Warning Signs to Illness: అప్పుడప్పుడు మీ బాడీ చెప్పే మాట కూడా వినండి.. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు

Warning Signs to Illness: అప్పుడప్పుడు మీ బాడీ చెప్పే మాట కూడా వినండి.. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు


సాధారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు రాకముందే శరీరం మనకు కొన్ని సంకేతాలు ఇస్తుంది. కానీ వాటిని మనం పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ ఇలా చేయడం సరికాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరం ఇచ్చే వార్నింగ్‌లను అర్థం చేసుకుని, సమస్యలు రాకముందే వదిలించుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరం చెప్పే మాటలు వినాల్సిందే అంటున్నారు నిపుణులు. కాబట్టి సమస్యలు తలెత్తే ముందు శరీరం ఎలాంటి సంకేతాలను ఇస్తుంది? అంటే ఏమిటి? వీటి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా నోరు లేదా పెదవులు పగిలిపోతే, విటమిన్ బి లోపం ఉందని అర్థం. ఇది జరిగితే, ఎక్కువ నీరు త్రాగాలి. డాక్టర్ సలహా మేరకు రోజూ వ్యాయామం చేయాలి. కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. పెదాలను క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేసుకోవాలి. పెదాలను స్క్రబ్ చేసుకోవాలి. అలాగే తీవ్రమైన వెన్నునొప్పి ఉంటే, విటమిన్ డి లోపం ఉందని అర్ధం. కాబట్టి మీకు వీలైనంత నిటారుగా కూర్చోవడానికి ప్రయత్నించాలి. ఉదయం సూర్యకాంతి శరీరంపై పడనివ్వాలి. విటమిన్ డీ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

ముఖంపై మొటిమలు అంటే విటమిన్ ఇ, జింక్ లోపించిందని అర్ధం. కాబట్టి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. జంక్ ఫుడ్, చాక్లెట్, ఐస్ క్రీం మొదలైన ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. ముఖాన్ని రోజుకు రెండుసార్లు గోరువెచ్చని నీటితో కడగాలి. నిరంతరం అలసిపోయి నిద్రపోతుంటే, మీ శరీరంలో విటమిన్ బి2, సి, ఐరన్ లోపం ఉండవచ్చు. సాధారణంగా శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు అలసట వస్తుంది. కాబట్టి రోజంతా పుష్కలంగా నీరు తాగడం మర్చిపోవద్దు. అలాగే అధిక ఒత్తిడి నిద్రకు భంగం కలిగిస్తుంది. అలసటను పెంచుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా లేదా ఏదైనా ఇతర విశ్రాంతి కార్యకలాపాలను ప్రయత్నించాలి.

ఇవి కూడా చదవండి

మీ కళ్ల చుట్టూ నల్లటి మచ్చలు కనిపిస్తే, శరీరంలో విటమిన్ ఇ, కె లోపం ఉందని అర్థం. కాబట్టి కళ్ళకు క్రమం తప్పకుండా విరామం ఇవ్వండి. ఎక్కువసేపు కంప్యూటర్ లేదా మొబైల్ వాడకాన్ని నివారించాలి. అలాగే రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. జుట్టు రాలడం, గ్రే హెయిర్‌ సమస్య ఉంటే బయోటిన్, విటమిన్ బి12 లోపం ఉందని అర్థం. కాబట్టి ప్రతిరోజూ మీ జుట్టును సరిగ్గా దువ్వడం అలవాటు చేసుకోవాలి. మీ జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వడం మానేయాలి. అలాగే ఒత్తిడిని వీలైనంత వరకు తగ్గించుకోవాలి.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *