జ్యోతిషశాస్త్రం ప్రకారం నవ గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. ఇలా గ్రహాల సంచారం వలన మొత్తం 12 రాశులకు చెందిన ప్రజలను ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా ఈసారి కుజుడు, శనీశ్వరుడు కూడా తమ రాశిలో గమనాన్ని మర్చుకోనున్నారు. జూలై నెలలో శనీశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో తిరోగమనంలోకి వెళ్తాడు. కుజుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల కదలికలో మార్పుతో కొన్ని రాశులకు స్వర్ణకాలం ప్రారంభం కావచ్చు.
ఈ రాశుల వారి అదృష్టం బంగారంలా ప్రకాశిస్తుంది
ధనుస్సు రాశి: ధనుస్సు వారు కుజుడు, శనిశ్వరుడి రాశిలో మార్పు వలన మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు వృత్తి, వ్యాపారంలో పెద్ద పురోగతిని పొందవచ్చు. కుజుడు, శనిశ్వరుడి సంచారము వలన ధనుస్సు రాశి వారి సంపద నిలయం సక్రియం అవుతుంది. ఈ సమయంలో ధనుస్సు రాశికి చెందిన ఉద్యోగస్తులకు సానుకూల మార్పులు ఉండవచ్చు. ఉద్యోగంలో పదోన్నతి పొందవచ్చు. వీరి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దీనితో పాటు ఈ రాశికి చెందిన వ్యక్తులు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే అవకాశాలు కూడా ఉన్నాయి.
మకర రాశి: ఈ సమయంలో మకర రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరు జీవితంలోని అన్ని సవాళ్లను పూర్తి శక్తితో ఎదుర్కొంటారు. పనితీరు మెరుగుపడుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. పాత పెట్టుబడిలో ధన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వాహనం, ఆస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు.. కొనాలనే కోరిక నెరవేరుతుంది. మొత్తంమీద ఈ సమయంలో మకర రాశి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం.. పూర్తి మద్దతు లభిస్తుంది.
ఇవి కూడా చదవండి
మీన రాశి: శనీశ్వరుడు మీన రాశిలో తిరోగమనంలో ఉండనున్నాడు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఈ యాదృచ్చికం జరగబోతోంది. మీన రాశి వారు శని సంచారము వలన చాలా ప్రయోజనం పొందవచ్చు. ఈ సమయంలో వీరి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. జీవితం కొత్త దశను పొందుతారు. ఉద్యోగం, వ్యాపారాన్ని మార్చుకోవాలనుకున్నవారికి ఈ సమయం చాలా మంచి సమయం. అపార ప్రయోజనం పొందుతారు. ఇది మాత్రమే కాదు జీవితంలోని ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పునాది కూడా బలంగా ఉంటుంది. దీనితో పాటు సమాజంలో మీన రాశి వారి గౌరవం పెరుగుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.