మందు పడితే మనిషి ఏదైన చేయగలడు. లోపల లిక్కర్ పడగానే చిత్ర విచిత్రాలు చేస్తుంటారు. ఇక తాగి బండి నడిపేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాగిన తర్వాత బండి రోడ్డు మీద పోతుందా..? గాలిలో పోతుందా అర్థం కాదు. ఇక కార్లను గుట్టలే ఎక్కిస్తారు మందుబాబులు. తాజాగా మీరట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి ఫుల్‌గా మందు కొట్టి కారును మీరట్‌లోని కాంట్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పైకి ఎక్కించాడు. ఫ్లాట్ ఫామ్ పైనే రైలు ఉండడంతో అందరూ భయాందోళన చెందగా.. కారు నడిపే వ్యక్తికి మాత్రం అదేదీ సోయి లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జార్ఖండ్ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఉన్న కారు కాంట్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు దగ్గరికి దూసుకొచ్చింది. రైలుకు కొన్ని అడుగుల దూరంలో ఆగింది. ఒకవైపు
ప్లాట్ ఫామ్‌పై రైలు వెళ్తుండడం గమనార్హం. కారు నడిపిన వ్యక్తిని సందీప్ డాకాగా రైల్వే పోలీసులు గుర్తించారు. ఆయన ఆర్మీలో పనిచేస్తారని తెలుస్తోంది. ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించడంతో పాటు నిబంధనలు అతిక్రమించినందుకు అతడిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల్లో నిందితుడు మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. డాకాను అరెస్టు చేయడంతో పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. క్యాబ్ డైరెక్ట్ టు ట్రైన్ సీట్ అని ఒకరు కామెంట్ చేయగా.. యూపీ ప్రతిరోజు ఆశ్చర్యపరుస్తుందంటూ మరొకరు కామెంట్ చేశారు. మరికొంతమంది ఈ ఘటనను రైల్వే పోలీసుల నిర్లక్ష్యంగా ఆరోపిస్తున్నారు. కారు ఫ్లాట్ ఫామ్‌పైకి వచ్చేదాక పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
In UP’s Meerut, aan drove his car inside the railway station into the platform – very close to a departing train. pic.twitter.com/XPmVXn3e7x
— Piyush Rai (@Benarasiyaa) August 2, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..