Womens T20 World Cup 2026 : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 ఫుల్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ప్రపంచ కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 12 నుండి జూలై 5 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. వీటి మధ్య 33 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ జూన్ 12న ఆతిథ్య ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరుగుతుంది. ఇక భారత జట్టు తమ మొదటి మ్యాచ్‌ను జూన్ 14న పాకిస్తాన్ తో ఆడనుంది.
వరల్డ్ కప్‌లో పాల్గొనే 12 దేశాలను ఆరు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ Aలో భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. మిగిలిన రెండు జట్లు గ్లోబల్ క్వాలిఫైయర్స్ ద్వారా గ్రూప్ Aలో చోటు సంపాదిస్తాయి. ఇక గ్రూప్ Bలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ ఉన్నాయి. మిగిలిన రెండు జట్లు కూడా గ్లోబల్ క్వాలిఫైయర్స్ ద్వారానే నిర్ణయించనున్నారు. ప్రతి గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి. సెమీఫైనల్ మ్యాచ్‌లు జూన్ 30న, జూలై 2న ది ఓవల్ మైదానంలో జరుగుతాయి. ఇక ఫైనల్ మ్యాచ్ జూలై 5న లార్డ్స్ మైదానంలో జరుగుతుంది.

World Cup 2026
Shreyanka Patil’s dreams and manifestations for the big prize ✨
More on the ICC Women’s T20 World Cup 2026 fixtures ➡️ https://t.co/X2BqQphwSC pic.twitter.com/ZcZqmuU7bn
— ICC (@ICC) July 6, 2025
భారత్ షెడ్యూల్ ఇదే
భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2026లో తమ ప్రస్థానాన్ని జూన్ 14న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రారంభిస్తుంది. భారత జట్టు తమ రెండో మ్యాచ్‌ను జూన్ 17న గ్లోబల్ క్వాలిఫైయర్స్ నుంచి వచ్చే జట్టుతో ఆడుతుంది. దాని మూడో మ్యాచ్ జూన్ 21న దక్షిణాఫ్రికాతో, నాలుగో మ్యాచ్ జూన్ 24న గ్లోబల్ క్వాలిఫైయర్స్ నుంచి వచ్చే రెండో జట్టుతో ఆడుతుంది. గ్రూప్ స్టేజ్‌లో భారత్ చివరి మ్యాచ్ జూన్ 28న ఆస్ట్రేలియాతో ఉంటుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..