Video: టీమిండియాలోకి షడన్ ఎంట్రీ ఇచ్చిన ఐపీఎల్ స్టార్ ప్లేయర్.. స్వ్కాడ్‌లోనే లేడుగా.. ఎవరు, ఎందుకంటే?

Video: టీమిండియాలోకి షడన్ ఎంట్రీ ఇచ్చిన ఐపీఎల్ స్టార్ ప్లేయర్.. స్వ్కాడ్‌లోనే లేడుగా.. ఎవరు, ఎందుకంటే?


Team India: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత, టీమిండియా రెండవ టెస్టు కోసం గట్టిగా సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో, ఎడ్జ్‌బాస్టన్‌లోని ప్రాక్టీస్ సెషన్‌లో పంజాబ్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. భారత జట్టులో అధికారికంగా సభ్యుడు కాకపోయినా, బ్రార్ నెట్స్‌లో భారత బ్యాటర్లకు బౌలింగ్ చేస్తూ కనిపించాడు.

అసలెందుకు ఈ మార్పు?

శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా హెడింగ్లీలో జరిగిన తొలి టెస్టులో అనూహ్య ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి తర్వాత, జట్టులో కొన్ని మార్పులు తప్పవని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో, జట్టులో లేని హర్‌ప్రీత్ బ్రార్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనడం అనేక ఊహాగానాలకు దారితీసింది.

అయితే, అందుతున్న సమాచారం ప్రకారం, బ్రార్ భారత టెస్టు జట్టులో స్థానం సంపాదించుకోలేదు. అతను కేవలం నెట్ బౌలర్‌గా మాత్రమే భారత బ్యాటర్లకు స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు సహాయం చేస్తున్నాడు. ఇంగ్లాండ్ పిచ్‌లు సాధారణంగా పేసర్లకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి, నాలుగో స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరం అంతగా ఉండకపోవచ్చు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్నర్లు ఇప్పటికే జట్టులో ఉన్నారు.

ఎడ్జ్‌బాస్టన్‌లో స్పిన్నర్ల రికార్డు..

ఎడ్జ్‌బాస్టన్ మైదానం చరిత్రను పరిశీలిస్తే, గత పది టెస్టు మ్యాచ్‌లలో పేసర్లు 230 వికెట్లు తీయగా, స్పిన్నర్లు కేవలం 59 వికెట్లు మాత్రమే పడగొట్టారు. అంటే, 80 శాతం వికెట్లు పేసర్ల ఖాతాలో చేరాయి. ఈ గణాంకాలు ఎడ్జ్‌బాస్టన్ పిచ్ పేసర్లకు ఎంతగా అనుకూలిస్తుందో స్పష్టం చేస్తున్నాయి. ఇంగ్లాండ్ జట్టులో జోఫ్రా ఆర్చర్ వంటి పేస్ బౌలర్లు చేరడంతో, పిచ్ మరింత పేస్‌కు సహకరించే అవకాశం ఉంది.

భారత జట్టు వ్యూహం..

భారత జట్టు ప్రస్తుతం సిరీస్‌లో 0-1తో వెనుకబడి ఉంది. రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయడం వారికి అత్యవసరం. అందుకే, బ్యాటర్లు ఎలాంటి స్పిన్ బౌలింగ్‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. బ్రార్ వంటి నాణ్యమైన ఐపీఎల్ స్పిన్నర్ నెట్స్‌లో బౌలింగ్ చేయడం ద్వారా బ్యాటర్లు మరింత పదును తేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.

హర్‌ప్రీత్ బ్రార్ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున నిలకడగా రాణిస్తున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్‌గా, బ్యాటర్‌గా కూడా అతను తన సత్తాను చాటుకున్నాడు. గతంలో 2022లో కూడా బ్రార్ టీమిండియా నెట్ సెషన్స్‌లో పాల్గొన్నాడు.

ఏదేమైనా, హర్‌ప్రీత్ బ్రార్ ఉనికి భారత శిబిరంలో వ్యూహాత్మక ప్రాక్టీస్‌లో భాగంగానే ఉందని, ప్రస్తుతానికి జట్టులో అధికారికంగా చేరే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే, ఒకవేళ సిరీస్ మధ్యలో ఎవరైనా స్పిన్నర్‌కు గాయమైతే, బ్రార్‌ను ప్రత్యామ్నాయంగా పరిగణించే అవకాశం ఉండవచ్చు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *