వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కదురుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. కొన్ని ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలతో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు బాగా కలిసి వస్తాయి. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. కుటుంబ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం శ్రేయస్కరం.