విశ్వంభర గురించి రోజుకో విషయం వార్తల్లో ఉంది. ఇది కదా మా మెగా బాస్ నుంచి మేం కోరుకున్నది అంటూ తెగ ఖుషీ అవుతున్నారు అభిమానులు. ఫ్యాన్స్ ని ఎప్పటికప్పుడు ఉత్సాహపరుస్తున్న వశిష్ట మాటలు ఈ సారి ఏ విషయాన్ని టచ్ చేశాయి? ఇంతకీ రిలీజ్ ఎప్పుడు? చూసేద్దాం పదండి..
విశ్వంభర.. ఏడేడు పద్నాలుగు లోకాలకి అవతల సత్యలోకంలో జరిగే కథ. ఆ లోకానికి వెళ్లి తన స్త్రీని మెగాస్టార్ ఎలా కాపాడుకున్నాడన్నదే కథ. రీసెంట్ టైమ్స్ లో ఎవరూ చూడని రెక్కల గుర్రాలతో పాటు ఇంకా ఎన్నెన్నో వింతలతో తెరకెక్కుతోంది విశ్వంభర.
విశ్వంభరకి మ్యూజిక్ చేస్తున్నారు కీరవాణి. అయితే స్పెషల్ సాంగ్ మాత్రం భీమ్స్ చేశారు. కీరవాణిని వశిష్ట అవమానించారంటూ వార్తలు మొదలయ్యాయి. అయితే, ఈ పాటను ఇంకో మ్యూజిక్ డైరక్టర్‌తో చేయమని సలహా ఇచ్చిందే కీరవాణి అని రివీల్ చేశారు వశిష్ట. హరిహరవీరమల్లు పనులతో బిజీగా ఉండటంతో, విశ్వంభర స్పెషల్ సాంగ్‌ని ఇంకో మ్యూజిక్ డైరక్టర్‌కి ఇవ్వమన్నారు ఆస్కార్ గ్రహీత కీరవాణి.
అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే అక్టోబర్‌కి సినిమాను తీసుకొస్తామన్నది ఇంతకు ముందు వశిష్ట చెప్పిన మాట. అయితే, అంత హెక్టిక్‌గా ఎందుకు? డిసెంబర్లో రిలీజ్ చేస్తే కూల్ గా ప్రమోషన్ చేసుకోవచ్చు. విజువల్స్ ఒకటికి రెండు సార్లు చూసుకోవచ్చని టీమ్ అంతా అనుకుంటున్నారన్నది లేటెస్ట్ న్యూస్.
ఓ వైపు విశ్వంభర పనులు చేస్తూనే, మరో వైపు అనిల్ రావిపూడి సినిమా పనులు కూడా చకచకా పూర్తి చేస్తున్నారు మెగాస్టార్. డిసెంబర్లో విశ్వంభర, జనవరిలో అనిల్ మూవీ అంటూ బ్యాక్ టు బ్యాక్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారన్నమాట.