లగ్జరీ కార్లు ఖరీదైన బైక్ లతో ఇష్టానుసారంగా స్టెంట్స్ చేస్తున్న వారిపై పోలీసులు ఎంత హెచ్చరించినా తీరు మాత్రం మారడం లేదు. రూట్లను మార్చి, ప్రాంతాలను మార్చి ఇష్టానుసారంగా కార్లతో బైకులతో స్టన్స్ చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అడ్డొచ్చిన వారిపై తిరిగి ఏంటని దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎంత సీరియస్ గా వ్యవహరించిన స్టంట్స్ మాత్రం ఆగడం లేదు.
తాజాగా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీద కొందరు యువకులు ఇష్టానుసారంగా లగ్జరీ కార్లతో స్టంట్స్ నిర్వహించారు. ఆదివారం(ఫిబ్రవరి 9) తెల్లవారుజామున ఔటర్ రింగ్ రోడ్డుపై కార్లతో స్టంట్స్ చేస్తున్న యువకులు హంగామా సృష్టించారు. నడి రోడ్డుపైనే లగ్జరీ కార్లతో స్టంట్లను చేస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఎంతో వేగంగా వచ్చే వాహనాలను ఒకదానిని ఒకటి ఢీకొంటాయన్నట్లు ఉన్న ఈ స్టంట్లను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
సిటీలో కాకుండా ఏకంగా ఔటర్ రింగ్ రోడ్డు మీదనే స్టంట్లకు పాల్పడుతున్నవారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుపై కార్ల స్టంట్లు చేసిన యువకుల కోసం గాలిస్తున్నారు. ఇటీవల కాలంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో లగ్జరీ బైకులను సైతం స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేశారు. అంతేకాకుండా గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలలో అర్థరాత్రులు పెట్రోల్ చేస్తున్నారు. ఎవరైనా రోడ్ల మీద ఇష్టానుసారంగా స్టంట్లు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తాజాగా ఈ ఘటన మరోసారి వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమై స్టంట్స్ చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
వీడియో చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..