Watch: సంచి తెచ్చి రోడ్డుపై పడేశారు. ఓపెన్ చేసి చూస్తే.. ఒళ్లు గగురుపొడిచే ఘటన..

Watch: సంచి తెచ్చి రోడ్డుపై పడేశారు. ఓపెన్ చేసి చూస్తే.. ఒళ్లు గగురుపొడిచే ఘటన..


అది ఎప్పుడూ బిజీగా ఉండే రోడ్డు. రోడ్డుపై వాహనాలు వెళ్తున్నాయి. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ఓ సంచితో వచ్చారు. బైక్‌ను రోడ్డు పక్కన ఆపి సంచిని డివైడర్‌పై పడేశారు. ఆ మూటపై చుట్టుపక్కల వారికి అనుమానం కలిగింది. డౌట్ వచ్చి ఆ బైక్‌పై వచ్చినవారిని ప్రశ్నించారు. చివరకు సంచి ఓపెన్ చూసిన వారికి ఒళ్లు గగురు పొడిచే సీన్ కనిపించింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పంజాబ్‌లోని లూధియానాలో పట్టపగలే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఫిరోజ్‌పూర్ రోడ్డు డివైడర్‌పై ఒక మహిళ మృతదేహాం ఉన్న సంచిని పడేశారు. చుట్టుపక్కల వారు వారిని ప్రశ్నించగా.. ఆ సంచిలో ‘‘కుళ్ళిన మామిడికాయలు’’ ఉన్నాయని.. అందుకే పారేసినట్లు నిందితులు తెలిపారు. అయితే మూట విప్పి చూస్తే అందులో మామిడి కాయలు కాదు మహిళ మృతదేహం ఉండడంతో అంతా షాకయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి స్థానికులు కీలక విషయాలను వెల్లడంచారు. ‘‘నేను నా షాప్‌లో బిజీగా ఉన్నప్పుడు.. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి డివైడర్ మీద ఒక సంచి పడేశారు. అది దుర్వాసన వస్తుందని నా ఫ్రెండ్స్ నాతో అన్నారు. నేను అక్కడికి చేరుకుని వారిని ప్రశ్నించగా.. కుళ్లిన మామిడికాయలు అని చెప్పారు. వాటిని రోడ్డుపై ఎందుకు పడేస్తున్నారని నిలదీశాను. అంతలోనే ఆ వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. తరువాత ఆ సంచిని ఓపెన్ చేసి చూడగా.. లోపల ఒక మహిళ మృతదేహం కనిపించడం చూసి షాక్ అయ్యాం’’ అని స్థానికంగా ఉండే వ్యక్తి చెప్పారు.

వారం క్రితమే.. లూథియానాలో ఒక వ్యక్తిని హత్య చేసి అతని మృతదేహాన్ని డ్రమ్‌లో వేసి ఖాళీ స్థలంలో విసిరేశారు. ఈ కేసులో పోలీసులు మృతుడిని గుర్తించి నిందితులను అరెస్టు చేశారు. మనోజ్ అలియాస్ రాజును అతని స్నేహితుడు, కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు తేల్చారు. ఆ ఘటన మరవకముందే మళ్లీ మహిళ మృతదేహాన్ని రోడ్డపై పారేయడం కలకలం రేపుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *