కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఈ హీరో సినిమా వచ్చిందంటే చాలు తమిళనాడులోని థియేటర్లలలో పండగే. తమిళంతోపాటు విజయ్ సినిమాలను తెలుగులోకి డబ్ చేయగా మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో ఈ హీరోకు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం అటు సినిమాలు.. ఇటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు విజయ్. తన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నారు. ఇటీవలే లియో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్.. ఇప్పుడు జననాయగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ పర్సనల్ లైఫ్ గురించి నెట్టింట చర్చ మొదలైంది.
విజయ్ తన పర్సనల్ లైఫ్ గురించి అంతగా మాట్లాడరు. అలాగే తన కుటుంబం ఫోటోస్, విషయాలను అభిమానులతో పంచుకోవడానికి ఆసక్తి చూపించరు. కానీ ఇప్పుడు విజయ్ ఫ్యామిలీ గురించి నెట్టింట సెర్చ్ చేస్తున్నారు ఫ్యాన్స్. విజయ్ తనయుడు సంజయ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. అయితే తండ్రిలాగే హీరోగా కాకుండా దర్శకత్వం వైపు అడుగులు వేశాడు సంజయ్. డైరెక్షన్ పై అతడికి విపరీతమైన ఆసక్తి ఉండడంతో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో దర్శకత్వంలో మెలకులవలు నేర్చుకున్నాడు. మరోవైపు విజయ్ కూతురు దివ్య సాషా మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.
బాలనటిగా ఇప్పటికే సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. విజయ్ నటించిన తేరి చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం దివ్య సాషా బ్యాడ్మింటన్ ప్లేయర్ అని సమాచారం. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్న దివ్య.. స్కూల్లో జరిగే టోర్నమెంట్ లో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొంటుంది దివ్య. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. దివ్య సాషా సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. ఇప్పటివరకు ఆమెకు సంబంధించిన లేటేస్ట్ వివరాలు తెలియరాలేదు.

Divya Sasha
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..
Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..
OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‌స్టాప్ సస్పెన్స్..
Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..