మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, శని వంటి ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఆదాయానికి లోటుండదు. కొద్దిగా పెరిగే అవకాశమే ఉంది. వారమంతా కుటుంబ జీవితం ఉత్సాహంగా గడిచిపోతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగు పడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు తదితర ఆర్థిక లావాదేవీల మీద పెట్టుబడులు పెట్టడం వల్ల ఆశింశిన ప్రయోజనం ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. పట్టుదలగా ముఖ్యమైన వ్యవ హారాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆఫర్లు, అవకాశాలు అందుతాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): లాభ స్థానం ఎక్కువ గ్రహాలతో బలంగా ఉన్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. సోదరు లతో ఆస్తి వివాదాలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో అను కూల పరిస్థితులుంటాయి. ఎవరితోనూ ఆర్థిక సంబంధమైన లావాదేవీలు పెట్టుకోవద్దు. ధనప రంగా వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ప్రేమ వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులకు కొద్దిగా శ్రమ తప్పకపోవచ్చు. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడు, ఉచ్ఛ శుక్రుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు హోదా పెరుగుతుంది. అధికారులు అతి ముఖ్యమైన లక్ష్యాలు, బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆహ్యానాలు అందే అవకాశం ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి. ఒక ప్రముఖుడిగా గుర్తింపు పొందు తారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో స్నేహ సంబం ధాలు వృద్ధి చెందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): లాభ స్థానంలో గురువు ఉన్నంత వరకూ ఆదాయానికి లోటుండదు. పైగా గురువు భాగ్య స్థానంలో ఉన్న ఉచ్ఛ శుక్రుడితో పరివర్తన చెందినందువల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. మనసులోని కోరికలు, ఆశల్లో ముఖ్యమైనవి తప్పకుండా నెరవేరుతాయి. కొందరు బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. దూర ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభ సాటిగా ముందుకు సాగుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆస్తి వివాదాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): దశమ స్థానంలో ఉన్న గురువు దశమ స్థానాధిపతి శుక్రుడితో పరివర్తన చెందినందువల్ల ఉద్యోగ జీవితం వైభవంగా సాగిపోతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మి ఆర్థిక బాధ్యతలు అప్పగించడం, ఆర్థిక సహాయాలు చేయడం వంటివి చేయవద్దు. వృత్తి జీవితంలో ఉన్నవారికి బిజీ జీవితం ఏర్పడుతుంది. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహరంగా సాగుతాయి. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న గురువుతో సప్తమ స్థానంలో ఉన్న శుక్రుడు పరివర్తన చెందినందువల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభాల పంట పండుతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతి, జీతభత్యాల పెరుగుదల వంటి వాటితో పాటు ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది. అనారోగ్యం నుంచి బాగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు వెడతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడు ఉచ్ఛపట్టడం, ఆరవ స్థానంలో రాహువు ఉండడం వల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో స్తబ్ధత తొలగిపోయి యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. చేపట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విహార యాత్ర చేసే అవకాశం ఉంది. కుటుంబసమేతంగా విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. విద్యార్థులకు అన్ని విధాలా బాగుంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈ రాశికి పంచమ, సప్తమ స్థానాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల వారం రోజుల పాటు జీవితం సుఖ సంతోషాలతో సాగిపోయే అవకాశం ఉంది. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ యోగం పడుతుంది. ఆదాయానికి లోటుండదు. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
ధనుస్సు (మూల, పూర్వాషాడ, ఉత్తరాషాఢ 1): తృతీయ స్థానంలో శని, చతుర్థ స్థానంలో ఉచ్ఛ శుక్రుడి వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్లు వేస్తారు. ఆస్తి సమ స్యలు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలు, బాధ్య తలు పెరుగుతాయి. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. విద్యా ర్థులు ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా సానుకూలపడతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశ్యధిపతి శని ధన స్థానంలో ఉండడంతో పాటు తృతీయ స్థానంలో శుక్ర, రాహువుల సంచారం వల్ల ఆదాయపరమైన వృద్ధి తప్పకుండా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం బాగా పెరిగినప్పటికీ ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు చాలావరకు పూర్తవు తాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. విహార యాత్ర చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా కొనసాగు తాయి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. విద్యార్ధులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశికి ప్రస్తుతం ధన స్థానంలో ఉచ్ఛ శుక్రుడు ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండదు. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులు ఎంతో నమ్మకంతో బరువు బాధ్యతలు పెంచే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పట్టుదలగా వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించవచ్చు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛపట్టడంతో పాటు రాశినాథుడైన గురువుతో పరివర్తన చెందినందువల్ల వారమంతా వైభవంగా, గౌరవప్రదంగా సాగిపోతుంది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందు తుంది. ముఖ్యంగా షేర్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల వాతావరణం అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. పెట్టుబడులకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు, వ్యవహా రాలను పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది.