Watch: మరీ లక్షల్లో ఏంటి గురూ..! ఈ సింగిల్‌ టోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే..!

Watch: మరీ లక్షల్లో ఏంటి గురూ..! ఈ సింగిల్‌ టోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే..!


Watch: మరీ లక్షల్లో ఏంటి గురూ..! ఈ సింగిల్‌ టోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే..!

వైరల్‌ వీడియో సూరత్‌లోని ఒక వీధి వ్యాపారికి సంబంధించినదిగా తెలిసింది. అతను అవోకాడోను ఉపయోగించి ఇలాంటి ఖరీదైన టోస్ట్‌ తయారు చేశాడు. ఇక్కడ ఉపయోగిస్తున్న అవకాడో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. విటమిన్ సి, ఇ, కె, పొటాషియం, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి అవసరమైన పోషకాలు అవకాడోలో పుష్కలంగా ఉంటాయి. అవకాడో తినడం వల్ల ఎల్‌డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి , హెచ్‌డిఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అవకాడోలోని ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అవకాడో కళ్ళను మాక్యులర్ డీజనరేషన్ , క్యాటరాక్ట్ నుండి రక్షిస్తుంది. అందుకే దీనిని సలాడ్లు, స్మూతీస్, టోస్ట్, డిప్స్, సుషీ తయారీలో ఉపయోగిస్తారు. అయితే అవకాడో టోస్ట్ కోసం మీరు ఎప్పుడైనా రూ.13,000 ఖర్చుచేశారా..? ఇటీవల, గుజరాత్‌లోని సూరత్‌లో ఒక వీధి వ్యాపారి ఇలాంటి ఖరీదైన టోస్ట్ తయారు చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సూరత్‌కు చెందిన ఫుడ్ బ్లాగర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అవకాడో టోస్ట్‌ వీడియోను పంచుకున్నారు. అందులో అవకాడో టోస్ట్‌ను రూ. 13,000కు విక్రయిస్తున్నారు. ఆలివ్ ఆయిల్, నువ్వులు, ప్రత్యేక మసాలా,యు నిమ్మరసంతో తయారు చేసి కట్ చేసిన అవకాడో మసాల టోస్ట్‌ చేస్తున్నాడు. వీడియోలో విక్రేత ఒక ప్లేట్‌లో బ్రెడ్‌ను ఉంచి, దానిపై చిజ్‌ మందపాటి పొరగా వేశాడు. అవోకాడో మిశ్రమాన్ని రెడీ చేశాడు. చివరగా పైన నువ్వులు చల్లుతాడు. అయితే, ఈ సాధారణ టోస్ట్‌ను ఖరీదైనదిగా చేసే ప్రధాన పదార్ధం పులే చీజ్. అతడు దీన్ని సైర్బియా నుండి నేరుగా దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Surti Mayurkumar Vasantlal (@foodie_addicted_)

పులే చీజ్ అనేది 60శాతం బాల్కన్ గాడిద పాలు, 40శాతం మేక పాలు మిశ్రమంతో తయారు చేసే సెర్బియా స్పెషల్‌ జున్ను. దీన్ని అక్కడి ప్రత్యేక వంటకం కోసం ఉపయోగిస్తారు. దీని ధర అర కిలో రూ. 51,000 ఉంటుంది. అలాగే, 1 కిలోల జున్ను తయారు చేయడానికి సుమారుగా 25 లీటర్ల గాడిద పాలు అవసరం. అయితే, సంవత్సరానికి 6 నుండి 15 కిలోల జున్ను మాత్రమే విక్రయిస్తారు. అందుకే ఈ చీజ్‌ ఖరీధు ఎక్కువగా ఉంటుంది. మొత్తానికి ఈ ఖరీదైన టోస్ట్‌ మాత్రం నెట్టింట చర్చనీయాంశంగా మారి..నెటిజన్లలో తీవ్ర దుమారం రేపుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *