
పాల వ్యాపారంతో జీవితంలో ఒక్కో మెట్టు ఎదిగిన తెలంగాణ మాజీ మంత్రి మల్లా రెడ్డి.. స్కూటర్ పై పాలు అమ్ముతూ సందడి చేశారు. మేడ్చల్ జిల్లా – బోడుప్పల్లో స్కూటర్ పై పాలు అమ్ముతు ఎమ్మెల్యే మల్లారెడ్డి అందరి దృష్టిని ఆకర్షించారు. ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆయనకు అక్కడ పాల డబ్బాతో స్కూటర్ కనిపించడంతో మురిసిపోయారు. దాని దగ్గరకు వెళ్లి స్కూటర్ పై ఎక్కి కూర్చొన్నారు. ఒకప్పుడు తాను కూడా స్కూటర్ పైనే పాల వ్యాపారం చేసే వాడిని మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు. మల్లారెడ్డితో ఫొటోలు తీసుకునేందుకు అక్కడున్న వారు పోటీపడ్డారు. మల్లారెడ్డి పాల స్కూటర్ ఎక్కి సందడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.