చైనా, నేపాల్ సరిహద్దులో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తరాఖండ్‌లోని మున్సియారిలోని చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న లీలామ్‌లో మంగళవారం ఉదయం వర్షం ఆగిపోయిన తర్వాత కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడడంతో మూడు గ్రామాలను కలిపే లీలాం-పాటన్ రహదారిపై మూసుకుపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొద్ది దూరంలో ఇలా జరగడం చూసి వాహనదారులు షాక్ అయ్యారు. సహాయక సిబ్బంది రోడ్డుని పునర్నిర్మించే పనిలో పడ్డారు.