మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ధన స్థానంలో రాశ్యధిపతి శనితో శుక్రుడు కలవడం, పంచమంలో గురువు సంచారం, తృతీయ స్థానంలో రాహువు వల్ల ఈ రాశివారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల వల్ల, ప్రయత్నాల వల్ల బాగా లాభం ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. సప్తమంలో కుజ సంచారం వల్ల ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి జీవితంలో పనిభారం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అనా రోగ్య సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సంతృప్తికరంగా ముగుస్తాయి.