కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ప్రతి పనిలోనూ వ్యయప్రయాసలుంటాయి. శ్రమ, ఒత్తిడి, తిప్పట పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకటి రెండు కీలకమైన శుభ పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. అను కున్న పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతాయి. కొందరు సమీప బంధువుల వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దైవ సంబంధమైన వ్యవహారాల్లో పాలుపంచుకోవడం జరుగుతుంది. ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.