Ye Maaya Chesave: ఏ మాయ చేశావే సినిమాకు నాగ చైతన్య కంటే ముందు ఆ స్టార్ హీరోను అనుకున్నారా? చిరంజీవిని కూడా..

Ye Maaya Chesave: ఏ మాయ చేశావే సినిమాకు నాగ చైతన్య కంటే ముందు ఆ స్టార్ హీరోను అనుకున్నారా? చిరంజీవిని కూడా..


ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న సమంత నటించిన మొదటి చిత్రం ఏమాయ చేశావే. అదే సమయంలో జోష్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగ చైతన్యకు ఇది రెండో సినిమా. ఇప్పడు ప్రముఖ నటుడిగా వెలుగొందుతోన్న గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ ను తీర్చి దిద్దారు. నాగ చైతన్య, సమంత ల కెరీర్ లో మైల్డ్ స్టోన్‌ గా ఏమాయ చేశామే సినిమా నిలిచిపోయింది. ఈ మూవీతోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత పెద్దల అనుమతితో పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకుని విడిపోయారనుకోండి అది వేరే విషయం. కాగా ఏ మాయ చేశావే సినిమా రిలీజై జులై 18 నాటికి 15 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన డైరెక్టర గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఏమాయ చేశావే సినిమా గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘ ఏ మాయ చేశావే చిత్రానికి హీరోగా మొదట నాగచైతన్యను అనుకోలేదు. స్టార్ హీరో మహేశ్‌ బాబుతోనే తీద్దామని ఈ కథను రాసుకున్నాను. అంతేకాదు ఈ చిత్రంలో క్లైమాక్స్‌లో చిరంజీవి గెస్ట్ రోల్‌గా పెట్టాలని కూడా అనుకున్నాను. క్లైమాక్స్ భిన్నంగా ఉండాలని మెగాస్టార్‌తో ప్లాన్‌ చేశాను. కానీ కుదరలేదు’ అని గౌతమ్ వాసుదేవ్ మేనన్ చెప్పుకొచ్చారు. కాగా ఇందిరా ప్రోడక్షన్స్ పతాకం పై ఘట్టమనేని మంజుల ఈ సినిమాను నిర్మించం విశేషం.

ఇవి కూడా చదవండి

గౌతమ్ వాసుదేవ్ కామెంట్స్.. వీడియో..

ఏ మాయ చేశావే సినిమా ఏకకాలంలో తమిళంలో కూడా విడుదలైంది. అక్కడ ‘విన్నైతాండి వరువాయా’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో శింబు, త్రిష హీరో, హీరోయిన్లు గా నటించారు.. కానీ ఈ సినిమా హిందీలో ‘ఏక్ థా దీవానా’ పేరుతో రీమేక్‌ అయింది. అక్కడ మాత్రం ఈ మూవీ పెద్దగా ఆడలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *