Watch: ఏంటో పాపం పెళ్లి కొడుకు.. నడిరోడ్డుపై పరిగెడుతున్నాడు.. అసలు విషయం ఇదేనట..!

Watch: ఏంటో పాపం పెళ్లి కొడుకు.. నడిరోడ్డుపై పరిగెడుతున్నాడు.. అసలు విషయం ఇదేనట..!


ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. దీనికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.. అందులో కొన్ని వీడియోలు ప్రజల్ని ఎంతగానో నవ్విస్తాయి. మరికొన్ని మనల్ని హెచ్చరిస్తాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోం. అందులో ఓ వరుడు పెళ్లి దుస్తుల్లోనే నడిరోడ్డుపై పరిగెడుతున్నాడు. ఇదంతా వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అది కాస్త వైరల్‌ అవుతుంది.

వైరల్ వీడియోలో ఒక పెళ్లి కొడుకు నడి రోడ్డుపై పరిగెడుతున్నాడు.. దీనికి వెనుక కారణం ఏంటా అని ఆరా తీస్తే.. ట్రాఫిక్‌ అని తెలిసింది. వరుడు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయాడు.. తన వెంట వచ్చిన బరాత్‌ బృందం..మరోవైపు వెళ్లిపోయింది. అతడు తన పెళ్లి బరాత్‌ను చేరుకోవడానికి ట్రాఫిక్ మధ్యలో పరిగెత్తాల్సి వచ్చింది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనేది తెలియదు కానీ, వరుడు వాహనాల గుండా పరిగెత్తున్న దృశ్యం మాత్రం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అతని వెనుక ఎవరో ఇదంతా వీడియో రికార్డ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో shourrya23 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి షేర్ చేయబడింది. దీనిని దాదాపు 30 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు స్పందించారు. చాలా మంది భిన్నమైన కామెంట్లు చేశారు. మరి కొందరు ఈ వీడియోపై ఫన్నీ రియాక్షన్స్‌ ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *