మిథునం: ఈ రాశివారికి 12వ స్థానాధిపతి శుక్రుడు 12వ స్థానంలోనే ఉన్నందువల్ల విపరీత రాజయోగం కలిగింది. ఈ యోగం వల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆదాయం బాగా పెరిగి, ఖర్చులు తగ్గుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఒక ప్రముఖుడిగా గుర్తింపు లభిస్తుంది. చెలామణీ అవుతారు. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది.