థాయిలాండ్ జాతీయ జంతువు. ఈ దేశ ప్రజలకు ఈ ఏనుగులు దేవతలతో సమానం అంతలా వీటిని వారు గౌరవిస్తుంటారు. ఎన్నో ఏండ్లుగా వీటి సంరక్షణకు థాయిలాండ్ అనేక చర్యలు చేపడుతూ వస్తోంది. వీటి మనుగడను కాపాడేందుకు శ్రమిస్తోంది. మరి ఇంతలా ఈ దేశానికి తెల్ల ఏనుగులకు మధ్య సెంటిమెంట్ ఎందుకుంది అనే విషయాలు పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. థాయిలాండ్ కు వచ్చే సందర్శకులను ఈ తెల్ల ఏనుగులు కనువిందు చేస్తుంటాయి. వీటిపై స్వారీ చేయడం వీటికి ఆహారం ఇవ్వడం వంటివి చేస్తూ పర్యటకులు సంతోషంగా గడుపుతుంటారు.
తెల్ల ఏనుగులను చూసేందుకు ప్రత్యేకంగా ఇక్కడ ఫారెస్ట్ రిజర్వులు కూడా ఉన్నాయి. అయితే ఈ దేశంలోనే ఈ జంతు జాతి స్థిర నివాసం ఏర్పరుచుకోవడానికి బలమైన కారణాలే ఉన్నాయి. తెల్ల ఏనుగులు ఎంతో అరుదైన జాతి మాత్రమే కాదు. ఇవి చాలా శుభప్రదమైనవని ఆ దేశస్థులు నమ్ముతారు. వీటిని అదృష్టానికి చిహ్నాలుగా భావిస్తారు. అయితే ఈ నమ్మకం ఇప్పటిది కాదు. ఈ దేశం ఎప్పటినుంచో రాచరిక పాలన కొనసాగింది. పూర్వం వీటి సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే ఆ పాలకుడు అంత బలమైన వాడుగా వారికి అంత హోదా ఉన్నట్టుగా భావించేవారట. ఈ దేశంలో తెల్ల ఏనుగులతో పాటు గులాబీ వర్ణంలో ఉండే ఏనుగులను కూడా చూడవచ్చు. థాయిలాండ్ దేశ సంస్కృతిలో ఇవి బలమైన పాత్రను పోషిస్తూ వస్తున్నాయి.
థాయ్ రాజు దివంగత భూమిబోల్ తన రాజవంశంలో ఇరవై ఒక్క తెల్ల ఏనుగులను కలిగి ఉన్నాడు. స్థానికులు దీనిని రాజు సాధించిన విజయంగా భావించారు. కానీ ఈ ఇరవై ఒక్క ఏనుగులలో, వాటిలో ఐదు మాత్రమే రాజ బిరుదును కలిగి ఉన్నాయి. ఎందుకంటే బిరుదును కలిగి ఉండటానికి, ఏనుగు ఇంపీరియల్ బ్యూరో చేసిన అనేక పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి.
ఈ రాజ ఏనుగులకు చాంగ్ పీక్ అని పేరు పెట్టారు. ఈ ఏనుగుల కార్నియా చుట్టూ గులాబీ లేదా తెలుపు రంగు ఉంటుంది. దంత చర్మం మరియు భుజాలు ఒకే గులాబీ రంగులో ఉంటాయి. వాటికి గులాబీ లేదా తెలుపు కాలి గోళ్లు ఉండేవి. 1921 నాటి ఏనుగుల నిర్వహణ చట్టం ప్రకారం, ఎవరైనా అలాంటి జంతువును కనుగొంటే, దానిని పాలక చక్రవర్తికి సమర్పించాలనే రూల్ ఉండేది. వీటి మనుగడ వల్ల థాయిలాండ్ దేశం అన్ని రకాల వనరులతో కలకలలాడుతూ ఉంటుందని అక్కడి వారు నమ్ముతారు.
తెల్ల ఏనుగులు శ్రేయస్సుకు చిహ్నం
థాయిలాండ్‌లో, తెల్ల ఏనుగులను శుభసూచకంగా భావిస్తారు. స్థానిక ప్రజలు ఏనుగులను శుభప్రదమైనవి దైవికమైనవిగా నమ్ముతారు. థాయ్ సంస్కృతి ప్రకారం, తెల్ల ఏనుగులు వ్యాపారం, వ్యక్తిగత జీవితంలో విజయాన్ని తెస్తాయి. అవి సంపద శ్రేయస్సును సూచిస్తాయి. అయితే, తెల్ల ఏనుగులకు సంబంధించిన రాజ చరిత్ర స్థానికులకు దాని విలువను చాలా పెంచింది.