మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ప్రభుత్వాలు ఎంత హెచ్చరిస్తున్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. మద్యం తాగడమే తప్పు అని ఒకవైపు పదేపదే మొత్తుకుంటుంటే.. ఇక్కడేమో ఏకంగా దేవుడి గదిలోనే దుకాణం పెట్టేశారు. ఇలాంటి అసాంఘిక చర్యలపై ఆధ్యాత్మిక వేత్తలు, మత బోధకులు మండిపడుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దిండోరి తాలూకాలోని కొల్హర్ గ్రామంలోని ఓ ఇంట్లో దేవుని గది(దేవస్థానం) కింద దేశీ మద్యం బాటిళ్లు దాచి ఉంచిన విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో మద్యం విక్రయించబడుతోందని స్థానికుల ఫిర్యాదుతో పక్కా సమాచారం మేరకు జిల్లా పోలీసులు దాడులు చేపట్టారు. ఈ నేపథ్యంలో వాణీ పోలీస్ స్టేషన్‌కు చెందిన అడిషనల్ ఎస్పీ గాయత్రి జాధవ్ తన సహచర బృందంతో కలిసి కొల్హర్ గ్రామంలోని సాహెబ్రావ్ రామదాస్ పిథే(48) ఇంటిపై తనిఖీలు చేపట్టారు.
మందుసీసాలు ఎలా దాచిపెట్టాడో వీడియో చూడండి..
ఈ తనిఖీలలో విస్తుపోయే విషయాలు బయటికి వచ్చాయి. ఏకంగా దేవుని గదిలో తవ్విన ఒక గుంతలో రూ.4,800 విలువ గల ‘ప్రిన్స్ ఆరెంజ్ కంట్రీ’ బ్రాండ్‌కు చెందిన 60 సీల్ చేయబడిన మద్యం బాటిళ్లు దాచబడినట్లు కనుగొన్నారు.తనిఖీలో భాగంగా పట్టుబడిన మద్యం సీసాలను సీజ్ చేసి.. ఈ తతంగానికి పాల్పడిన సాహెబ్రావ్ రామదాస్ పిథేను అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర మద్యం నిషేధ చట్టంలోని సెక్షన్ 65(ఈ) ప్రకారం పిథేపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
బిల్డింగ్ పై నుండి వేలాడుతూ కనిపించిన నాలుగేళ్ల చిన్నారి.. ఇంతలో
నవజాత శిశువును నీటిలో వేసి ఉడికించిన కర్కోటక తల్లి!
మామతో ఆ యవ్వారం.. కూతురిని హత్య చేసి..మరో యువకుడిపై నెట్టిన తల్లి
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..