Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు గాయం.. ఆందళోనలో అభిమానులు

Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు గాయం.. ఆందళోనలో అభిమానులు


Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు గాయం.. ఆందళోనలో అభిమానులు

హీరో విజయ్ దేవరకొండకు గాయం అయ్యిందని తెలుస్తోంది. సినిమా షూటింగ్ లో భాగంగా ఆయన గాయపడ్డారని తెలుస్తోంది. సినిమా షూటింగ్ లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా విజయ్ కు గాయాలయ్యాయని తెలుస్తోంది. విజయ్ స్వల్పంగా గాయపడటంతో ఆయనను వెంటనే మూవీ టీమ్ హాస్పటల్ కు తరలించారని తెలుస్తోంది. ఫిజియోథెరపీ పూర్తయిన తర్వాత విజయ్‌ మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నట్టు సమాచారం. దాంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి : సూపరో సూపర్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్

రౌడీ హీరో విజయ్ దేవర కొండా హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ఆతరువాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. గీతగోవిందం సినిమా తర్వాత విజయ్ ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు. విజయ్ చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. విజయ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. విజయ్ నటించిన లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి.

ఇది కూడా చదవండి : Tollywood : అమ్మబాబోయ్..! రచ్చ రచ్చ చేస్తుందిగా..!! ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ హీరోయిన్ గుర్తుందా..?

ప్రస్తుతం విజయ్ జెర్సీ మూవీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది  ఏడాది మార్చి 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత  విజయ్ టాక్సీ వాల దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాయన్‌ తో ఓ సినిమా చేయనున్నాడు. అలాగే రవికిరణ్‌ కోలా దర్శకత్వంలోనూ ఓ సినిమా కమిట్ అయ్యాడు విజయ్.

ఇది కూడా చదవండి : ఈ హీరోలను గుర్తుపట్టారా.? పెద్ద కష్టం కాదులెండి..! కానీ కనిపెట్టండి చూద్దాం.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *