర్లో డాన్ వాన్ బాంగే వేసిన అన్ని బంతులకు హెర్షెల్ గిబ్స్ సిక్సర్లతో సమాధానం ఇచ్చాడు. దీంతో, అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టిన ప్రపంచ రికార్డును గిబ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రికార్డుకు ఇప్పుడు 18 సంవత్సరాలు. అంటే, హెర్షెల్ గిబ్స్ మార్చి 16, 2007న ఈ చారిత్రాత్మక ఘనతను సాధించారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టిన బ్యాటర్స్..

హెర్షెల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా vs నెదర్లాండ్స్) – 2007 వన్డే ప్రపంచ కప్ మ్యాచ్

యువరాజ్ సింగ్ (భారతదేశం vs ఇంగ్లాండ్) – 2007 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్

కీరాన్ పొలార్డ్ (వెస్టిండీస్ vs శ్రీలంక) – 2021, టీ20 మ్యాచ్

జస్కరన్ మల్హోత్రా (USA vs పాపువా న్యూ గినియా) – 2021, వన్డే మ్యాచ్

దీపేంద్ర సింగ్ ఐరి (నేపాల్ vs ఖతార్) – 2024, టీ20 మ్యాచ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *