Meat Goog Or Bad మాంసాహారం ఏ మేరమంచిది?

Meat Goog Or Bad: పాత రాతియుగం నాటి తిండే మంచిదా?

నాగరికత ఎంతో పురోగమించిందని భావిస్తున్న ఈ రోజుల్లో… ఎప్పుడో పాఠలకు యుగం మనుషుల ఆహారపుటలవాట్లే ఆరోగ్యానికి మంచిపని చెబితే.. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏముంటుంది? దాదాపు 10 వేలఏళ్ల క్రితం మనిషి ఆరంభించిన వ్యవసాయ విధానాలే నేడు మన ఆరోగ్యానికి నష్టదాయకంగా పరిణమించాయన్న వాదన ఇటీవల అక్కడక్కడా తరచుగాన వినిపిస్తోంది. వ్యవసాయం, పంటలు పండించటం మొదలుపెట్టక ముందు మనిపి తిన్న ఆహారం మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కొందరు వాదిస్తున్నారు. వీటిని ‘స్టోన్ ఏజ్ డైట్స్’ అనీ, ‘పేలియో డైట్స్’ అనీ అంటున్నారు. మన పూర్వీకులు వేట వంటి మార్గాల ద్వారా సేకరించిన ఆహారం తిని జీవించారు తప్ప మనలాగా రకరకాల పాల ఉత్పత్తులూ, గింజ ధాన్యాలూ తిననే లేదని వీళ్లు ఘంటాఫథంగా చెబుతున్నాడు. కాబట్టి- మనం కూడా అవేవీ ముట్టుకోకుండా కావల్సినంత కొవ్వు లేని మాంసం, చేపలు, పండ్లు, పచ్చికూరగాయలూ తింటే సరిపోతుందని వీరు సూచిస్తున్నారు.

పాతరాతి యుగపు ఆహారంగా భావిస్తున్న దీని గురించి ‘బ్రిటిష్ సొసైటీ ఫర్ ఎలర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్’ లోనూ, పలు ప్రముఖ పత్రికల్లోనూ చర్చలు 2001 సెప్టెంబర్లో జరిగాయి. తొలిగా ఈ ఆలోచనను కొలరాడో స్టేట్ యూనివర్సిటీకి చెందిన న్యూట్రినిస్టు లారెన్ కార్డెన్ చర్చకు పెట్టారు. ఇదే అంశంపై ఆయన 2004లో పేలియో డైట్’ అనే పుస్తకం కూడా రాశారు. ‘మాంసం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుని బరువు తగ్గండి, ఆరోగ్యంగా ఉండండి’ అని ఆయన సిఫార్సు చేస్తున్నారు. రాతియుగపు ఆహారం వల్ల వివిధ రకాల జబ్బులు రావని చెప్పటానికి బలమైన ఆధారాలున్నాయని ఆయన వాదిస్తున్నారు. ఇప్పటికీ వేట-సేకరణ ఆహారపద్ధతులపైనే ఆధారపడి జీవిస్తున పపువా న్యూగినియా ద్వీపవాసుల్లో గుండెజబ్బులు చాలా అరుదని ఒక అధ్యయనంలో వెల్లడైంది. రాతియుగంలో అంటే దాదాపు 25 లక్షల ఏళ్ల క్రితం నుంచి 10 వేల ఏళ్ల క్రితం వరకూ మనుషులు ఎటువంటి ఆహారం తీసుకున్నారనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత లేదని పురాతత్వ శాస్త్రజ్ఞులు అంటున్నారు.

రాతియుగపు ఆహారం” అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు.(Meat Goog Or Bad) మానవుల ఆహారపుటలవాట్లు కాలక్రమంలో రకరకాలుగా మారుతూ వచ్చాయి’ అని లివర్ పూల్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజిస్టు జాన్ గౌలెట్ పేర్కొంటున్నారు. చాలామంది అనుకునే దానికంటే భిన్నంగా ఆఫ్రికావాసులు చాలా తక్కువ మాంసాహారాన్ని తీసుకునేవారనీ, శీతల ప్రాంతాల్లో నివసించేవారు తప్పనిసరై ఏ జంతువు దొరికితే దాన్నే తినేవారని ఆయన వివరించారు. “మనకు ఇప్పుడు జంతువుల ఎముకల వంటి ఆధారాలే లభిస్తున్నాయి. దాంతో పాత రాతియుగంలో మాంసాహారమే తిన్నారన్న వాదన వైపు మొగ్గు చూపాల్సి వస్తోంది. అదే శాకాహారపు అవశేషాలు కాలగర్భంలో కలిసిపోవడంతో దానికి సంబంధించిన ఆధారాలేవీ దొరకవు” అని ప్రాచీనఆహారం, ఆరోగ్యంపై పరిశోధనలు చేస్తున్న ఆండ్రూ విలార్డ్ వివరించారు. రాతియుగం తర్వాత ప్రాచ్యదేశాల్లో ముడిగింజలు సేకరించి తినేవారనడానికి ఆధారాలున్నాయనీ, బహుశా అదే విధానం ఇతర ప్రాంతాలకూ విస్తరించి ఉండవచ్చనీ భావిస్తున్నారు.

మనవాళ్ళు మాంసప్రియులు : మాంసాహారవినియోగంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో 2007, జూన్లో జరిగిన ఒక సర్వే ఫలితాలు తెలిపాయి. రాష్ట్రంలో 89 శాతం మంది మాంసాహారులు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. వీరిలో 70 శాతం మంది చికెన్నే కోరుకుంటున్నారట. జాతీయ పోషకాహారసంస్థ (ఎన్ఐఎన్) నిర్వహించిన ఈ సర్వేలో మటన్, చికెన్ల తర్వాత తక్కువమంది చేపలు తింటున్నట్టు వెల్లడైంది. ఏదో రూ. 3 వేల కోట్ల వ్యాపారం జరుగుతూ దేశంలోనే మనరాష్ట్రం నాన్ వెజిటేరియన్స్ పరంగా అగ్రస్థానంలో ఉన్నదట! శారీరకరుగ్మత విషయంలో మనరాష్ట్రం దేశస్థాయిలో ఎంతటి అగ్రస్థానంలో ఉంటున్నదో మాత్రం తెలియరాలేదు.

చికెన్ :

శరీరానికి ప్రొటీన్లను అందించే వనరుగా, మరీ ముఖ్యంగా కొవ్వు కాస్త తక్కువగా ఉండే మాంసాహారంగా దీనిని చెప్పుకోవచ్చును. చికెన్లో ఉండే పోషకాలు: ప్రొటీన్లు సమృద్ధిగా లభించే ఆహారంలో చికెన్-ముఖ్యమైనది. బరువు తగ్గేందుకు చాలా మంది వ్యాయామం వంటి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఫలితంగా కండరాలు కొంత శక్తిని కోల్పోతాయి. ప్రొటీన్లు ఈ శక్తిని వెనువెంటనే భర్తీ చేస్తుంటాయి. ఐరన్ లో ఒక రకమైన ‘హెమి ఐరన్’కు కూడా చికెనే ముఖ్య వనరు.

ఈ రకం ఐరన్ కేవలం మాంసాహారంలోనే లభిస్తుంది. మన శరీరాలు దీన్ని చక్కగా స్వీకరిస్తాయి. ఫలితంగా ఐరన్ లోపం కారణంగా వచ్చే రక్తహీనతను శరీరం తేలిగ్గా అధిగమిస్తుంది. మన శరీరం ఇన్ఫెక్షన్లపై పోరాడేందుకు అవసరమైన జింకు పదార్ధం కూడా కోడి మాసంలో సమృద్ధిగా ఉంటుంది. ఇది గాయాలు మాన్పడానికి కూడా సహకరిస్తుంది. చికెన్లో లో పలురకాల బి-విటమిన్లు ఉంటాయి. దీని వల్ల-చర్మానికి, నరాలకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. జ్ఞాపకశక్తి పెరగటం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే జిజ్ఞాస పెరుగుతాయి. కోడిలోని కొన్ని భాగాల్లో మెగ్నీషియం, పోటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు ఖనిజాలూ- రక్తపోటును నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. గుండెకు సంబంధించిన సురక్షిత విధానాలు పాటిస్తున్నా… బరువు తగ్గడానికి డైటింగ్ చేస్తున్నా… కోడిమాంసంలోని చర్మాన్ని తినకపోవడం ఉత్తమం.

కొవ్వును తప్పించే చిట్కాలు :

మిగతా మాంసాలన్నింటిలోకి కోడిమాంసంలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. కోడిమాంసలో కూడా నాటుకోడి రెక్కలు కలిసే భాగంలో ఇంకా తక్కువ ఉంటుంది. పెద్దకోడి మాంసంలో కంటే కోడి పిల్లల మాంసంలో కొవ్వు తక్కువ ఉంటుంది. చికెన్లో కొవ్వు ఎక్కువగా ఉండే భాగం – స్కిన్, స్కిన్ కింది భాగం. అందుకని కొవ్వు తక్కువ తినాల్సినవాళ్లు- వండటానికి ముందు ఆ భాగాన్ని, పైకి స్పష్టంగా కొవ్వు కనిపిస్తున్న భాగాలను పూర్తిగా తీసివేయాలి. దీనివల్ల కొవ్వము సగానికి సగం తగ్గించినట్లవుతుంది. ఎంత తీసినా ఇంకా ఎంతో కొంత మిగిలి ఉంటుంది. కాబట్టి దాని ప్రభావం అంతగా ఉండకూడదంటే బాగా నూనెలో వేపటం ఫ్రై మానెయ్యాలి. తినటానికి ముందు స్కిన్ తొలగించినా సరిపోతుందిగానీ వండటానికి ముందే తొలగిస్తే వంటపాత్రలు కూడా ‘ఫ్యాట్ ఫ్రీ’గా మారతాయి. ఇతర వంట పద్ధతులకంటే మొత్తం కోడిని సన్నటి మంట మీద రోస్టు చేయడం ద్వారా కొవ్వును చాలా భాగం కరిగించేయవచ్చు.

అవయవాలు చేసే మేలు :

రెక్కలు కలిసే భాగంలో అతితక్కువ కొవ్వు నిల్వలు ఉంటాయి. చర్మం కూడా తొలగిస్తే మరీ ఉత్తమం. ఇందులో కొవ్వు 19 శాతం మాత్రమే ఉండటం వల్ల గుండెకు సంబంధించిన ఇబ్బందులున్నవారు సైతం (డాక్టర్ సలహాతో నిరభ్యంతరంగా తినవచ్చు. విటమిన్-ఏ, విటమిన్-బి12 వంటి అత్యుత్త పోషకవిలువలు కాలేయంలో అధికంగా ఉంటాయి. అలాగే గర్భిణులకు అవసరమై విటమిన్-బి రకానికి చెందిన ఫొలేట్ దీనిలో గణనీయంగా ఉంటుంది. ఈ ఫొలేట్ సరైన మోతాదు అందకపోతే గర్భి లకు ప్రనవనమయంలో సమస్యని ఎదురవుతాయి. రక్తహీనత రాకుండా చూసే హెమీ ఐరన్ కూడా దీనిలోనే ఎక్కుగా ఉంటుంది.

కొన్ని జాగ్రత్తలు :

కోడిమాంసం ద్వారా సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా వ్యాపించే ప్రమాదం ఉన్నందున శుభ్రత విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. మాంసాం ఫ్రిజ్లో భద్రపరిచినప్పుడు ఈ బ్యాక్టీరియా లోపల్లోపలే పెరిగే అవకాశం ఉంది ఇది తగినంతగా వేడి చేసినపుడు చనిపోతుంది.

చికెన్ (100)గ్రామ్ క్యాలరీలు కొవ్వు గ్రా..
నాటుకోడి
ముందు భాగం (బ్రెస్ట్ )
(స్కిన్ లేకుండా )
ముందు భాగం (బ్రెస్ట్ )
(స్కిన్తో )
కాళ్ళు (స్కిన్ లేకుండా )
కాళ్ళు (స్కిన్ తో )
రెక్కలు (స్కిన్ లేకుండా )
రెక్కలు (స్కిన్ తో )
కింది భాగం
బ్రాయిలర్
ముందు భాగం (బ్రెస్ట్ )
(స్కిన్ లేకుండా )
ముందు భాగం (బ్రెస్ట్ )
(స్కిన్తో )
కాళ్ళు (స్కిన్ లేకుండా )
కాళ్ళు (స్కిన్ తో )
రెక్కలు (స్కిన్ లేకుండా )
రెక్కలు (స్కిన్ తో )
కింది భాగం


135

153
159
170
163
207
123


165

197
191
232
203
290
176


1

3
4
5
3
10
7


4

8
8
13
8
20
7

కొవ్వు పదార్ధాల విషయమై పరిశీలించితే మటన్ లో కంటే చికెన్ లోనే తక్కువ .100గ్రా చికెన్ లో 60 60 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటే మటన్లో 65 మిల్లీగ్రాములు ఉంటుంది. రాత్రివేళ మన శరీరం ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ దృష్ట్యా చికెన్ రాత్రిపూట కాకుండా లంచ్లో మాత్రమే తీసుకోవడం కొంతలో కొంత మేలు. చికెన్ మాత్రమే కాదు, మాంసాహారాన్ని రాత్రిపూట భుజించడం ఏమాత్రం మంచిదికాదు. వారానికి రెండుసార్లు చికెన్ లేదా మాంసాహారం తీసుకుంటూ-మరుసటి వారంలో రెండుసార్లు చేపలు తీసుకుంటే బ్యాలన్స్ కాగల అవకాశం ఉంటుంది.

మాంసాహారంలో ప్రొటీన్, కొవ్వు ఎక్కువగా ఉండి, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ స్వల్పంగా ఉన్నాయి. ఇవేకాక రిబోప్లేవిన్, నియాసిస్, ఐరన్, జింక్, విటమిన్లు వగైరాలు ఉన్నాయి. ప్రోటీన్లు, ఫాట్స్ అధికంగా ఉండటం వల్ల రక్తంలో కొలెస్టరాల్ పెరిగి గుండెజబ్బులు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.మాంసాహారంలో విటమిన్ ‘బి12’ పుష్కలంగా లభిస్తుంది. మాంసం, కాలేయం, గుడ్లు, పాల ఉత్పత్తులు, ఈస్ట్ మొదలైనవి ‘బి-12’ ను అధికంగా కలిగివుంటాయి. శరీరానికి అత్యంత ఆవశ్యకమైన ప్రొటీన్లకు కూడా నల్లాని హ్యారమే నిలయం, రక్తాన్ని, వృష్టి చ్చే అన్నము కూడా కంటిచూపుకు అవసరమైన; విటమిన్ -ఎ మాంసంలో ఉంటుంది. ప్రొటీన్లను జీర్ణం చేసుకునేందుకు అవసరమైన ఫాస్ఫరస్ కూడా ఎక్కువ. జంతువుల మాంసం ముక్కలు, కార్డం, కిడ్నీలు, ప్లీహం (స్క్రీన్), మెదడు వంటి అవయవాలాలో ప్రొటీన్లు పుష్కలంగా

ఉంటాయి. మాంసాహారంతో ఇబ్బందులు : జంతువులలో సాధారణంగా ఇతర శరీరభాగాలకన్నా కాలేయం, కిడ్నీలు, గుండె వంటి ముఖ్యమైన అవయవాల్లో కొవ్వుల నిల్వ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మెదడులో వీటి మోతాదు మరీ ఎక్కువ. మెదడులో రెండువేల మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ దృష్ట్యా వీటిని తీసుకోకపోవటం మంచిది. ఏ తరహా మాంసాహారం తీసుకున్నా దాన్ని వాడే విషయంలో పలు జాగ్రత్తలు పాటిస్తే దుష్పరిణామాలు క్షీణించిపోతాయి.

బాగా ఉడికించే తినాలి ! : మాంసాహారం తినడానికి రుచికరంగా ఉంటుంది. బలవర్ధకం కూడా. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దీనితో కొన్ని నష్టాలూ తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగా ఉడికించని, పచ్చి మాంసాన్ని తింటే జంతువుల్లో ఉన్న వ్యాధికారక సూక్ష్మజీవులు మనలోకి చేరే ప్రమాదం ఉంది. ‘టాక్సోప్లాస్మోసిస్ గోండై’ అనే సూక్ష్మక్రిమి మాంసాహారం ద్వారా మనుషుల్లోకి చేరి మెల్లగా ‘టాక్సోప్లాస్మోసిస్’ అనే ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది.

సాధారణ ఆరోగ్యవంతులకు దీనివల్ల పెద్దగా నష్టమేం ఉండకపోవచ్చు. కానీ – ఎయిడ్స్, పోషకాహార లోపం, క్షయ, శుభ్రత లోపించటం వంటి కారణాల చల్ల మన దేశంలో ఎంతోమందికి ఇప్పటికే రోగనిరోధక వ్యవస్థ అంతంతమాత్రంగా ఉంటోంది. మాంసాహారంలో ఉండే ఈ సూక్ష్మజీవులు సమర్థంగా లేని వారికి టాక్సోప్లాస్మోసిస్ ను కలిగిస్తాయి. పైగా ఈ సూక్ష్మజీవి – శిశువుల్లో ఇలా రోగనిరోధక వ్యవస్థ పుట్టుకతో వచ్చే లోపాలకు కూడా కారణమవుతుంది. ఇప్పుడు మన దేశంలో ఎయిడ్స్ బాధపడుతున్న వారు మరణానికి చేరువు కావడానికి ఇది కూడా ఓ ముఖ్యకారణమని 2004 గుర్తించ్చారు.

ఎక్కడిది? : టాక్సోప్లాస్మోసిస్ గోండై మొదట జంతువుల్లో ఉన్నట్లు 1908లో గుర్తించారు. ఆ తర్వాత 1923లో మనుషుల్లోనూ దర్శనమిచింది. అప్పటి నుంచీ ప్రపంచజనాభాలో కనీసం సగానికి పైగా ఈ సూక్ష్మక్రిమి బారినపడుతున్నారని అంచనా. 2004 లో ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన ఒక సర్వేలో కాన్పు కష్టమైన 27 శాతం మంది స్త్రీలలో ఈ ఇన్ఫెక్షన్ ఛాయలు కనిపిస్తున్నట్టు గుర్తించారు. ఏ కారణం చేతనైనా రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడితే ఈ ఇన్ఫెక్షన్ రావచ్చు. దీనివల్ల పూ జ్వరాన్ని పోలిన లక్షణాలు, వెన్నెముక, గుండె కండరాల్లో వాపు వంటివి తలెత్తుతాయి. గర్భిణీ స్త్రీలు దీని బారిన పడితే అది గర్భంలో ఉన్న శిశువుకు కూడా సోకే అవకాశం ఉంది. దీని ఫలితంగా-శిశువుకు కళ్లు, మెదడులకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. అయితే సకాలంలో యాంటీబయటిక్స్ వాడటం ద్వారా దీన్ని చాలా వరకూ అదుపులోకి తీసుకురావచ్చు.

గర్భిణులు మొదటి మూడు నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి నుంచి బిడ్డకు సోకే ఇన్ఫెక్షన్ల వల్లే తొలి మూడు నెలల్లో అబార్షన్లు ఎక్కువగా జరుగుతాయి. మరికొన్ని సార్లు ఈ ఇన్ఫెక్షన్లు గర్భంలోని శిశువు మెదడు, నాడీవ్యవస్థలను దెబ్బతీస్తాయి. పైగా గర్భస్థశిశువుకు ఈ ఇన్ఫెక్షన్ సోకినా లక్షణాలు వెంటనే పైకి కనిపించవు. దానివల్ల కొన్నేళ్ల తర్వాత కూడా పిల్లలకు మనోవైకల్యాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతే కాకుండా మూర్చ, కండరాలు బిరుసుగా మారడం, దృష్టిలోపాలు, వినికిడిలోపాలు, మానసిక ఎదుగుల ఆగిపోవడం వంటి సమస్యలు కూడా రావచ్చు.

ఈ క్రిములు చాలా వరకూ మాంసం ద్వారానే మనుషుల్లోకి చేరుతున్నాయి. మలంలో కూడా సిస్టుల రూపంలో క్రిములు ఉండచ్చు. అక్కడి నుంచి అవి కలుషితనీటి ద్వారా మనుషుల్లోకి చేరుతాయి. మొత్తం మీద కలుషిత నీరు, పచ్చివి, సరిగా ఉడికించని మటన్, ఇతర మాంసాహారాల ద్వారా ఈ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువ. నిల్వ ఉంచిన మాంసం తినకుండా ఉండటం, మాంసాన్ని బాగా ఉడికించి మాత్రమే తినడం. ముఖ్యంగా పిల్లులను దూరంగా ఉంచటం అవసరం.

Meat Goog Or Bad మాంసాహారం ఏ మేరమంచిది?మరికొన్ని జాగ్రత్తలు :

మాంసాన్ని కోసి కింద వేసినప్పుడు దానికి అక్కడి గచు నుంచి హానికారక బ్యాక్టీరియా సోకవచ్చు. * జంతువులను కోసే పద్ధతి, ఉపయోగించే కత్తులు, చెక్కలు, అపరిశుభ్రమైన చేతులు, పాత్రలు వంటివన్నీ బ్యాక్టీరియా సోకడాని కారణం కావచ్చు. ఇది ఇంటికి వచ్చేసరికి మాంసం లోపలికి చేరుతుంది. మాంసం ముక్కల పైభాగం మొత్తం సరిగా ఉడికితేనే లోపలకు చేరిన బ్యాక్టీరియా నాశనమవుతుంది. * మటన్ వంటి మాంసం వండిన తర్వాత దాని మీద గులాబి రంగు చాలా వరకు పోవాలి. అప్పుడే అది ఉడికినట్లు. మరీముఖ్యంగా, వంట ప్రారంభానికి ముందు చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఒక పదార్థంలోని బ్యాక్టీరియా మరో పదార్థంలోకి చేరకుండా చూసుకోవాలి. * పచ్చిమాంసాన్ని ఉంచిన ప్లేట్లను పూర్తిగా కడిగిన తర్వాతే వాటిలో ఉడికిన మాంసాన్ని పెట్టాలి.

Meat Goog Or Bad మాంసాహారంతో క్యాన్సర్ ముప్పు : నిరంతరం మాంసాహారం తీసుకునేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్టు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్లో పేర్కొన్నారు. స్త్రీలలో వచ్చే రొమ్ము క్యాన్సర్ యుక్తవయసులో అంటే రొమ్ము కణాలు పెరిగే వయసులో ఎక్కువగా వస్తోంది. మాంసాహారంతో వచ్చే క్యాన్సర్లలో పెద్దపేగు క్యాన్సర్ ప్రధానమైనదిగా వారు పేర్కొన్నారు.అమెరికన్ క్యాన్సర్ సొసైటీకి చెందిన పరిశోధకులు దాదాపు 60 ఏళ్ళ వయసున్న 1,50,000 మందిని కలిసి, వారి ఆహారపు అలవాట్లను పరిశీలించారు. 1982 నుండి 1992 వరకు చాలా ఎక్కువగా మాంసాహారం తీసుకున్న వారిని పరిశీలిస్తే, అందులో 30 నుంచి 40 శాతం మంది పెద్ద పేగు, రెక్టల్ క్యాన్సర్ వ్యాధికి గురయినట్టు బయటపడింది.

నిజానికి మాంసాహారం అధికంగా తీసుకోవడం కన్నా, పొగ తాగడం, స్థూలకాయం, బొత్తిగా శారీరకశ్రమ లేని తనం ఇవే ఎక్కువగా పెద్దపేగు క్యాన్సర్కు కారణమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వారు మాంసాహారాన్ని అధికంగా తీసుకోవడం పట్ల అనవసరమైన సూచనలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సొసైటీ వారు చెబుతున్నట్లు, పళ్ళు, కూరగాయలు రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షిస్తాయనేది కూడా ఎక్కడా పెద్దగా రుజువు కాలేదు అన్నారు. నెదర్ల్యాండ్లోని యనివర్సిటీ మెడికల్ సెంటర్కు చెందిన డాక్టర్ పెట్రా పీటర్ మాత్రం అన్నీ కాకపోయినా పళ్ళు, కూరగాయలు కొన్ని రకాల క్యాన్సర్లను, ప్రత్యేకించి కుటుంబగతంగా క్యాన్సర్ పీడితులు ఉన్న వ్యక్తుల్లో క్యాన్సర్ చోటుచేసుకోకుండా పళ్ళు,కూరగాయలు నియంత్రణ ఇస్తాయి అని చెప్పారు.

మాంసంలో పీచుపదార్థాలు చాలా తక్కువ. శాచురే టెడ్ కొవ్వులు ఎక్కువ. • కొవ్వు ఎక్కువ. పీచు పదార్థం తక్కువుండే ఆహారం-గుండె అబ్బులకు ఎక్కువ, రొమ్ము, పేగు క్యాన్సర్లకు దోహదం చేయచ్చు. * మన దేశంలో రోజువారీ ఆహారంలో కూడా నెయ్యి, నూనెలు అధికంగా ఉంటాయి. కాబట్టి మాంసంతో శరీరంలో వీటి శాతం ఇంకా పెరుగుతుంది. * కాబట్టి మాంసాహారం బాగా తగ్గించటం అవసరం. * ప్రొటీన్లు 23°° ఉండే ఆహారం జంతుసంబంధ పదార్థమే అయి ఉంటుంది. జంతువుల నుంచి వ్యాపించిన బ్యాక్టీరియా ఈ ఆహారంలో ఉండే అవకాశం ఉంది. * ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల కొన్ని రకాల బ్యాక్టీరియాకు కూడా ఇదే ముఖ్య ఆహారం. దీనివల్లే మాంసాహారం ద్వారా వచ్చే వ్యాధులకు కారణమవుతోంది.

మనమేం చేయాలి? : మాంసాహారాన్ని మితంగా తీసుకోవాలి. నిల్వచేసిన ఆహారం జోలికి అసలే వెళ్లకూడదు. అధిక కొవ్వు, అధిక ప్రొటీన్లు ఉన్న మాంసాన్ని ఎక్కువగా వేడి చేయటం, ఎర్రగా ఫ్రై చేయటం వంటివి చేస్తే వీటిలోని కొవ్వులు, ప్రొటీన్లు కణాలను దెబ్బతీసి క్యాన్సర్ను కారణమయ్యే ‘మ్యుటాజెన్స్’గా మారతాయి. అందువల్ల మాంసాన్ని వండటంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. * పూర్తి ఆరోగ్యవంతులు వారంలో మూడుసార్లకన్నా ఎక్కువగా తినకపోవటమే మేలు. రోజు మొత్తం మీద కూడా 65 నుంచి 70 గ్రాములకు మించకూడదు. * జంతు సంబంధ కొవ్వులైన నెయ్యి, వెన్నలను కూడా తక్కువగా వాడాలి.

క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర వ్యాధులున్నవారు డాక్టర్ సలహా మేరకే మాంసం తీసుకోవాలి. అధిక శక్తి వస్తుందని మాంసాహారం అతిగా తీసుకుంటే ప్రమాదమే. ప్రొటీన్లు ఎక్కువైతే కిడ్నీలపై పనిభారం ఎక్కువవుతుంది. వాటి పనితీరు నెమ్మదించే అవకాశం ఉంటుంది. ఫలితంగా మూత్రవిసర్జన సమస్యలు తలెత్తుతాయి. ప్రొటీన్ల జీవక్రియలో చివరి ఉత్పన్నం అమోనియా. దీన్ని కిడ్నీలు యూరియాగా మార్చి శరీరం బయటకు విసర్జిస్తాయి. కిడ్నీల పని తీరు సక్రమంగా లేకుంటే అదనంగా చేరిన అమోనియా రక్తంలోకి చేరి రక్తప్రసరణ ద్వారా మెదడుకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీనివల్ల కోమాలోకి వెళ్తారు. * మాంసాహారం తీసుకున్నప్పుడు వరి, గోధుమ, జొన్న లాంటి ఏదైనా ధ్యానంతో తయారుచేసిన పదార్ధంతో కలిపి తీసుకుంటే మంచిది. ఎందుకంటే ధాన్యంలో ఫైబర్ ఉంటుంది. మాంసాహారంలో ఉండదు. ధ్యానంలోని ఫైబర్ మాంసాహారం సక్రమంగా జీర్ణం కావడానికి, వ్యర్థాలు బయటకు పోవడానికి సహాయపడుతుంది.

మాంసం జీర్ణమవటమనేది దానోని కండరాల్లో ఉండే పీచు గట్టిదనం, దానిలో కొవ్వు, మన పొట ఎంత ఖాళీగా ఉంది అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది మటన్లో కంటే పెద్దకూర (బీస్) లో ఉండే పీచుపదార్థం సులభంగా జీర్ణం కారు అలాగే వీటిలోని కొవ్వు పదార్ధాలు కడుపును త్వరగా ఖాళీ కానివ్వవు. అలాగే తెలచపొయినం ఎర్రమాంసం కన్నాత్వరగా జీర్ణమవుతుంది. ఎర్రమాంసంలో విసరికి తప్నియా శానిటర ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే జబ్బు చేసిన వారికి తెల్లమాంసాన్ని సూచిస్తుంటారు.

ఆహారాన్ని విషతుల్యం చేస్తున ‘ఇ-కొలి’ : జంతువుల పేగుల్లో స్థావరాలు ఏర్పరచుకునే ‘ఇ-కొలి’ అనే బ్యాక్టీరియా సంతతి మాంసాహారుల ఆరోగ్యాన్ని నాశనం చేస్తోందని, జంతుమాంసాన్ని భుజించేవారు తీవ్ర అస్వస్థతకు గురవుతారని ‘యుకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనియన్ హెల్త్’ (కాంప్టన్, ఇంగ్లండ్) పరిశోధకులు 2003, ఆగస్టు నెలలో ఒక నివేదిక ద్వారా వెల్లడించారు. అత్యంత హానికరమైన ఈ సూక్ష్మజీవికి త్వరితగతిన విస్తరించే లక్షణం, ప్రాణాంతకంగా పరిణమించే నైజం ఎలా అలవడ్డాయో పరిశోధనలు జరిపారు. ‘ఇ-కోలి’ లోని 60 జన్యువులను వారు గుర్తించారు. ఇందులోని 0157 రకానికి చెందిన బ్యాక్టీరియా వలన మాంసాహారుల జీర్ణవ్యవస్థ దెబ్బతింటోందని, అతిసారం వ్యాపిస్తోందని, మూత్రపిండాలు దెబ్బతింటున్నాయని వివరిస్తూ, ఈ బ్యాక్టీరియాలో వ్యాధికారక లక్షణాలు సంక్రమించడానికి వాటిలోని అరవై జన్యువులే ప్రధాన కారణమని తేల్చారు. *

మూత్రపిండాలకు కీడుచేసే జంతుమాంసకృత్తులు : జన్యుసంబంధమైన వ్యాధులను పక్కన ఉంచితే, మనిషిని ఇబ్బందులకు గురిచేసే రకరకాల అనారోగ్యాలకు ఆహారపు అలవాట్లే మూలకారణాలని వైద్యపరిశోధకులు అంటున్నారు. ప్రకృతివైద్య చికిత్సలో అయితే, వ్యాధి విశ్లేషణ ఆహారం దగ్గరే మొదలవుతుంది. ఆహారపదార్థాలలో సరైన సమ్మేళనాన్ని పాటించడం ద్వారా ఔషధాలతో పనిలేకుండా సరిచేయవచ్చునని వైద్యనిపుణుల అభిప్రాయం. 2003, ఫిబ్రవరిలో ‘యానల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్’ పత్రికలో ప్రచురితమైన ఒక పరిశోధనపత్రంలో జంతు మాంసకృత్తులు (యానిమల్ ప్రొటీన్లు) మన మూత్రపిండాలకు చేసే హానిని గురించి మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులపరిశోధకులు వివరంగా పేర్కొన్నారు. మూత్రపిండాల పనితీరు మందగించడంలో ఇవి కీలకమని, అందువల్ల ఆయా వ్యాధిగ్రస్తులు జంతుమాంసకృత్తులకు పూర్తిగా దూరంగా ఉండాలని పరిశోధకులు హెచ్చరించారు.

Meat Goog Or Bad మాంసం తినడం ద్వారా వ్యాధులు : యాంటీబయొటిక్స్ కు లొంగని బ్యాక్టీరియా సంతతి నానాటికీ పెరుగుతోంది. జంతువుల్లో నివాసం ఏర్పరచుకొన్న వ్యాధికారక మాక్ష్మజీవులు మనుషులు పేగుల్లోకి చేరిన వైనం వైద్యపరిశోధకులను విస్మయపరుస్తోంది. మాంసం దుకాణాల్లో విక్రయించే కోడి మాంసాలను భుజించేవారిని ఇవి అస్వస్థతకు గురిచేస్తున్నాయని పరీక్షలలో తెలియవచ్చింది. జీర్ణాశయవ్యాధులు యాంటీబయోటిక్స్ కు లొంగకపోవడానికి కారణాలను ఆరాతీసిన సూపధ్యంలో ఈ సంగతులు వెల్లడయ్యాయి. కారణాలను పరిశోధించగా అధికమైన మాంసం దిగుబడికోసం పశువులకు ఎక్కువ మోతాదుల్లో యంటీబయొటిక్స్్స్న ఇవ్వడమేనని తేలింది. దీనివల్ల పశువులు బాగా పెరగడంతోపాటు వాటిలోని సూక్ష్మజీవులు ఔషధ నిరోధకశక్తిని సంతరించుకొన్నాయని పరిశోధకులు గుర్తించారు.

ఇది విషాహారం కన్నా తీవ్రమైన సమస్యగా అభివర్ణించారు. ‘ఇ-కొలి’ లాంటి వ్యాధికారక సూక్ష్మజీవులు మాంసాహారుల పేగుల్లోకి చేరుతున్నాయని ఫలితంగా జీర్ణాశయ వ్యాధుల కేసుల సంఖ్య పెరుగుతోందని వివరించారు. దీంతోపాటు, సిప్రో’ వంటి శక్తివంతమైన యాంటీబయొటిక్స్ వాడకం మితిమీరడం వల్ల కూడా శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనమవుతోందని, బ్యాక్టీరియా ఔషధనిరోధకశక్తిని పెంపొందించుకొంటున్నాయని వైద్య పరిశోధకులు అన్నారు. అమెరికాకు చెందిన ‘యానియన్ ఆఫ్ కన్సర్న్ సైంటిస్ట్స్’ దీనికి సంబంధించిన అధ్యయన నివేదికను 2001, అక్టోబర్ లో రూపొందించింది. ఏటా 1,20,00,000 కిలోగ్రాముల యాంటీబయొటిక్స్ ను జంతువుల ఫారాల్లో ఉపయోగిస్తున్నారని, 9,00,000 కిలోగ్రాములను మనుషులకోసం వాడుతున్నారని అందులో పేర్కొన్నారు.

నిల్వ ఉంచిన మాంసాహారంతో క్యాన్సర్! మాంసాహారాన్ని నిల్వ ఉంచేందుకు సోడియం నైట్రేట్ అనే రసాయనాన్ని కలుపుతారు. అయితే ఈ నైట్రేట్లచర్య కారణంగా జన్యుపరివర్తన సంభవించి, అది పెద్దపేగు (కొలోన్) క్యాన్సర్కు దారితీసే ప్రమాదం లేకపోలేదని పరిశోధకులు అంటున్నారు. నైట్రేట్లు చల్లి, నిల్వ ఉంచిన మాంసాహారంతో తయారైన హాట్ డాగ్స్’ ని పరీక్షించిన అనంతరం వారీ నిర్ధారణకు వచ్చారు. వేయించిన ఉల్లిపాయలను మాంసపు చుట్టలలో చుట్టి ఉడికించే వంటకమే ఈ హాట్ డాగ్స్. అమెరికన్లు నీటిని విపరీతంగా అరగిస్తారు.

పరిశోధకులు స్వచ్ఛమైన నీటిని ఉపయోగించి హాట్ డాగ్స్లోని సమ్మిళితాలను సంగ్రహించినపుడు ‘ఎన్-నైట్రోసో’ అనే మిశ్రమం బయటపడింది. ఈ మిశ్రమాన్ని వారు ఆహారపదార్ధాలలో నివాసముండే సాల్మనెల్లా బాక్టీరియాతో చర్య జరిపించగా క్యాన్సర్ కారణమయ్యే జన్యు పరివర్తన సంభవించింది!. క్యాన్సర్ కారకాలను ‘కార్సినజెనోక్స్’ అంటారు. “ఎన్.నైట్రోసోలలో చాలా వరకూ కార్సినో జెనిక్లో. వీటి వల్ల మానవదేహంలోని వివిధ అవయవాలలో క్యాన్సర్ వృద్ధిచెందే అవకాశం ఉంది” అని 2006, ఆగస్ట్నెలలో ఈ పరిశోధక బృందానికి నాయకత్వం వహించిన ఐర్లండ్ ప్రొఫెసర్ మాథ్యూలిక్స్ వెల్లడించారు.

మాంసాహారంతోనూ రొమ్ముక్యాన్సర్ ! : ఆహారపు అలవాట్లకు, క్యాన్సర్లు రావటానికి మధ్య సబంధమేమిటన్న కోణంలో 2003లో కెనడాలోనూ ఒక అధ్యయనం నిర్వహించారు. ఆహారంలో ఎక్కువగా సంతృప్త కొవ్వులు తీసుకుంటున్న స్త్రీలు-స్థూలకాయులైనా, కాకున్నా వాళ్లకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటోందని గుర్తించారు. ‘బ్రిటీష్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్” ఈ అధ్యయన వివరాలను ప్రచురించింది. ఈ అంశం మీద గతంలో నిర్వహించిన వివిధ అధ్యయన ఫలితాలను విశ్లేషించిన మీదట సంతృప్త కొవ్వులకు, రొమ్ము క్యాన్సర్కు మధ్య కచ్చితంగా సంబంధం ఉందనే విషయం రూఢీ అయిందని కెనడాలోని ఒన్హారియో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్కు చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. సంతృప్త కొవ్వులను ఎక్కువగా తీసుకుంటున్న మహిళలకు వాటిని తక్కువగా తీసుకుంటున్న వారితో పోలిస్తే రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20% ఎక్కువగా ఉంటోందని గుర్తించారు. దీంతోపాటుగా ఎక్కువగా మాంసాహారం తీసుకునే మహిళల్లో రొమ్ముక్యాన్సర్ ప్రమాదం 17% ఎక్కువగా ఉంటుందని కూడా నిర్ధారణ అయ్యింది.

Meat Goog Or Bad: మాంసాహారం తో గౌట్: మాంసాహారులకు గౌట్ వ్యాధి వచ్చే ప్రమాదమే ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. యూరిక్ ఆమ్లలవణాలు కీళ్లలో పేరుకుపోవటం వల్ల వచ్చే వ్యాధి గౌట్. దీని బారినపడితే కీళ్ళవాపులు, మంటలు వేధిస్తాయి. ఈ వ్యాధి రావటానికి ఆహారపు అలవాట్లు ఏమైనా కారణమవుతాయా అన్న దిశగా జరిగిన పరిశోధనల్లో ఈ మాంసాహార ప్రభావం గురించి వెల్లడైంది. ఈ వివరాలను ‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ ‘మెడిసిన్’ ప్రచురించింది. చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తులు గుండె జబ్బులు రాకుండా నిరోధించవచ్చని నిపుణులు చెబుతుంటారు. కానీ వీటివల్ల గౌట్ వచ్చే ప్రమాదం పెరుగుతోందని ఈ పరిశోధనలో వెల్లడైంది. వేరుశనగలు, పాలకూర వంటివాటివల్ల కూడా గౌట్ వస్తే రావచ్చని అనుమానిస్తున్నారు. వీటిని నిర్ధారించుకోవటానికి మరింత విస్తృతంగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. మాంసం తక్కువ తినే వారితో పోలిస్తే ఎక్కువగా తినే వారిలో గౌట్ వచ్చే అవకాశాలు 40, 50% ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

ప్రెషర్ కుక్కింగ్ బెటర్ : మనం కొనే మాంసం వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులతో కలుషితమయ్యే అవకాశం ఉంది. అందువల్ల మామూలుగా కన్నా ప్రెషర్ కుక్కర్ ద్వారా ఉడికిస్తే లోపల ఉన్న క్రిములు నశిస్తాయి. కాని ఏదైనా వ్యాధికి గురైన జంతువు మాంసం అయితే మాత్రం ప్రెషర్ కుకింగ్ వల్ల కూడా అంతగా లాభం ఉండదు. కాబట్టి స్వచ్ఛమైన మాంసాన్ని ఖరీదు చేయడంలో జాగ్రత్తగా ఉండాలి. జంతువుల చర్మంలో కొవ్వులు అధిక మొత్తంలో నిల్వ ఉంటాయి. కాబట్టి మాంసాన్ని ఖరీదు చేసేటప్పుడు చర్మం తీసేసినవి మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా కీమా రూపంలో ఉన్నదాన్ని కొనకూడద- ఎందుకంటే మాంసాన్ని కీమాగా తయారుచేసేటప్పుడు దాని చర్మాన్ని అలాగే ఉంచుతారు.

Which Milk Is Good For Health:శ్రేష్టమైన పాలు మాత్రమే ఉపయోగకారి

పాలు సంపూర్ణ ఆహారమని ఎంతోకాలం నుంచి మనం వింటూనే వున్నాం. ఆరోగ్యాని పెంపొందించడానికి పాలు కూడా దోహదపడుతుంది. అయితే, కాలానుగుణమైన మార్పులవల్ల పాలను సరైన అవగాహనతోనే తాగడం మంచిదనిపిస్తోంది.”పాలు శ్రేష్టమైన ప్రొటీన్లకు పెట్టింది పేరు. మిల్క్ ప్రొటీన్లలో కేసిన్ ముఖ్యమైనది. కొంచెం తక్కువ మోతాదులో ఆల్బుమిన్, గ్లోబులిన్ కూడా వుంటాయి. పాలలో కాలియం, ఫాస్ఫరస్ సమృద్ధంగా లభ్యమవుతాయి. లాక్టోజ్ (పాలు చక్కెర), సులభంగా జీర్ణముద్య కొవ్వులు తగినంతగా వుంటాయి. ఇనుము మాత్రం స్వల్పంగానే వుంటుంది. కాని చాలా బాగా వొంటబడుతుంది. వుండనిదల్లా ఒక్క విటమిన్ ఇ మాత్రమే. రిబోఫ్లావిన్, విటమిన్ ఎ కు కొదవలేదు.

Which Milk Is Good For Health అన్ని అత్యావశ్యకమైన పోషక పదార్ధాలుగల పాలు పసిపాపలకు మాత్రమే కాదు, ఎదిగే పిల్లలకు, గర్భస్థ స్త్రీకి, బాలింతరాలికి కూడా అత్యంతావశ్యకమనే విషయం విస్మరించరాదు. పాలు తాగితే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ రెండింటికీ ఏమిటి సంబంధం అంటారా? ఉంది. శరీరంలో డి-విటమిన్ శాతం తగ్గిపోతే క్యాన్సర్, డయాబెటిస్, హైపర్టెన్షన్, ఆస్టియో పోరోసిస్… వంటి వ్యాధులు రావడానికి మార్గం సులభమవుతుందట. ముఖ్యంగా ఊపిరితిత్తుల పనితీరులో డి-విటమిన్ కీలకపాత్ర పోషిస్తుందని తేలింది. ఇందుకోసం యునైటెడ్ స్టేట్స్ నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే బృందం సుమారు 14 వేల మందిని అధ్యయనం చేసింది. అందులో రక్తంలో డి-విటమిన్ తక్కువగా ఉన్నవారిలో ఊపిరితిత్తుల్లో లోపం ఉన్నట్లు తెలిసింది. అదేవిధంగా పొగరాయుళ్లలో కూడా డి-విటమిన్ శాతం తక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఈ దృష్ట్యా ఈ రెండింటికీ సంబంధం ఉందని తేలింది. కాబట్టి పాలు లేదా సప్లిమెంట్ల ద్వారా ఆ లోపాన్ని పూరించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

ఏనంతమందికి పాలూ, పాల పదార్ధాలూ సరిపడవు. వీటిని తీసుకున్నప్పుడల్లా గ్యాస్ తయారవుతుంది. పాలను పచనం చెందించడానికి తోడ్పడే ల్యాక్టోజ్ అనే ఎంజైమ్ లోపించడమే దీనికి కారణం. అలా అని పాలు పూర్తిగా మానేస్తే శరీరానికి కాల్షియం “మీకరణ కుంటుపడుతుంది. కాబట్టి పాలకు బదులు పెరుగును కాని, మజ్జిగను కాన్ని తీసుకోవాలి. పాలను తోడు పెట్టిన తరువాత పెరుగుగా మారేటప్పుడు దీనిలో వుండే బ్యాక్టీరియా అక్టోజ్ అనే ఎంజైన్ను విడుదల చేస్తాయి. అంటే, పాలను జీర్ణం చేయడానికి శద్ధపరమైన రసాయనికచర్య బయట వాతావరణయి. అంటే, పాలను జీర్ణం చేయ వాలు కాకపోవడమనే సమస్య ఉత్పన్నం కాదు.

ఎముకలు లెక్కలేనన్ని కారిఆధ్యయనాలు వెల్లడించాయి. కాల్సియంను పొందేందుకు మనకు అందుబాటులో ఉన్న . ఆరోగ్యా పెరుగుదల సక్రమంగా ఉండటం లేదని మొదటిసారిగా ఒక అధ్యయనంలో గుర్తించారు. తనరుల్లో పాలు అత్యుత్తమమైనవి. పాలు తాగటానికి నిరాకరించే పిల్లల్లో ులో ఉన్న న్యూజిలాండ్లో ఓటాగో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. దాని ప్రకారం నిత్యం పాలు తాగే పిల్లలతో పోలిస్తే పాలు తాగని పిల్లల్లో ఎముకలు గట్టిగా, సన్నవిగా, పెళుసుగా ఉంటున్నాయి. పాలు తాగని పిల్లల్లో ఎముకల సాంద్రత 7% తక్కువగా ఉంటోంది. పాలు సరిపడని పిల్లల్లో ఎముకల పెరుగుదల తక్కువగా ఉంటోందని గతంలో అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. కానీ పాలు ఇష్టపడక, ఉద్దేశపూర్వకంగా వాటికి దూరంగా ఉంటున్న పిల్లల్లో ఎముకల ఎదుగుదలతీరు ఎలా ఉంటుందనేది ఈ అధ్యయనంలోనే మొదటిసారిగా పరిశీలించారు.

కాని ప్రోస్సెస్ చేయని పచ్చి పాలలో సహజంగానే బాక్టీరియా ఉంటుంది. విడిగా పోసే పాలల్లో కొన్ని సూక్ష్మజీవుండా మరగపెట్టినా నాశనం కావు ఇలాంటి పాలను తీసుకోవడం ద్వారా క్షయ, హెపటైటిస్- అతిసార వ్యాధులను వ్యాపింపచేసే బాక్టీరియా ఉండవచ్చును. రంగు, రుచి, వాసనలలో తేడాతోపాటు, నిర్ణీత సమయం దాటినా విరగకపోవడం వంటి కృత్రిమ (సింథటిక్స్) పాలు నేడు మార్కెట్లో ఉంటున్నాయి. పాలల్లో వెన్న (ఫ్యాట్), పిండిపదార్ధాలు మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, సహజసిద్ధమైన నీరు ఉంటుంది. పాలలో ఫ్యాట్ కాని పదార్ధాలను ఎస్.ఎన్.ఎఫ్. విలువైన సహజసిద్ధమైన పోషకపదార్థాలకు తగ్గించి వాటికి బదులుగా వేరొక తక్కువ పదార్థాలను కలపడం ద్వారా కల్తీ అంకం మొదలవుతుంది.

వెన్నకు బదులుగా వెజిటబుల్ ఆయిల్, డాల్టా, పంది లేదా గేదె కొవ్వు కలుపుతున్నట్టు పరిశీలనలో తేలింది. ఘనపదార్ధాలను పెంచేందుకు పంచదార. చాక్పోడరు, యూరియా, డిటర్జెంట్ పౌడరు, ఉప్పు అంతారాలను కలుపుతుంటారు. పాల పరిమాణాన్ని పెంచేందుకు నీరు కలపడం అందరికీ తెల్సిందే. కల్తీపాలు తాగడు వల్ల ఆరోగ్యానికి హానితోపాటు, ఆర్థికనష్టాలకు కూడా గురి కావల్సివస్తోంది. అపరిశుభ్రమైన నీరు కలపడం, పాలు పితకడం, రవాణాలో శుభ్రత లోపించడం ద్వారా సూక్ష్మక్రిములు చేరి కలరా, టైఫాయిడ్, డయోరియా వంటి వ్యాధులు రావచ్చు. పాలల్లో కలిపే రసాయన పదార్థాల వల్ల ప్రేవుల, జీర్ణకోశంలో పుండ్లు, మూత్రపిండాల్లో రాళ్లు క్యాన్సర్, పలురకాల ఎలర్జీలు వచ్చే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో పరిశుభ్రమైన పాలను వినియోగించడం వల్ల అన్నివిధాల లాభం పొందవచ్చు.

అప్లోటాక్సిన్ బి1′ అనే విషపదార్థంతో కలుషితమైన ఆహారపదార్థాలను పాడిపశువులు ఇన్నప్పుడు, అవి పరోక్షంగా పాలను కలుషితం చేస్తాయి. పశువుల శరీరంలో ‘అన్నర్సులన బిI’ నుంచి ‘అప్లోటాక్సిన్ యం1’ ఉత్పత్తయి అది పాలను కలుషితం చేస్తుంది.అప్లోటాక్సిన్ బి1లో క్యాన్సర్ను కలుగచేసే గుణం ఉంది. అప్లోటాక్సిన్ యం1 కూడా కొంతవరకు క్యాన్సర్కు కారణమవుతుంది. అయితే బి1తో పోలిస్తే యం1 పది శాతం మాత్రమే శక్తివంతమైనది. కోడెక్స్- ప్రమాణాల ప్రకారం పాలలో అప్లోటాక్సిన్ యం1 పరిమాణం కిలోగ్రాము పాలలో 0.5 మైక్రోగ్రాము కంటే ఎక్కువ ఉండకూడదు. కాబట్టి ఈ విషపదార్ధం పాలలో కలుషితం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఆరోగ్యవంతమైన పాడిపశువు పొదుగులోని పాలగ్రంథుల నుండి స్రవించే తెల్లటి ద్రవమే పాలు (ఫిజియోలాజికల్ సెక్రిషన్), మన రాష్ట్ర విషయానికొస్తే ఆహారకల్తీ నిరోధక చట్టం (పిఎఫ్ఎ) ప్రకారం గేదెపాలలో 5.0 శాతం వెన్న, 9.0 శాతం ఎస్.ఎన్.ఫ్. ఆవుపాలలో 3.0 శాతం వెన్న 8.5 శాతం ఎస్ఎన్ఎఫ్గా ఉండాలి.

ఆవుపాలలో కంటే గేదెపాలలో పోషకపదార్ధాలు, కొవ్వు నిలువలు ఎక్కువ. గేదెపాలలో 8.6 శాతం కొవ్వు పదార్ధాలు ఉంటే, ఆవుపాలలో 3.9 శాతం మాత్రమే. అపుడే తీసిన పాలలో విటమిన్ బి6 వుంటుంది. సూర్యరశ్మి తగిలితే అది నశించిపోతుంది, విటమిన్ సి కూడా నశిస్తుంది. పాలనుండి తీసిన వెన్నలో విటమిన్ ఎ ఎక్కువగా వుంటుంది. కాల్షియం లోపం ఏర్పడకుండా ఉండాలంటే పాలు తప్పనిసరిగా తాగాలి. లేదంటే ఎముకలు పెళుసుగా మారడం, హైపర్టెన్షన్తో పాటు కోలన్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. పాలు మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పంటిపైను ఉండే ఎనామిల్ పొర దెబ్బతినకుండా కాపాడతాయి. రోజూ పాలు తాగితే, శరీరాని క్యాల్షియం సమృద్ధిగా అంది ఎముకలు సమర్థంగా ఉంటాయని అందరికీ తెలుసు అయితే ఇలా పాలు తాగటం వల్ల ఎముకలు బాగుండటమే కాదు… కొన్ని రకా క్యాన్సర్లు కూడా మన దరిజేరవని చెబుతున్నారు పరిశోధకులు!

Which Milk Is Good For Health:శ్రేష్టమైన పాలు మాత్రమే ఉపయోగకారి?పాలను తీసుకునే పద్ధతులు…

పలురకాల ఇన్ఫెక్షన్లను కలిగించే మైక్రో ఆర్గానిజమ్స్ పాలను ఆశ్రయిం వుంటాయి. కాబట్టి పాలను 72 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కాచాలి. అలా పాలు బాగా కాచటం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది. అప్పటికప్పుడు కాచిన పాలు తాగడం వల్ల కొన్ని రకాల వ్యాధులను నివారించవచ్చు.

Which Milk Is Good For Health మార్కెట్ లో లభించే పాలలో ఉన్న పోషకాలు ఇలా ఉంటాయి.

పాల రకం వెన్న ఎస్.ఎన్ఎ.ఎఫ్ వంద గ్రామ పాలలో శక్తి కాలరీలో
ఆవు పాలు 3.562.75
గెద పాలు 4.6
6.0
9.0
9.0
100
టోన్డ్ పాలు 3.08.5తెలియదు
స్టాండర్డ్ పాలు 4.58.5తెలియదు

2025 నాటికీ 87శాతం భారతీయులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం*

భారతీయ మార్కెట్లో అమ్ముతున్న పాలుదాదాపుగా కల్తీ పాలు అని తేలింది…భారతదేశం లో విక్రయించే పాలలో 68.7శాతం కల్తీ జరుగుతుంది వీటిని వాడటం వలన WHO 2025నాటికీ 87శాతం మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని చెప్పింది…ఈ కల్తీ పాలను నియంత్రించకపోతే భారతదేశం క్యాన్సర్ బారిన పడటం కాయంకేవలం సిటీ లలోనే కాదు ప్రతి పల్లెటూరు లలో ఈ కల్తీ పాల వ్యాపారం చేస్తు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

యూరియా, పెట్రోలియ్మ్ ప్రోడక్ట్ లతో తయారు చేస్తున్నారు అక్రమ సంపాదన ద్యేయం…..తనిఖీ చేసిన అధికారులకు కొంత సొమ్ము ముట్ట చెప్పడంతో అధికారులు మౌనం వహిస్తున్నారు….అధికారులె కాదు సామాన్యులు కూడా వీటిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది…అసలు ఎన్ని పాలిచ్చే గేదెలు. ఆవులు ఉన్నాయి ఎన్ని పాలు ఉత్పత్తి అవుతున్నాయి ఇన్ని పాలు ఎలా వస్తున్నాయి అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది…

Blood Improve Food: రక్తవృద్ధికి తగిన ఆహారం

పొట్లకాయ, గుమ్మడికాయ, పచ్చి అరటి, దొండ, వంకాయ, వెల్లుల్లి, దానిమ్మ, ఉసిరి, మజ్జిగ, ద్రాక్ష, ఖర్జూర, గోధుమలు, పెసలు, కందులు మొదలైనవి తినటం మంచిది. ఇవి రక్తవృద్ధికి ఉపయోగపడతాయి. రక్తం ఆక్సిజన్ గ్రహణసామర్ధ్యాన్ని పెంచే ఫుడ్స్ తీసుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. ఇవి మీ శక్తిని వేగంగా పెంచుతాయి. ఇందుకోసం టమాటా, క్యారట్, బీట్రూట్, వంటి కూరగాయల రసంలో నిమ్మరసం తగిన మోతాదులో కలుపుకొని తాగాలి. సువాసన కోసం కొత్తిమీర లేదా పుదీనా ఆకులను వేయవచ్చు. ఇది తాగడం వల్ల రక్తం శుద్ధి ఆక్సిజన్ తగినంత అందుబాటులో ఉండి రోజంతా ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటారు.

Blood Improve Food: రక్తవృద్ధికి తగిన ఆహారం

రక్తహీనత సమస్య మహిళ్లలో కాస్త ఎక్కువగానే కనిపిస్తుంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో వివిధ అవయవాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గి నీరసం, తల తిరుగుతున్నట్లు ఉండటం, బలహీనం, త్వరగా అలసిపోవటం వంటి సమస్యలు కనబడుతుంటాయి. ఈ రకం లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వీలైనంత త్వరగా డాక్టర్కు చూపించుకోవటం మంచిది. చాలాసార్లు మందుల అవసరం లేకుండా ఆహారపరమైన జాగ్రత్తలతోనే ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇనుము ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలు బాగా తీసుకోవాలి. మనం రోజూ తీసుకునే ఆహారంలో రాగులు, సజ్జల్లో ఇనుము ఎక్కువగా ఉంటుంది. రాగి జావ, సజ్జ రొట్టెలవంటివి బాగా తీసుకోవాలి.

పప్పు దినుసుల్లో – మొలకెత్తిన పెసలు, సెనగలు తీసుకోవాలి. దీనివల్ల ఇనుముతో పాటు విటమిన్-సి కూడా లభిస్తుంది. తర్వాత ఆకుకూరల్లోనూ, మాంసాహారంలోనూ ఇనుము ఎక్కువగా ఉంటుంది. మాంసాహారంలో కూడా కాలేయం, గుండె వంటి వాటిలో ఉండే ఇనుమును (హీమ్ ఐరన్) మన శరీరం తేలికగా గ్రహిస్తుంది. ఫలితంగా రక్తహీనత నుంచి త్వరగా బయటపడచ్చు. వారానికి కనీసం రెండుసార్లైనా మాంసాహారం, గుడ్డులోని పచ్చసొన తినాలి. శాకాహారులైతే వారానికి 5 రోజులూ ఆకుకూరలు తీసుకోవాలి. అదేవిధంగా ఇనుము కోసం కిస్మిస్, ఎండు ఖర్జూరం వంటి డ్రైఫ్రూట్స్ బాగా తీసుకోవాలి.

తాజా పండ్లలో సపోటా, సీతాఫలంవంటి వాటిలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. బెల్లంలో ఇనుము ఎక్కువగా ఉండటం వల్ల వంటకాల్లో చక్కెర బదులుగా బెల్లం వాడటాన్ని అలవాటు చేసుకోవాలి. బెల్లం, వేరుశెనగపప్పు కలిపి చేస్తే ‘చిక్కీల వంటివి రోజూ తినచ్చు. దంపుడు అటుకుల్లో కూడా ఇనుము ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇనుముతో పాటు మన ఆహారంలో మాంసకృత్తులు కూడా ఉంటే మంచిది. ఇందుకోసం పప్పు సమృద్ధిగా తినాలి. మనం తీసుకునే ఆహారపదార్థాలో విటమిన్-సి ఎంత ఎక్కువగా ఉంటే ఇనుము మన శరీరానికి పెద్ద అంత బాగా పడుతుంది. అందుకని తప్పనిసరిగా ప్రతిరోజూ ఏదైనా ఒక పుల్లని పండు తీసుకునే అలవాటు చేసుకోవటం మంచిది. రక్తహీనత మరీ తీవ్రంగా ఉంటే ముందు కొంతకాలం మందులు వాడుతూ, ఆహారపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కొన్నాళ్ల తర్వాత మందులు మానేసి పూర్తిగా ఆహారం మీదే ఆధారపడవచ్చు.

రక్తవృద్దికి 10 గ్రాముల తియ్యటి పెరుగులో 50 గ్రాముల పాతబెల్లం కలుపుకొని కొంతకాలం సేవించాలి. రోజూ ఆహారంలో పొన్నగంటి కూర తింటే మంచిది. రోజుకు రెండుసార్లు భృంగరాజు (గుంటగలగర) ఆకు పొడి ఒక స్పూను నీటిలో కలుపుకొని లాగాలి. వంటకు నువ్వులనూనె ఉపయోగించటం మంచిది. దైనందినఆహారంలో కలిగి, వెనగ వంటి రెండు బడ్డల్పు ఉండే ప్పులు ఎక్కువగా తీసుకోవాలి. రక్తం పట్ట తం సం, ఆహారంలో ఆవుపాలు, దబ్బపండు మంచిది. బెల్లం, కరక్కాయ రెండూ కలిపి, బాగా మారి తినాలి. అతిమధురం తేనెతో కలిపి నాకాలి. బెల్లం, నెయ్యి సగభాగాలలో కలిపి తీసుకోవటం మంచిది. బాగా పండిన మామిడిపండు మంచిది.

Which Oil Is Good For Health In Telugu

ఏ నూనెలో ఏముంది?నూనెలు ఆహారపదార్థాలను రుచికరంగా మార్చడమే కాదు, శరీరానికి అవసరమైన నూనెలులువలను కూడా అందిస్తాయి. వీటినుంచి 9 కిలో కేలరీల వరకు శక్తి లభిస్తుంది. పోషకవిలుఅత్యంతత్వరితంగా జీర్ణం కాకుండా కరిగే లక్షణంగల విటమిన్ ‘ఎ’, ‘బి’ కా ఆహారంలో కలిసిపోవడానికి ఇవి ఉపయోగపడతాయి.

Which Oil Is Good For Health

ప్రధానంగా నూనెల్ని ఆయా విత్తనాలు నుంచి తీస్తారు. వీటిలో శక్తి కేంద్రీకృతమై వుంటుందని చెప్పవచ్చు. ఒక టేబుల్ స్పూన్ నూనెలో 125 కెలోరీల శక్తి &త వుంటుంది. యుక్తవయసులో ఉన్న వ్యక్తికి 2400 కేలరీల శక్తి అవసరం. ఇందులో 15 శాతం కొవ్వు పదార్ధాలనుంచి అందుతుంది. ఇందులో సగం వరకు కంటికి కనిపించని కొవ్వు పదార్థాల నుంచే అందుతుంది. ఈ దృష్ట్యా, రోజుకు 20 గ్రాములకు మించకుండా నూనె తీసుకుంటే సరిపోతుంది. అంటే నాలుగు టీస్పూన్ల కంటికి కనిపించే కొవ్వు (నెయ్యి, డాల్టా) లేదా నూనె పదార్థాలు తీసుకోవాలి. ఆహారంలో ల30 శాతం దాటి, కెలొరీల కొవ్వుపదార్థాల రూపంలో అందడం ఆరోగ్యానికి హానికరం. అందువల్ల మనం వాడే కూరలలో రోజుకు 50 గ్రాములు లేదా 10 టీస్పూన్లకు మించకుండా నూనె వాడాలి.

వినోలిక్ యాసిడ్: వంటనూనెలలో ఉండే లినోలిక్ యాసిడ్ రక్తంలోని సీరమ్ కొలస్ట్రరాల్ట్రై గ్లిసరైడ్’ లను తగ్గిస్తుంది. అన్ని నూనెల కంటే రైస్ బ్రాన్ (తవుడు) నూనెలో ఈ గుణం ఎక్కువగా ఉంది. లినోలిక్ యాసిడ్ తగుమోతాదులో ఉన్న నూనెలే వాడాలి. వేరుశనగనూనె, బియ్యపు తవుడు (రైస్ బ్రాన్) నూనె, నువ్వుల నూనెలు వాడటం మంచిది. లినోలిక్ యాసిడ్ ఎక్కువ మోతాదులో వున్న నూనెలు కూడా వాడవచ్చుగాని, ఈ నూనెలతోపాటు లినోలిక్ తక్కువగా ఉన్న పామాయిల్ వంట నూనెలు కలిపి వాడాలి. అలాగే ఏ నూనెతోనైనా ఆవనూనె, సోయాగింజల నూనె కలిపి కూడా వాడవచ్చు. ఎప్పుడూ ఒకే రకం నూనె వాడటం కన్నా తరచూ నూనెలు మార్చడం కూడా ఆరోగ్యానికి మంచిది. అలాగే ఎంత తక్కువ నూనె వాడితే అంత మంచిది.

కొవ్వు నూనెలు : నూనెలన్నీ ఫ్యాటీ యాసిడ్ల సమ్మేళనం. కొన్ని వంటనూనెల్లో సాచ్చురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగాను, కొన్ని నూనెల్లో అన్సచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సాన్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి హానికరం. కొన్ని రకాల నూనెల్లో ఇవి ఎక్కువగా ఉండి రక్తనాళాల గోడలను మందం చేసి గుండెలో ఉన్న బహు సన్నని రక్తన్యావగా కూడా మూసుకుపోయేలా చేస్తాయి. అంచేత సాచ్యురేటెడ్ ఫ్యాటీయాసిడ్స్ ఉన్న నూనెలు వాడకూడదు. అవి వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, ఆలివ్ వంటివి, వెన్న, నెయ్యి మొదలైనవాటిలోనూ హాని కలిగించే కొవ్వు పదార్థాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా తీసుకోకూడదు. సన్ఫ్లవర్, పామోలిన్, బియ్యంపొట్టు నూనె, పత్తిగింజల నూనె, రిఫైన్ట్వి వాడితే మంచిది.

రోజుకు ఎంత నూనె వాడకం? : ఒక వ్యక్తి రోజుకి 20 గ్రాముల కన్నా ఎక్కువ ఆయిల్ తీసుకోకూడదు. అంటే, నాలుగు టీ స్పూన్లు చాలన్నమాట. * నెలకు ఒక వ్యక్తి 600 గ్రాములకు మించి నూనె వాడరాదు. ఐదుగురు వున్న ఇంట్లో నెలకు మూడు కిలోలకు మించి నూనె వాడరాదు. నెయ్యి పూర్తిగా మానేయాల్సిన పని లేదు. మూడున్నర స్పూన్ల నూనె, అరస్పూన్ నెయ్యి వాడితే చాలు. అంతకు మించి నెయ్యి వాడితే తంటాలే మరి.

నూనె వాడకంలో జాగ్రత్తలు : మరిగించిన నూనె చాలా ప్రమాదకరం. వాటికి దూరంగా వుండండి. ఎప్పుడూ ఒకే రకమైన నూనెలు కాకుండా మూడు నూనెల మిశ్రమాన్ని వాడడం మంచిది. ఆలివ్ నూనె చాలా ఉత్తమం. అది ఖర్చుతో కూడుకున్న పని, శుద్ధి చేసిన వేరుశనగనూనె బెస్ట్.

అవిసె నూనె : దీనిలోని ఒమేగా-3, 6 ఫ్యాటీ ఆమ్లాలు దేహానికి తొందరగా శక్తిని అందించటంలో సహాయపడతాయి. మన శరీరంలోని గుండెకండరాల శక్తిని పెంచడానికి, రోగనిరోధకశక్తి పెంచటానికి వీటిలోని ఫ్యాటీ ఆమ్లాలు సహాయపడతాయి. అవిసెగింజల నుంచి తీసిన ఈ నూనె ప్రకృతిలో చేప నూనె కంటే ఉత్తమమైనదిగా పరిశోధనలు బుతున్నాయి. చేప నూనెలో కొవ్వు శాతం అధికం. ఈ నూనెలో కొవ్వు శాతం చాలా తక్కువ.

ఆలివ్ ఆయిల్ : దీని వినియోగం వంటకాలలో ‘కూడా’ ఎక్కువే. వేపుడు/వేయించడానికి మినహా అన్నిరకాల వంటకాలలోనూ, సలాడ్స్ కి వాడతారు. ఆహారంగా ఉపయోగించే ఉంటాయి. మన శరీరానికి కావలసిన అనేక ఆమ్లాలకు మూలం ఈ ఆయిల్. ఇది నూనెల్లో ఆలివ్ ఆయిల్ సులభంగా జీర్ణమవుతుంది. దీనిలో విటమిన్ ‘ఎ’, ‘డి’, ‘కౌ’ ఇది ఒక్కటే నేరుగా తినగలిగే వృక్ష సంబంధమైన నూనె. హృదయసంబంధ వ్యాధులు, పెద్దపేగు క్యాన్సర్కు సంబంధించి ఇది చాలా మంచి ఔషధం. వంటకాలలోనే కాకుండా ఇతరముల అనేకంలో ఉపయోగించుతున్న విలువైన ఈ ఆయిల్ను ‘ద్రవ బంగారం అంటారు.

నువ్వుల నూనె : వైద్య రీత్యా నూనెలన్నింటిలో నువ్వుపప్పునుంచి తయారయ్యే నూనె మంచిది. ఇది శరీరానికి మంచిదైన హెచ్.డి.ఎల్. కొలెస్టరాల్ పెంచుతుంది. హానిచేసే ఎల్.డి.ఎల్.ను తగ్గిస్తుంది.

కుసుమ గింజల నూనె : దీనిలో 78 శాతం వరకు లినోలిక్ ఆమ్లం ఉండటం వల్ల కొలెస్ట్రాల్ను తగ్గించడంలో గుండె జబ్బులను నివారించడానికి తోడ్పడుతుంది. ఓలిక్, పామిటిక్, స్టీరిక్ ఆమ్లాలు కూడా ఈ నూనెలో ఉంటాయి. గింజల్లో నూనె 25-32 శాతం, మాంసకృత్తులు, పిండిపదార్థాలు ఒక్కొక్కటి 20 శాతం వరకు ఉంటాయి. తయారైననాటి నుంచి ఆరునెలలలోపు వాడాలి. కొబ్బరి నూనె /పామాయిల్ నూనెలో దాదాపు 25శాతం వరకు ఈ నూనెను కలిపి వాడితే పోషక విలువ (లినోలిక్ ఆమ్లశాతం) పెరుగుతుంది.

ఆవనూనె : ఈ నూనెను వాడితే గుండెకు బలం. ఇతర నూనెలు వాడటం కంటే ఈ నూనె వాడితే గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుందని వైద్యనిపుణులు పేర్కొన్నారు.

రైస్ బ్రాన్ ఆయిల్: దీనిలో ఏ ఆయిల్లో లేనట్టి కొన్ని ప్రత్యేక సూక్ష్మపోషకతత్వాలు ఉన్నాయి. కనుక, ఈ ఆయిల్ను శుద్ధి చేసే సమయంలో దానిలో అన్ని రకాల ప్రకృతిసిద్ధమైన సూక్ష్మపోషకాలు, ప్రతి ఆక్సీకరణి పూర్తిగా సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. రసాయనిక రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్లో ఆరోగ్యదాయక (హెచ్.డి.ఎల్) నాణ్యత 33.38+7.14 వుండగా భౌతిక రైస్ బ్రాన్ ఆయిల్లో 50.57+3.5 వుంది.

వేరుశనగ : మంచి వాసన, రుచి కలిగి వుంటుంది. మెట్ట ప్రాంతాలలో పండే వేరుశనగ నుంచి తీసిన నూనె మాత్రం హానికరమని వైద్యనిపుణులు చెబుతున్నారు. అనేకమంది ఈ రోజున నువ్వులనూనెను పూర్తిగా కూరలకు, ఊరగాయ పచ్చళ్ళకు మానివేసి, దీనినే వాడుతున్నారు. దీనిలో మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది.

సన్ఫ్లవర్ : పొద్దు తిరుగుడు గింజల నుంచి వెలికి తీసే నూనె. దీనిలో సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ స్థాయిలోనూ, పోలీ అన్ సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగానూ ఉంటుంది. బండ నార ప్రధానంగా సన్ఫ్లవర్, వేరుశనగ, కొబ్బరి, మస్టర్డ్, ఆలివ్, కార్డి, సోయా, రేబ్సీడ్, డాలలో కాకుం బ్లెండెడ్ మొదలైన నూనెలు విరివిగా మార్కెట్లో లభిస్తున్నాయి.

అన్ని నూనెల్లో కొవ్వు సమానమే! : వంటనూనెలన్నీ ఆరోగ్యపరంగా దాదాపు ఒక్కటేనని జాతీయ పోషకాహారసంస్థ శాస్త్రవేత్త డాక్టర్ రఘునాధరావు (హైదరాబాద్) 2007, అక్టోబర్లో ఒక సందర్భంగా తెలిపారు. విత్తనాలు, చెట్ల నుంచి వచ్చే అన్ని రకాల పునెల్లో ఒకే స్థాయిలో కొవ్వులు ఉంటాయని తెలిపారు. చెట్లు, విత్తనాల నుంచి తీసే నూనెల్లో కొలెస్ట్రాల్ అన్న పదానికి అర్ధమే లేదన్నారు. కేవలం జంతువుల నుంచి వచ్చే నూనెల్లోనే కొలెస్ట్రాల్ ఉంటుందని వివరించారు. రిఫైన్డ్, డబుల్ రిఫైన్డ్ అని చేసే ప్రకటనలు కేవలం వాటి శుభ్రతను సూచించడానికే మినహా, కొవ్వులస్థాయిని చెప్పడానికి కాదని అంటున్నారు.

ఏలా పండుకున్నామన్నదీ ముఖ్యమే! : మధుమేహబాధితులు సాధారణంగా తాము తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ద చూపుతూనే ఉంటారు. అయితే చాలమంది తాము ఏయే పదార్ధాలను తినాలి, ఏయే పదార్ధాలను తినకూడదనే దశలోనే ఆగిపోతారు. అది కాదు వాటిని వండే విధానంపైన కూడా దృష్టి పెట్టాలని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

పరిశోధకులు అంటున్నారు మధుమేహబాధితులు తాము తినే ఆహారపదార్థాల. ముఖ్యంగా నూనెలో వేయించే ‘ఫ్రై’ కూరల వల్ల మధుమేహరోగులకు కొత్త చిక్కులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. నీటిలోగానీ, ఆవిరిలోగానీ ఉడికించిన ఆహారాన్ని తీసుకోవటం ఉత్తమమని, అంతగా కావాలనుకుంటే బాణలిలో కొద్దిగా నీరు పోసి ఉడికించే పద్దతిని అనుసరించవచ్చని సూచిస్తున్నారు. ఆహారాన్ని ఇలా నీటిలో ఉడికించటం వల్ల దానిలో ‘అఙ్ఞాన్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ (ఎ.జి.ఇ.) ప్రభావం తగ్గుతుండురు) ఏజీఈలు-మధుమేహరోగుల్లో రక్తనాళాలను సంబంధించిన జబ్బులను పెంచుతాయని న్యూయార్క్ లోని మౌంట్ సినాని స్కూల్ ఆఫ్ మెడిసినన్ను చెందిన హెలెన్ అస్సారా తెలిపారు. “మనం తీసుకునే ఆహారంలో పౌష్టికత ఉందా? లేదా? అన్న దానిపైనే ఎక్కువగా దృష్టిపెడతాం. కానీ ఎలా వండుకుంటున్నామన్నది కూడా ముఖ్యమేనని గుర్తించాలి? అన్నారు.

గ్లూకోజ్, కొవ్వు, ప్రోటీన్ల మధ్య చర్య జరిగినప్పుడు వాటి నుంచి ఏజీఈలు పుట్టుకొస్తాయి. ఇవి విషతుల్యమైన పదార్ధాలు. ఇవి మన శరీరంలో సహజంగా కూడా ఉంటాయి. మధుమేహబాధితుల్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి. ఇవి శరీరంలోని కణాలను ప్రేరేపించి వాపును (ఇన్ఫ్లమేటరీ మార్కర్స్) కలిగించే పదార్ధాలను ఉత్పత్తి చేయిస్తాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతల వద్ద ఆహారం వండినప్పుడు కూడా పుడతాయి. ఆహారం ద్వారా ఇవి శరీరంలోకి చేరి, మధుమేహరోగుల్లో రక్తనాళాలలో వాపు, ఇన్ఫ్లమేషన్లను కలిగిస్తాయి. ఇది చివరికి గుండెజబ్బులకు దారితీస్తుంది. కాబట్టి ఆహారంలో ఏజీఈల ప్రభావం లేకుండా చేసుకోవటానికి ఆహారాన్ని నీటిలో ఉడికించటం మంచిది. నీరు ఉన్నందువల్ల ఏజీఈలు ఎక్కువగా ఉత్పత్తి కావు. తద్వారా రక్తనాళాల సమస్యలు తగ్గుతాయి. మధుమేహబాధితులు వేపుళ్లకు దూరంగా ఉంటూ, వంట పద్ధతులను మార్చుకోవటం అవసరమని లస్సారా బృందం నొక్కి చెబుతోంది.

నూనె వాడకం తగ్గించాలి! : ఆవిరి మీద ఉడికించడం అన్నిటికంటే మంచి పద్ధతి. కొద్దిగా వేగించడం, పెద్దమంట మీద రెండు నిమిషాలు చకాచకా తిప్పుతూ వేగించడం స్టిర్ (ప్రై) చేసినా మరీ అంత ఎక్కువ నష్టం జరగదు. అంతేకానీ ఎక్కువసేపు వేగించడం, ఉడికించడం చేయకూడదు. పెద్దమంట మీద ఎక్కువ సేపు అసలే వండకూడదు. బేకింగ్ కూడా మంచి పద్ధతేం కాదు. నూనె వాడకాన్ని వీలైనంత తగ్గించాలి. మూకుడులో నూనెలో దేవేసిన వాటికి బదులు పెనం మీద కొంచెం నూనె పోసి వేగించినవి నూనెవనుకుంటారు కొందరు. కాని నిజానికి నూనెలో దేవేటప్పుడు పై భాగం మాత్రమే మానెని పీల్చుకుంటుంది. పెనం మీద వేగించేటప్పుడు వీలైనంత తక్కువ నూనెతో.. ఆవిరి మీద మగ్గబెడుతూ వండడం మంచిది. అప్పుడే ఆహారంలోని పోషకాలు బయటికి పోకుండా ఉంటాయి. విషపదార్ధాలు లోపలికి చేరకుండా ఉంటాయి.

చిప్స్/స్నాక్స్ ప్రమాదకరం : మనం ఏడాదికి 5 లీటర్లపైనే నూనె తాగుతామని నిపుణులు తేల్చిచెబుతున్నారు. ఎలాగంటే రోజుకొక చిప్స్ ప్యాకెట్ తినేస్తే… అది ఏడాదికి 5 లీల నూనె తాగటంతో సమానమని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ నిపుణులు స్పష్టం చేశారు. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ప్యాకెట్లలో అమ్మే స్నాక్స్న రోజుకొక ప్యాకెట్ తినే అలవాటు చాలామంది పిల్లలకు ఉండటంతో తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన విషయమిది తినటానికి సిద్ధంగా ప్యాకెట్లలో అమ్మే ఆహార పదార్ధాల్లో నూనె ఒక్కటే కాదు, కనిపించీ కనిపించకుండా ఉప్పు, కొవ్వు, చక్కెర వంటి పదార్ధాలు కూడా మన ఒంట్లో చేరి ముప్పు కలిగిస్తున్నాయని అంటున్నారు.

నూనె స్ప్రే చేస్తే మంచిది! : ఈ మధ్య ఎవరి నోట విన్నా స్థూలకాయం, కొలెస్టరాల్, రక్తపోటు, గుండెజబ్బు… ఇవే మాటలు తరచూ వినిపిస్తున్నాయి. దీనికి డాక్టర్లంతా ముక్తకంఠంతో చెప్పే పరిష్కారమార్గం…. వంటల్లో నూనె మోతాదు తగ్గించమనే. కానీ మన భారతీయవంటకాల్లో చాలావరకు నూనె పాత్ర అధికం. తాలింపు పెట్టాలంటే అలవాటైన చేతికి తక్కువ నూనె వాడడం రాదు. మరేమిటి పరిష్కారం? సాధారణంగా నూనె ఎందులో భద్రపరుచుకుంటాం? చిన్ని క్యాన్లో పోసి అందులో గరిట వేసుకుంటాది. లేదంటే సీసాలో పోసి పెట్టుకుంటాం. వాటితోనైతే మనకు తెలియకుండానే చాలా నూనె వాడేస్తాం. అందుకే క్యాన్లు… సీసాలు కాకుండా స్ప్రే బాటిళ్లలో నూనె పోసి పెట్టుకోండి. స్ప్రే బాటిల్తో ఒకేసారి నూనె బాణలిలో పడదు. నిదానంగా పడుతుంది. కాబట్టి మనకెంత కావాలో అంతే వాడుకోవచ్చు. రెండు మూడు రకాల నూనెల వాడుతున్నట్లయితే రెండు మూడు రంగుల్లో స్ప్రే బాటిళ్లు సిద్ధం చేసుకోండి.

Which Oil Is Good For Health In Telugu : Good Health Tips For Daily Life:మంచి ఆరోగ్యానికి నిత్యం ఆచరించాల్సిన నియమాలు

Heart Disease: Cardio Vascular Diseases In Telugu

Heart Disease:Cardio Vascular Diseases In Telugu గుండె జబ్బులు – హృద్రోగములు

మానవుని శరీరములో అత్యంత ప్రాముఖ్యతను కలిగిన మరో అవయవము గుండె గుండె బలమైన కండరాలతో నిర్మితమై ఉంటుంది. కుడి ఎడమల ఊపిరితిత్తుల మధ్య ప్రధానంగా ఉండే ఈ గుండె దాదాపు ఆయావ్యక్తి యొక్క పిడికిలి సైజులో ఉంటుంది. ఛాతిలో చాల చక్కగా భద్రంగా ఉంటుంది గుండె.

బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో, సంపన్న దేశాల్లో Industrilised Societiesలో గుండె జబ్బుల వలన చాలమంది చనిపోవటము జరుగుతుంది. అలాగే ప్రతి 100 మందిలో ఒకరు Congenital deformities జన్మించిన తర్వాత, Severe abnormalities తో ప్రతి 500 వందల్లో ఒకరు బాధపడటము ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది

అయితే అత్యాధునికంగా వచ్చిన diagnostic fecilities మరియు Management skills గుండె జబ్బుల రోగులకు వరప్రసాదంగా మారి అనేక మందికి నూతన జీవితాన్ని ప్రసాదిస్తున్నాయనటములో సందేహము లేదు. చక్కని ఆహార నియమాలు, ప్రశాంత జీవనము గడపటము అనేవి చాల వరకు జబ్బుల్ని నిరోధిస్తాయి.

ఆయుర్వేదము నందు గుండెజబ్బులను 5 రకాలుగా వర్గీకరించారు. అవి వాతజ, పైత్తిక, కఫజ, సన్నిపాతజ మరియు క్రిమిజ హృద్రోగములు.

వాతజ హృద్రోగము :

ఛాతి మధ్యలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఆ నొప్పి కత్తితో కోసినట్లు, మెలివేసినట్లు తీవ్రంగా ఉంటుంది. హృదయస్పందన (Heartbeat)లో హెచ్చుతగ్గులుంటాయి. రోగికి కంగారు ఎక్కువగా ఉండి మూర్ఛపోవటము కూడ జరుగుతుంది.

పైత్తిక హృద్రోగము :

ఛాతీలో మంట, ఛాతీ బరువుగా ఉండటము, నీరసము, అధికంగా చెమటలు పట్టటము, నోరు ఎండిపోవుట, మొదలగునవి కలిగి అపస్మార స్థితికి చేరును.

కఫజ హృద్రోగము :

గుండెనొప్పి శరీరమంతా బరువు, దగ్గు, తెమడ పడటము రుచి మారటము మొ||

సన్నిపాతజ హృద్రోగము:

వాతపితకఫజ హృద్రోగ లక్షణములన్నియు ఇందులో కనిపిస్తాయి.

క్రిమిజ హృద్రోగము :

ఛాతినొప్పి, ఛాతి అతి బరువుగా ఉండటము, వాంతి వచ్చినట్లుండుట, ఆకలి లేకపోవటము, తలనొప్పి మరియు పాదాలు వాచి ఉండటము మొదలగునవి గమనించవచ్చు.

సాధారణ గుండె జబ్బు లక్షణములు:

గుండెనొప్పి లేక ఛాతి యందు నొప్పి, ఈ నొప్పి కేవలము ఛాతి ఎడమభాగము లోనే కాక, ఎడమ భుజానికి ఎడమ చేతికి కూడ ప్రాకుతుంది. కొన్నిసార్లు నొప్పి కడుపు భాగంలోనికి కూడ ప్రాకుతుంది.

ఆయాసము :

పడుకుని ఉండగా ఆయాసము వస్తుంది. గుండెజబ్బులో వచ్చే ఆయాసము మనిషిని పడుకోనివ్వదు. దీనినే orthopnoea అంటారు. గుండెనొప్పి ఆయాసము లతో పాటు విపరీతంగా చెమట వస్తుంది. గుండె కొట్టుకునే వేగము పెరుగుతుంది. మెట్లు / ఎత్తు ఎక్కడము కష్టమౌతుంది. అలాగే నడిచినపుడు పనిచేస్తున్నపుడు ఆయాసము వచ్చి పనిని నిలిపివేయవల్సి వస్తుంది. శరీరములో నీరు అధికమై వాపు కలుగుతుంది. ప్రత్యేకంగా ఈ వాపు పాఠాలపై స్పష్టంగా కనిపిస్తుంది పాదాలను వ్రేలితో నొక్కినపుడు గుంట పడుతుంది. అవి సాధారణ గుండె జబ్బు లక్షణములు.

గుండె జబ్బులో ఉపయుక్త ఔషధములు :

  • నాము (అజవాయిన్) 3 గ్రాములు ఉదయము – సాయంత్రము సేవించిన అధిక కొలెస్టరాల్ నందు ఉపయుక్తముగా ఉంటుంది.
  • వెల్లుల్లి (లచునా) : వెల్లుల్లి 3-6 గ్రాములు సేవించిన కొలెస్టరాల్ తగ్గుతుంది. ఇది Antarchalesherie మరియు libriolytic గుణాలు కూడ కల్గి ఉన్నట్లు పరిశోధనలో గమనించారు. గుండె జబ్బుల్లో లశునా చక్కని ఉపయుక్తమైన ఔషధము.
  • హరీతకే (కరక్కాయ) 3 – 6 గ్రాములు సేవించిన Serum lipid levels తగ్గినట్లు పరిశోధనలో గమనించారు.
  • పుష్కరమూలం (Inmuftracemosa) : పుష్కరమూలము మరియు గుగ్గులు (గుగ్గి లము) 3 గ్రాముల చొప్పున 3 పూటలు సేవించిన గుండెజబ్బుల్లో ఉపయుక్తంగా ఉంటుంది. ఇది Ischemic heart disease నందు ఉపయుక్తంగా ఉన్నట్లు పరిశోధనల్లో గమనించారు.
  • కోలపొన్న (శాలపర్టీ) : శాలపర్ణీ సమూలక్వాధము గుండె జబ్బులందు ఉప యుక్తంగా ఉంది. ఇది Bronchodilator (శ్వాసహర) హృదయోత్తజకము cardiacstimulant మరియు vasopresser గుణాలు కలిగి ఉన్నాయి. కోలపొన్న ఆల్కాహాలిక్ ఎక్స్ట్రా ట్రాక్ట్నకు Analgesic (వేధనాహర) మరియు Antipyretid (జ్వరహర) గుణాలు ఉన్నట్లు పరిశోధనల్లో గమనించారు.
  • గుగ్గులు (గుగ్గిలము) : గుగ్గులు యొక్క Oleo-resin యొక్క Petroleum – ether extract 5 diuretic () reductoin in Cholesteol (2) మరియు Anti-inflammatory (వ్రణ శోధహర) కర్మలు కల్గి ఉన్నట్లు పరిశోధనలో గమనించారు.
  • అర్జున (తెల్లమద్ది – (T. Arjuna) : త్వక్ (stembark) క్వాధము గుండె జబ్బులందు ఉపయుక్తంగా ఉండును. ఇది హృదయోత్తేజకం (Cardiac Stimulant) మరియు మూత్రలము (Diuretic) గుణాలు కల్గి ఉన్నట్లు పరిశోధనలో గమనించారు.
  • గన్నేరు (కరవీర) : గన్నేరు యొక్క కాండము (Stemhank) యొక్క ఆల్కాహాల్ కాట్రాక్ Heartfailure నందు ఉపయుక్తంగా ఉన్నట్లు పరిశోదనలో గమనించారు.
  • కంటకారీ (నేలవాకుడు) ఆల్మాహాల్ ఎక్స్ ట్రాక్ నకు హృద్య మరియు కఫ mcreased forced of contraction of the hypodynamic heart and seificant expectorant) కర్మలున్నట్లు పరిశోధనలో గమనించారు.
  • కటుక రోహిణి, మరియూ అతిమధురము (యష్టిమధు) చూర్ణాన్ని వేడినీటితో సేవిస్తే హృద్రోగము తగ్గుతుంది.
  • హృతశూల (గుండెనొప్పి) యందు శృంగిభస్మము, 250 మి.గ్రా. మహావాత విద్బాంసి నీరసము 250 మి.గ్రా, మకరధ్వజము 100 మి.గ్రా. తేనెతో కలిపి ప్రతి 4 గంటలకు ఒక్కసారి అర్జునారిష్ఠము 25 మి.లీ. మరియు జలము (నీరు) కలిపి ఇచ్చిన హృతశూల తగ్గును. లేదా త్రైలోక్యచింతామణిరసము 125 మి.గ్రా, ప్రవాకషిష్ఠి 250 మి.గ్రా, శృంగిభస్మము 250 మి.గ్రా తేనెతో కలిపి రోజుకు 3 సార్లు అర్జునారిష్ఠములో కలిపి ఇచ్చిన ఉపయుక్తంగా ఉండును.

గుండెజబ్బుల నిరోధానికి :

  • మద్యపానము మానివేయాలి.
  • పాగత్రాగటము మానివేయాలి.
  • పాన్ పరాగ్లు, గుట్కాలు మానివేయాలి.
  • అధిక కోపం, చింతా పనికిరాదు.
  • అధికంగా క్రొవ్వు వుండే ఆహార పదార్థములు మాని వేయాలి.
  • ప్రతిరోజు నడక, ధ్యానము మొదలగునవి ఆచరించాలి.

Heart Disease:Cardio Vascular Diseases In Telugu గుండె జబ్బులు – హృద్రోగములు ఈ ఆయుర్వేద మందులు వాడే ముందు డాక్టర్ సలహాలు తీసుకోని వాడుకోవలెను.

Good Health Tips For Daily Life:మంచి ఆరోగ్యానికి నిత్యం ఆచరించాల్సిన నియమాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Our Diet Is Our Destiny సంపూర్ణ ఆహారమే సర్వవ్యాధినివారణ

Our Diet Is Our Destiny సంపూర్ణ ఆహారమే సర్వవ్యాధినివారణ: (ఆహారము – పోషకవిలువలు, పథ్యాపథ్యములు)వేదాల్లో ఆహారము

ఆహారము: సృష్టిలోని ప్రాణమున్న ప్రతి ప్రాణికి ఆహారము కావాలి. ఆహారము మానవుడి పుట్టుకకు, శరీరములోని ప్రతి అవయవ నిర్మాణానికి, ఎదుగుదలకు కారణమైనది. చక్కని అవయవ నిర్మాణానికి, ఆరోగ్యానికి, అతి చక్కని ఆలోచనలకు మరియు దేశాభివృద్ధికి కారణమయ్యేది కూడ ఆహారమే. శ్రమను తట్టుకునే శక్తిని, కష్టించి పనిచేసే సామర్ధ్యాన్ని, రోగనిరోధకశక్తిని పెంపొందించేది ఆహారమే. మనము సేవించే ఆహారమే మన భాగ్యవిధాత అనటములో అతిశయోక్తిలేదు.

మన పురాణాలలో, వేదాలలో, ఉపనిషత్తుల్లో మరియు హిందువులు అత్యంత భక్తితో పఠించే మన పురాణాలలో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో మరియు హిందువులు అత్యంత భక్తితో పఠించే మహాభారతములో కూడ ఆహారము యొక్క ప్రాధాన్యత గురించి వివరించబడినది. మన పూర్వజులు ఆహారాన్ని అపురూపమయినదిగా భావించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, ఆస్వాదించేవాళ్ళు మరియు సేవించి ఆనందించే వాళ్ళు.

శుక్లయజుర్వేదము నందు ఆహారము గురించి వివరిస్తూ ఆహారాన్ని ముందుగా దేవతలకు నైవేద్యంగా సమర్పించి “ఓ పూర్వజులారా! మేము సమర్పించు బలకరమైన పాలను (క్షీరము), ఘృతము (నెయ్యి)ను, ఖండ శర్కరను, అతిచక్కని సువాసనలు వెదజల్లు ఫలాల (పండ్ల)ను మరియు అతి పరిశుద్ధమైన జలము (నీరు)ను స్వీకరించండి. అని ప్రార్ధించి తదనంతరము స్వీకరించేవారు.

అధర్వణ వేదమునందు “ఓ దేవతలారా! మేము కల్సి భుజించునట్లు, కల్సి జీవించునట్లు, ఎలాంటి ద్వేషము, ఈర్ష్య, అసూయ భావములు లేకుండా అహంకారానికి లోను కాకుండ చక్కని సంతోషాన్ని ప్రశాంతతను కలిగించండి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పబడింది. తైత్తరీయ ఉపనిషత్తు యందు అన్నము పరబ్రహ్మమని జీవనానికి ఆధారభూతమైనదిగా పేర్కొనబడినది. చందోగ్యోపనిషత్తునందు ఆహారము, దానియొక్క ప్రాధాన్యతలు, అది శారీరక మానసిక స్థితులపై చూపించు ప్రభావాల గురించి వివరించబడినది. మనుస్మృతి యందు కూడ ఆహార ప్రాధాన్యత గురించి వివరించబడినది. ఆహారాన్ని అపురూపంగా భావించాలి. కీర్తించాలి. ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కించపరచకూడదు. భక్తితో స్వీకరిస్తే శరీరానికి బలాన్ని, శక్తిని కలిగిస్తుంది. దాన్ని నిందిస్తూ స్వీకరిస్తే బలహీనతను కలిగించి శక్తి హీనంగా నిస్సారతకు కారణమవుతుంది అని పేర్కొనబడింది.

కాశీరాజయిన వామకుడు పేర్కొన్నట్లు చక్కని ‘సమ్యక్ ఆహారము’ ప్రాణుల ఎదుగుదలకు తోడ్పడునని, అసంతులిత ఆహారము వ్యాధులు కలగటానికి కారణమౌతుందని పేర్కొనెను. భగవద్గీత యందు కూడ ఆహారమునకు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆహారము సాత్త్విక, రాజసిక, తామసికములుగా వర్గీకరించెను. మనము సేవించే ఆహారము వలననే ప్రకృతులు ఏర్పడునని భావము. అలాగే బైబిల్, ఖురాన్ గ్రంథములందు కూడా ఆహార ప్రాధాన్యతల గురించి వివరించబడినది. ఆధునిక వైద్యానికి మూల పురుషులు మరియు హిపోక్రటిస్ సైతము తన రోగులు ఏ రకమైన ఆహారాన్ని సేవించాలో వివరించినట్లు చారిత్రక సాక్ష్యాలు కలవు.

ఆహారము – ఆయుర్వేదము Our Diet Is Our Destiny సంపూర్ణ ఆహారమే సర్వవ్యాధినివారణ

ఆచార్య చరకుడు “ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యములను మూడు ఉపస్తంభము లందురని, చక్కని సమ్యక్ ఆహారము వలన బలము, వర్ణము, పుష్టి కలుగునని పేర్కొనెను (చ.సూ. 11.35) చక్కని అనుకూలమైన వర్ణము, గంధము, రసము, స్పర్శము కలిగినట్టియు, విధిప్రకారముగా ఉపయోగించునట్టి అన్నపానములు మనస్సును చక్కగా ఉంచును. శరీరాన్ని వృద్ధిపరచును. శరీరమునందలి ధాతు సమూహములకు బలము, వర్ణము కలిగించును. ఇంద్రియములకు నిర్మలత్వమును కలిగించును. ఆహారాన్ని శాస్త్రవిధిగా సేవించకున్న అహితము/ అనారోగ్యము (Dis- ease) ను కలిగించును. ఆచార్య సుశ్రుతుడు “ఆహారము వలననే శరీరము పుడుతుందని, బలమునకు, వర్ణమునకు మరియు ఓజస్సునకు కారణమౌతుందని 3. (.. 46.3)

ఆచార్య చరకుడు ఆహార ప్రాధాన్యతను గురించి వివరిస్తూ:

“ఆహార సంభవం వస్తు: హితా హిత విశేషాచ్ఛ రోగశ్చాహార సంభవాః విశేషః సుఖదుఃఖయో” (చ.సూ) మానవశరీరము ఆహారము వలననే జనిస్తుంది. శరీరానికి వచ్చే రోగములు Diseases) అపథ్యకర ఆహారము సేవించుటవలననే కలుగుతాయి.

హితమైన భోజనము:

“విశిష్ట మిష్ట సంస్కారైః పధైరిఫై రసాధిఖః మనోజ్ఞం శుచి నా తుష్టం (ప్రత్యగ) మతనము హితమ్” (సు. సూ. 38) అనుకూలమైన విశిష్టమైన సంస్కారములతో కూడి ఉండునది, పధ్యములై ఇష్టమైన రుచులతో కూడి ఉండునది మనోహరంగా ఉండి శుచి శుభ్రత కలిగి ఎక్కువ వేడిగా ఉండునదియు, ఎప్పటికప్పుడు తాజాగా ఉండునదిగా ఉండు ఆహార పదార్ధములు హితంగా ఉంటాయి. ఇక భోజనము చేయునపుడు మధ్య మధ్యలో నీటిని త్రాగాలి. దీనివలన నాటుక శుద్ధమగును, తిరిగి భుజించు ఆహారము క్రొత్తదానివలే ఎక్కువగా రుచిగా ఉండును. (సు.సూ)

స్వాధుభోజన ప్రయోజనము :

నోటికి రుచించు భోజనము చేసినపుడు మనస్సునకు తృప్తి, శరీరబలము, శరీరపుష్టి, ఉత్సాహము, హర్షము, సుఖము అను వానిని కలిగించును. స్వాధువుకాని భోజనము విపరీత గుణములను కలిగించును.

సేవించకూడని ఆహారము:

అశుచిగా ఉండునది, వెంట్రుకలు, పురుగులతో కూడినట్టిది, ఇతరులు తిని వదిలివేసినది, రాళ్ళు, మట్టిపెళ్ళలు, గడ్డిపరకలు కలిగినట్టియు, రంగు, రుచి మారినది, చెడు వాసన వేయు ఆహారము, కుళ్ళి, పాచిపోయిన ఆహారము తినకూడదు. అలాగే బాగా మాడిపోయినది, గడ్డకట్టినది, చల్లారిపోయిన ఆహారాన్ని కూడ సేవించరాదు.

భోజన పరిమాణము:

పొట్టలో సగభాగము అన్నముతో, 1/4 భాగము నీటితో నింపి, మిగిలిన 1/4 భాగము వాతాదులు సంచరించడానికి ఖాళీగా వదిలివేయాలి. అంతేకాని పీకలదాకా భుజించటము ఎప్పుడూ మంచిదికాదు.

ఆహారమాత్ర:

ఆహారమును ప్రమాణమును అనుసరించి సేవించాలి. ప్రమాణము (Quantity of food) గా సేవించే ఆహారము జఠరాగ్ని (Digestive fire)ని బలంగా ఉంచుతుంది. గురుగుణము (Heavy food)కల పదార్థములను సగము పొట్టనిండువరకు, లఘుగుణము (Light foods) తేలికగా జీర్ణమగు ఆహారము) సామాన్యంగా తృప్తికలిగేవరకు భుజించాలి. శరీర బలానికి మూలమైనది జఠరాగ్ని (Digestive fire). జీవితమునకు బలము మూలము. బలానికి ఆహారము మూలం. కావున భుజించిన ఆహారము మరుసటి (Next diet) అన్నకాలమునకు చక్కగా జీర్ణమయి. తిరిగి ఆకలివేయునో అదియే ఆహారమాత్ర లేదా ఆహార ప్రమాణము.

ఆహారాన్ని అధికంగా భుజిస్తే :

ఆహారాన్ని ఎక్కువగా భుజించిన సమస్త దోషములను పుట్టించును. దీని వలన శరీరము బరువుగా, ఆయాసంగా అనాసక్తిగా ఉండును. ఇంతేకాక అలసకము, విశూచి అనే వ్యాధులు కలుగుతాయి.

అతి తక్కువగా భుజిస్తే:

అతి తక్కువగా భుజించిన తృప్తి కలుగదు. బలము, శక్తి, పుష్టి మరియు ఓజోవృద్ధి కలుగదు. పైపెచ్చు సమస్త వాత రోగములకు కారణమౌతుంది.

భోజన కాలము :

మలమూత్రములు విసర్జించబడి హృదయం తేలికగా ఉండి దోషములు తమ తమ మార్గములలో సంచరించుచూ త్రేన్పులు శుద్ధముగా ఉండి ఆకలి వేయుచూ శరీరము తేలికగా ఉండి ఇంద్రియములు చక్కగా పనిచేయుచున్న స్థితినే భోజనమునకు తగిన కాలముగా గమనించాలి. ఇది సుమారు 11 గంటలు (లేదా 12 గంటలు) భోజనమునకు తగిన కాలముగా గమనించాలి. రాత్రి 9 గంటల సమయములోను సంభవిస్తుంది. సకాలములో ఆకలి వేయకపోవటము లేదా ముందుగానే ఆకలి కావటము కూడ ఆరోగ్యలక్షణములు కావు.

భోజన నియమమందలి ప్రయోజనము :

భోజనమును సరి యైన సమయానికి సేవించాలి. సరియైన సమయమున సేవించిన ఆహారము ప్రీతిని (ఇష్టాన్ని) కలిగిస్తుంది. మనకు సాత్మించినది భుజించిన యెడల ఇబ్బంది పెట్టదు. తేలికగా ఉన్నయెడల తొందరగా జీర్ణమౌతుంది స్నిగ్ధంగా వేడిగా ఉన్న భోజనము తిన్న యెడల బలమును వహ్ని బలమును కలిగించును.భుజించిన ఆహారము సమంగా పాకము నొందును. ద్రవపధికంగా ఉన్న ఆహారమును భుజించిన సుఖముగా జీర్ణమగును, తగిన ప్రమాణములో భుజించిన ధాతుసామ్య మును కలిగించును. (సుశ్రుత. సూత్ర)

భోజనమునకు నియమిత కాలము లేకుండ భుజించిన శరీరము తేలికగా ఉండకపోవటము అనేక రకమైన ఇబ్బందులు రావటము జరుగుతుంది. కడుపులో మంట, పుల్లటి త్రేన్పులు (ఎసిడిటి అధికము) కావటము మనకు తెల్సిందే. భోజనం లేటుగా చేస్తే కడుపు అసౌకర్యంగా ఉండటము, ఆహారం సరిగా జీర్ణము కాకపోవ టము, మంట, గొంతుమంట, ఛాతిమంట, ఆహారమునందు అయిష్టత మొదలగునవి కలుగుతాయి.

ఆహార ప్రతిబంధకాలు

ఇతరులకు కీడు తలపెట్టాలి అనే ఆలోచన. ఓర్వలేనితనం, భయం, కోపము, లోభ గుణాలు, రోగము, ద్వేషబుద్ధి కలవారికి సకాలములో భుజించిన ఆహారము కూడ జీర్ణము కాదు.

అజీర్ణమునకు కారణములు

అవసరమైన దానికంటే ఎక్కువ నీటిని త్రాగిన అకాలము నందు భుజించిన ఎక్కువ ఆకలి అయినప్పుడు భుజించకపోయిన విరుద్ధాహారములను భుజించిన వాతము మలమూత్ర వేగములను అడ్డగించిన సకాలములో నిద్రించకపోయిన కూడా ఆహారం జీర్ణంకాదు, ఇవన్నియు అజీర్ణమునకు కారణములు.

ఆమా జీర్ణ లక్షణములు

భుజించిన ఆహారము తీపి రుచి కలిగి ఆమాశయము (Stomach) లోనే నిలిచి పోయిన అది ఆమా జీర్ణము. పుల్లటి రుచి కలిగి పిత్తకోశసమీపమున నిలిచి ఉండునది. విదగ్ధా జీర్ణము. కొంత పాకమునొంది చిన్న ప్రేగులలోనికి పోయి అచ్చట వాత ప్రకోపం నొంది ఎక్కువ పోటు కడుపునొప్పితో కూడినది విశబ్దా జీర్ణము చక్కగా త్రేన్పులు వచ్చుచున్నను అన్నము నందు ఇష్టము లేక గుండె బరువుగా ఉండి నోట నీరూరుచుండిన అది రసశేషాజీర్ణము అనబడును.

అజీర్ణ ఉపద్రవములు

ఆహారమును పరిమాణంగా ఆహారవిధి ననుసరించి భుజించాలి. ఆహారాన్ని స్వేచ్ఛగా పద్ధతి లేకుండా భుజించిన నాలుగు రకాల అజీర్ణములు కలుగుతాయని తెల్చుకున్నాం కదా! అజీర్ణమునకు సకాలములో ప్రతిక్రియ చేయకపోయిన ఉపేక్షించిన వాంతి, నోట నీరూరుట, శరీరము అదరుట, తల తిరుగుట అసంబద్ధంగా మాట్లాడుట, మూర్ఛ అను లక్షణములు కలుగుతాయి.

ప్రతిదినము సేవించతగిన ఆహార పదార్ధములు

షష్ఠిధాన్యము, శాలిధాన్యము పెసలు, సైంధవ లవణము, ఉసిరికాయలు, బార్లీ అకాశోదకము (వర్షపు నీరు) పాలు, నెయ్యి, జాంగల మాంసము తేనె ఇవి అభ్యసించవలసిన పదార్థములు.

ప్రతిదినము సేవించ తగని ఆహార పదార్థములు

ఎండిన మాంసము, ఎండింపబడిన కూరలు, తామర దుంపలు, తామరతూండ్లు ఇవి గురు గుణము కలవగుట వలన ప్రతిదినము అభ్యసింపకూడదు. కృశించి బక్కచిక్కిన జంతువుల యొక్క మాంసము కూర్చికము కిలాటము.పందిమాంసము, గేదె మాంసము, చేపలు, మినుములు, పెరుగు, యవక అనేధాన్యము మొ||నవి నిత్యము అభ్యసించ కూడదు.

భోజనం చేసిన వెంటనే తినకూడననివి

భుజించిన వెంటనే గురుగుణము (Heavy food substances) గల పదార్థములు,గోధుమ పిండితో, బియ్యపు పిండితో చేయబడిన పదార్థములు, అటుకులు మొదలగువానిని ఎప్పుడూ భుజించకూడదు. ఒకవేళ ఆకలివేస్తే మాత్రమే కొద్దిగా పరిమితిగా తినవచ్చు.

నోటియందు ఉంచుకోదగిన సుగంధ ద్రవ్యములు

నోటియందు నిర్మలత్వమును రుచిని సుగంధమును కోరు మానవులు జాజి కాయలు, లతాకస్తూరికాయలు, పోకవక్కలు, లవంగములు, కంకోలములు, తమల పాకులు, పచ్చకర్పూరము, సన్నయేలకులు మొదలగు వానిని నోటి యందు ఉంచుకో వలయును.(చరక. సూత్ర – 5 అధ్యాయము)

Our Diet Is Our Destiny సంపూర్ణ ఆహారమే సర్వవ్యాధినివారణ

Emesis వమనము(వాంతి చేయించటం)In Panchakarma పార్ట్ 2

శోధన చికిత్సలో విశిష్ట స్థానము ఇవ్వబడిన చికిత్స ప్రక్రియ Emesis వమనము(వాంతి చేయించటం). శరీరంలో రోగ కారక పదార్ధాలను బయటికు వెడలించు ప్రయత్నంనకు. శోధన చికిత్స అని పేరు. ఆయుర్వేద మూల సిద్ధాంతాలయిన త్రిదోషములలో కఫదోష సంబంధాలైన వ్యాధులకు చికిత్సగా వమనకర్మ నిర్దేశింపబడినది. అనగా కేవలము కఫదోషము మాత్రమే కాక కఫము అనుబంధంగా ఉన్న పిత్త, వాత మొదలగు సందర్భములలో కూడ వమన చికిత్స సూచించబడినది. అంతే కాక కొన్ని ప్రత్యేక సందర్భాలలో కూడ కఫ సంబంధము లేకున్నను వమనం చేయమని సూచింపబడటం గమనార్హము.

Emesis వమనము:

కలుషిత ఆహారం తీసుకున్నపుడు, విషప్రయోగము జరిగినపుడు పాము, తేలు, మదలగు ఇతర విష కీటకములు, అంతువుల దాడికి గురిఅయినపుడు, విషపూరితములైన శస్త్రాదులచే అభిమాతములు కల్గినపుడు తిన్న ఆహారము జీర్ణము ‘కాక లోపటి ఉన్నపుడు ఫిట్స్, కొన్ని జ్వరాలు, మానసిక వ్యాధులు, క్షయన్నాని. గుదమార్గం ద్వారా జననేంద్రియముల ద్వారా రక్త స్రావము కల్గినపుడు, స్థూలురకు, ఉబ్బసము, దగ్గు, ఉద క్షతము, విసర్పము, కుష్ఠము, చర్మవ్యాదులు, చెవి, ముక్కు గొంతువ్యాధులు, ఎలర్జీ సంబంధ వ్యాధులందు ఈ ప్రక్రియ ప్రయోజనకరంగా చెప్పబడినది.

Emesis వమనానికి అనర్హులు: గర్భిణీ స్త్రీలు, బాబురు, వృద్ధులు, ఎపుడు దుఃఖించు

స్వభావము కలవారు, కృశించినవారు, హృద్రోగము, ఇతర హృదయ సంబంధ వ్యాధులు కలవారు, కడుపులో నులిపురుగులు లాంటివి కలవారు, ప్లీహ సంబంధ వ్యాధులు కల్గినవారు, ప్రక్కన నొప్పి, అర్షమొలలు కలిగిన వారికి వమన కర్మ చేయకూడదు.

వమనకర్మ విధానము: Emesis (వమనం) చేయించటానికి ముందు పూర్వకర్మలయిన స్నేహ. స్వేదములు చేయించాలి. ముందు రోజు రాత్రి రోగికి మినుములు, నువ్వులు, చేపలతో కూడిన ఆహారం ఇస్తారు. దీని వలన శరీరంలో కఫం బాగ వృద్ధి పొందుతుంది.. రోగికి మనకర్మ చేయించడానికి 12 గంటల ముందు రోగానుసారము పాలు, చెరుకురసం మొదలగునవవి కడుపునిండా త్రాగిస్తారు. తర్వాత రోగిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి రోగము యొక్క తీవ్రతను బట్టి యష్టిమధు తెనే సైంధవలవణము మదనఫలము పాలు మొదలగు వానిని కల్పి ఔషదాన్ని త్రాగించి వమనము చేయిస్తారు. తేనె+ సైంధవలవణం కలిపి ఔషధాన్ని త్రాగిస్తారు.

  1. వమనము: 2, రోగికి వమన చికిత్స ఇచ్చేటపుడు వైద్యుడు రోగి ప్రక్కనే ఉండి రోగి తలను, ప్రక్కలందు పట్టుకొని ఎక్కువ శ్రమ లేకుండ తేలికగా వమనం జరిగేలా దోహదపడాలి. కఫ దోషం ప్రధానంగా ఉన్న రోగాల్లో వేడిగా ఉండే ఔషధం ఇస్తారు. వమనము ద్వారా కఫం అంతా బయటికి పోయి, పైత్యరసం బయటకు వచ్చే వరకు చేయిస్తారు. తర్వాత రోగి ముఖంపై చన్నీళ్లు చిలకరించి సేదతీర్చి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించి, బియ్యం రవ్వ జావలాంటి తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇస్తారు.

ఈ వమనకర్మ వలన అతి నిద్ర, కునికిపాటు, దగ్గు, నోటి దుర్గంధము, నోరు జిగటగా ఉండడం. నోటి నుండి కఫం వెడలటం,గ్రహణి మొదలగు రోగములు తగ్గి ఆహార మందు ఇష్టం ఏర్పడి, రుచి మొదలగునవి కలుగుతాయి.

  1. విరేచనము: వమనము వలనే విరేచనము కూడా చాల ప్రశస్తమైన ప్రక్రియగా పంచకర్మలలో పేర్కొనబడినది. ఇది ప్రధానంగా పిత్తదోషసంబంధ వ్యాధుల్లో సూచించబడినది. గుల్మము, ఫైల్స్, (ఆర్షస్సు), మంగు, కామెర్లు, జ్వరము, ఉదరము, విషప్రయోగము, వాంతులగుట, ప్లీహవృద్ధి, విద్రది, పక్వాశయమున కలుగు బాధలు, యోని సంబంధ రోగాలు, శుక్ర సంబంధ దోషములు. క్రిమిరోగాలు, వ్రణములు, మలబద్ధకం, మూత్రసంబంధ దోషములు, వ్రణములు మూత్రసంబంధ రోగాలు, కొన్ని రకాలు చర్మవ్యాధుల్లో విరేచనకర్మ సూచించబడినది.

విరేచనానికి అనర్హులు: ఆకలి, జఠరాగ్ని మందగించినవారు, అతిసార వ్యాధితో బాధపడేవారు, సుకుమారులు, క్షయరోగములు కలవారు విరేచన కర్మకు పనికిరారు.

విరేచనకర్మ విధానము: ప్రత్యేకించి నిర్దేశించిన సందర్భంలో తప్ప సామాన్యముగా విరేచనమునకు ముందు రోగికి వమనం చేయించాలి. వమనము అయిన 15 రోజులకు తైలంతో అభ్యంగం చేసి స్వేదకర్మకావించి సూర్యోదయమైన నాలుగు గంటల తర్వాత రోగి బలము, రోగము యొక్క తీవ్రత గమనించి విరేచన ద్రవ్యాన్ని రోగికి తగమాత్రలో ఇస్తారు. విరేచనం అయిన పిదప సేదతీర్చి అతని జాఠరాగ్ని బలమును అనుసరించి జావ, గంజి మొదలగు తేలికగా జీర్ణమయ్యే ఆహారము ఇస్తూ 5వ రోజు నాటికి మామూలు ఆహారం ఇస్తారు.

ఈ విరేచనకర్మ వలన జఠరాగ్ని దీప్తి కల్గుతుంది. శరీరపటుత్వం, బుద్ధి సూక్ష్మత, కల్గుతుంది. ముసలితనం తొందరగా రాదు.

3.వస్తికర్మ:

panchakarma (పంచకర్మ) చికిత్సలో అత్యంత ప్రధానమైనది, అతి ముఖ్యమైనది వస్తికర్మ. ఇది ప్రధానంగా వాతదోషము కలవారికి ఉద్దేశించబడినది. ఇది సర్వరోగనివారిణి లాంటిది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారము వస్తికర్మ వలన తగ్గని వ్యాధి లేదంటే అతిశయోక్తి కాదేమో! ఈ చికిత్స శరీరంలో ఒక నూతనోత్తేజాన్ని ఉత్సాహాన్నికల్గచేస్తుంది. ఈ వస్తికర్మ 3 రకాలుగా చెప్పబడింది.

  1. నిరూహవస్తి: కషాయము, పాలు, మొదలగు వాని ద్వారా చేయునది.
  2. అనువాసనవస్తి: తైలములు, నెయ్యి మొదలగు వానితో చేయునది.
  3. ఉత్తరవస్తి: జననేంద్రియ మార్గముల ద్వారా చేయునది.

ఇవి కాక కాల, కర్మ, ప్రసన్న, శోదన, శమన, లేఖన, బృంహణ మొదలగు అనేక పేర్లతో వస్తి కర్మ వివరించబడినది. వస్తి కర్మ సంఖ్య, ఔషధమోతాడు, చేయు సమయము వ్యవధి అనుసరించి ఇన్ని పేర్లు ఉన్నప్పటికి ప్రధానంగా పైన తెలుపబడిన మూడు తరగతుల కోవలోకే వస్తాయి.

మూత్ర ద్వారము, మలద్వారము, యోనిద్వారము ద్వారా వివిధ ఔషధములను అను శరీరంలోనికి ప్రవేశపెట్టుటయే వస్తి కర్మ అంటారు.

  1. నిరూహవస్తి: దీనినే కషాయవస్తి లేదా ఆస్థాపన వస్తి అని కూడ అంటారు. ఇది కష్టసాధ్యమైన వాత వ్యాధుల్లో ప్రయోగిస్తారు. గుల్మవ్యాధి, కడుపుబ్బరము, ప్లీహవ్యాధి, అతిసారం, కడుపునొప్పి, చాలాకాలంగా ఉన్న జ్వరము, జలుబు, మలబద్దకము, శుక్రసంబంధ వ్యాధులు, బహిష్టు సరిగా వెడలకపోవటం, మూత్రనాళంలో రాళ్ళు మొదలగునవి ఉన్నపుడు ఈ నిరూహవస్తి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

అయితే బాగా కృశించిన వారికి, వమనము, ఎక్కిళ్ళు, ప్రమేహము, దగ్గు, ఆయాసము, మొలలు, కుష్ఠురోగం, మధుమేహం కలవారు, అపుడే భోజనం చేసినవవారికి గుదస్థానమున వాపు, కురుపులు కలవారు, గర్భిణీ స్త్రీలు, జలోధరము కలవారికి ఈ నిరూహవస్తి చేయకూడదు.

ఈ నిరూహవస్తిని ఉదయం 10-12 గంటల ప్రాంతంలో చేయాలి. రోగికి ముందుగా స్నేహ, స్వేదములు చేయించి, కొద్దిగా ఆకలితో ఉన్నప్పుడు ఔషధ ద్రవ్యాన్ని గోరువెచ్చగా చేసి ఇస్తారు. వస్తిరూపంలో ఇచ్చిన ఔషదం మొత్తము బయటికి వచ్చిన తర్వాత రోగికి గోరువెచ్చని నీటితో స్నానం చేయించి పాలు, మాంసరసంతో కూడిన ఆహారం ఇస్తారు.

2. స్నేహవస్తి: దీనికే అనువాసనవస్తి అని పేరు. ఇది కూడ నిరూహవస్తిలో సూచించిన ప్రకారమే చేస్తారు కాకుంటే దీనిలో కషాయంకు బదులు తైలము (నూనె)
మొదలగు స్నేహ ద్రవ్యాలను వాడుతారు. అయితే ఈ స్నేహవస్తిని రక్తహీనత, వచ్చకామెర్లు, క్షయ, ఆహారం లేక క్షీణించినవారు ప్లీహవృద్ది, మలబద్దత, కఫరోగం, జలుబు, కృశించిన వారికి, విపాహారం సేవించిన వారికి, శ్రీపదం(బోదకాలు) కలవారికి ఈ వస్తి ప్రక్రియ చేయకూడదు.

ఈ కర్మలో రోగికి తైలంతో అభ్యంగనం చేసి, వెచ్చని నీటితో స్నానం చేయింది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇప్పించి కొద్ది సేపు అటు ఇటూ పచార్లు చేయింది. కాలకృత్యములు తీర్చుకున్న రోగిని ఎడమవైపుకు పడుకోబెట్టి, కుడికాలు ముడుచుకునేలా చేసి మల ద్వారము ద్వారా ఔషదాన్ని లోపలికి ప్రయోగిస్తారు. తరువాత రోగిని వెల్లకిలా పరుండబెట్టం జరుగుతుంది.

  1. ఉత్తరవస్తి: ఇది సాధరణంగా మూత్రసంబంధ వ్యాధులందు ఆచరిస్తారు. అయితే గర్భాశయ వ్యాధుల్లో ఇది మిక్కిలి ఉపయోగకరంగా ఉంటుంది. మగ వారిని మోకాలి ఎత్తుపీటపై కూర్చుండబెట్టి మూత్రనాళం ద్వారా ఔషదాన్ని ప్రయోగిస్తారు. స్త్రీలను వెల్లకిలా పడుకోబెట్టి జననేంద్రియముల ద్వారా ఔషదాన్ని ప్రయోగిస్తారు.
  2. మాత్రవస్తి: ఇది కూడ పైన పేర్కొన్న వస్తి చికిత్సలాంటిదే. కాని దీనిలో ఔషధాన్ని చాల స్వల్ప మాత్రలో(25-100మి.లీ) ప్రయోగిస్తారు. ఇది అన్ని వయసుల వారు ఆచరించవచ్చు. దీనికి స్నేహ, స్వేదాలతో పనిలేదు. దీనివలన ఆకలి, ఉత్సాహము పెంపొందుతాయి.

4. నస్యకర్మ:

నాసామార్గం ద్వారా ఔషదాన్ని ప్రయోగించడాన్ని నస్యకర్మ అంటారు. ఈ ప్రక్రియ శిరస్సు, మెడ యందలి రోగములకు కారణములైన దోషతత్వాన్ని బయటికి వెడలించటానికి ఉద్దేశించబడినది. దీనినే శిరోవిరేచనం అని కూడ అంటారు. ఇది కూడ శిరస్సు, మెడ యందలి దోషములను శోధించుటకు ఉద్దేశించబడిన శోధన చికిత్సా ప్రక్రియ. ఈ నస్యకర్మలో ఉపయోగించిన ద్రవ్యము దాని ధ్యేయము, క్రియ. ద్రవ్య ఆధారము, ప్రయోగవిధానమును బట్టి అనేక రకాలుగా వర్గీకరించినప్పటికి చరకుడు చెప్పి 5 రకాల వర్గీకరణయే ప్రధానంగా ప్రస్తుత వైద్యనిపుణులు అనుసరిస్తున్నారు.

  1. నావనము: ఇది విభిన్నములైన చెవి, ముక్కు, గొంతు సంబంద వ్యాధులను చికిత్సించటంలో ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ వలన మెడకు, భుజములకు, ఉర ప్రాంతములకు బలం చేకూరి, దృష్టి మెరుగుపడుతుంది.
    2. అవపీదనము: దీనిలో అప్పటికప్పుడు ఔషధముల నుండి దంబితీసిన స్వరసం లేదా రసంను ఉపయోగిస్తారు. ఇది ముఖ్యంగా గొంతుకు సంబంధించిన వ్యాధుల్లో, మానసిక రోగంబందు ఉపయుక్తంగా ఉంటుంది.
  2. ప్రథమనము: ఈ పద్ధతిలో ఔషధంను చూర్ణరూపంలో ప్రయోగిస్తారు. ఇది ముఖ్యంగా మానసిక వికారములు, విషసంబంధ వ్యాధులలో అత్యంత ఉపయోగంగా ఉంటుంది.
  3. ధూమనస్యము: ఇది ముఖ్యంగా మెడ, శిరస్సుకు సంబంధించిన వ్యాధుల్లో ప్రయోగిస్తారు. దీనిని ధూమ (పొగ) రూపంలో ప్రయోగిస్తారు.

5.ప్రతిమర్మనస్యము:

ఔషధముగా స్నేహ ద్రవ్యములు ఉపయోగించిన అదిప్రతిమర్శనస్యం అనబడును. ప్రతి మర్మనస్యంలో ఔషధ మోతాదు ఎక్కువ మాత్రలో ఉంటుంది. ఈ పద్ధతి సర్వకాల సర్వావస్థలయందు అన్ని వయస్సుల వారికి ఉపయోగించతగినదిగా ప్రశస్తి పొందినది.

విధానము: నస్యకర్మను ఆచరించటానికి ముందు రోగి యొక్క బలాన్ని అనుసరించి స్నేహ, స్వేద, అభ్యంగాలను ఆచరించి రోగిని బల్లపై వెల్లకిలా పరుండబెట్టి తలను కాస్త వెనక్కు వంగేలా ఉంచుతారు. ఒక నాసారంధ్రమును మూసి, వేరొక రంద్రంలో ఔషధం పోసి రోగిని పీల్చమని చెప్పాలి. తర్వాత రోగిని ఔషధం బాగా పీల్చమని చెప్పి నోటిలోనికి వచ్చిన ఔషదాన్ని (మందును) ఉమ్మివేసిన తర్వాత రోగి నుదురు, చెవులు, మెడ, బుగ్గలు(చెంపలు) భుజములు, చేతులు పాదములను మృదువుగా మర్దిస్తారు. ఈ విధంగా చేస్తూ 100 లెక్క పెట్టేవరకు రోగిని పడుకోబెట్టి తర్వాత వేడి నీటితో నోరు పుక్కిలించి తర్వాత తేలికపాటి ఆహరం ఇస్తారు.

నన్యకర్మ ద్వారా ఔషధం శిరస్సునందలి మారుమూల ప్రదేశములు, సూక్ష్మస్రోతస్సులలో దాగి ఉన్న దోషములను బయటికి వెడలించి కళ్ళు, ముక్కు చెవులు గొంతు, మెడకు సంబంధించిన వ్యాధి కారములైన అంశములను శోధించి స్వస్థత చేకూరుస్తుంది.

రక్తమోక్షణము (Blood Letting): దీనిని రక్తదోషములందు ముఖ్యంగా బోధకాలు, చర్మవ్యాధులయిన కుష్ఠము, విసర్పము, సొరియాసిస్ లాంటి వ్యాధులందు ఆచరిస్తారు. ఇది 2 విధములు శస్త్ర ప్రయోగము – ప్రచ్చన (Incision) మరియు శిరోవేదనము (Venepunctures).

అనుశస్త్ర ప్రయోగము: ఉదా: జలూక ప్రయోగము Leach application- జలగలను వ్యాధిగ్రస్థ భాగమును పట్టించుట శృంగ Application of form for tapplication of Alahu for lupping): 1 ລ້ (cupping with Gatam) అలదూ

జలూక ప్రయోగము : each application, రక్తదోషములందు జలూకలను పట్టించి చికిత్స చేయుట అనాదిగా భారతదేశమున జరుగుతున్నదే. ఇది అత్యంత ఉపయుక్తంగా ఉన్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. మన దేశములోనే కాదు జపాన్, జర్మనీలాంటి దేశములందు కూడ వీటి ప్రయోగము కలదు. జలగలను పరిశుభ్రమైన/స్వచ్ఛమైన జలము ఉండే సరస్సులు మొదలగు వాని నుండి గ్రహిస్తారు. చికిత్స చేయవలసిన రోగి యొక్క శరీరభాగమున తేనె/నెయ్యి చుక్కలు వేసి చిన్నగా Incision ఇచ్చి జలగ (Leach)లను ఆ ప్రాంతమున ఉంచి Vitiated Blood ను పీల్చటానికి ఉపయోగిస్తారు. తదనంతరము దానిని తొలగించి జలగ పీల్చిన ప్రాంతమును చల్లని నీటితో చక్కగా శుభ్రపరచి ఆ ప్రాంతమునందు Cotton లేదా నెయ్యినందు ముంచిన Gauz గాని పెట్టి కట్టువేస్తారు. ఇది చక్కని సులభమైన ప్రక్రియ.

మొదటి పార్ట్ చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Good Health Tips For Daily Life:మంచి ఆరోగ్యానికి నిత్యం ఆచరించాల్సిన నియమాలు ఇక్కడ క్లిక్ చేయండి

Panchakarma Ayurvedic Treatment Telugu

ఈనాడు ప్రతిచోట పంచకర్మ పేరుతో మసాజ్ సెంటర్లు వెలిశాయి. కొన్ని చోట్ల అందమైన స్త్రీలతో శరీరము మొత్తాన్ని మసాజ్ చేయించి అదే పంచకర్మ అని ప్రచారము చేస్తున్నారు. అది తప్పు. మసాజ్ సెంటర్లు పంచకర్మ సెంటర్స్ కావు.

panchakarma ayurvedic treatment telugu: పంచకర్మ యొక్క గుణాలు(effect of panchakarma)

ఏవం విశుద్ధ కోవస్య కాయాగ్ని రబి వర్ధతే వ్యాధి యశ్చోపశ్యామ్మన్తి ప్రకృతిశ్చానువర్తతే॥ ఇంద్రియాని మనో బుద్ధి వర్ణశ్చాస్య ప్రసేదతి బలం పుష్టిరపత్యం వృషతా చాస్య జాయతే జరాం కృచ్చేణ లభతే చిరం జీవిత్యనామయః తస్మాత్సం శోధనం కాలే యుక్తి యుక్తం పిబేన్నరః

శోధనం వలన కోష్ఠం శుద్ధి నొందుతుంది. జాఠరాగ్ని వృద్ధినొందుతుంది.. వ్యాధులు శమిస్తాయి. శరీరం సమస్థితి(ప్రకృతి)ని పొందుతుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, శరీరకాంతి, వికాసం కల్గుతుంది. బలం, శరీరపుష్టి, వీర్యవృద్ధి కల్గుతాయి. ముసలితనము త్వరగా రాదు. వ్యాధులు లేకుండా చాలా కాలం ఆరోగ్యంగా జీవిస్తారు, కావున శోధనాన్ని సరియైన సమయంలో యుక్త యుక్తంగా సేవించాలి. అని చెప్పబడింది.

పంచకర్మ చికిత్సా విధానం

యుర్వేద శాస్త్రంలో అన్ని రోగాలకు ఆయా చికిత్సలు చెప్పబడినప్పటికి ప్రత్యేకంగా పంచకర్మలు అనే కొన్ని ప్రత్యేక చికిత్స ప్రక్రియలు చెప్పబడినవి. ఆయుర్వేద చికిత్స క్రమంలో వీటికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఔషధములతో సాధ్యంకాని అనేకమైన మొండి వ్యాధులు, కఠినమైన, జరిలమైన జబ్బులు కూడPanchakarma పద్ధతుల(Specialities in Ayurveds) ద్వారా నయం చేయవచ్చు. ఇవి ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడినప్పటికి వీటి ఆచరణ, అనుసరణ ఎక్కువగా కేరళ రాష్ట్రంలో విశేష ప్రాచుర్యంలో ఉన్నది. అందుకే ఇది కేరళ వైద్యవిధానంగా ఎక్కువ ప్రాశస్త్యాన్ని పొందింది.

ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలలో వీటికి ఆదరణ లభిస్తుంది.. పంచకర్మలు వమనం, విరేచనం, నిరూహవస్తి, అనువాసనవస్తి నస్యకర్తు వమనం అనగా వాంతి చేయించటం. ఇది కఫదోష ప్రధానంగా ఉండే వ్యాధుల్లో ఆచరింపబడుతుంది. ఇది భుజించిన ఆహారం జీర్ణమగు సమయమున చేయిస్తాడు. ఆ సమయమున కఫ దోషము మిక్కిలి ఎక్కువగా ఉంటుంది. కనుక వమనము చేయించినచో మిక్కిలి ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రనిర్దేశం విరేచనకర్మను పిత్తదోష ప్రాధాన్య వ్యాధుల్లో ఉపయోగిస్తారు. విరేచనం చేయించిన పిత్తదోషవికారం వలన కలిగిన దోషములన్ని తొలగి ఆరోగ్యం చేకూరుతుంది.

నిరూహ, అనువాసనవస్తులు రెండును శరీరంలోని వాత దోషశమనము కొరకు నిర్దేశించబడినవి. వస్తి ప్రక్రియలో ఉపయోగించు ఔషధం యొక్క భేదముచే రెండు విధాలుగా చెప్పబడినప్పటికి రెండునూ శరీరంలో వాత దోష సంబంధం వలన కలిగిన పక్షవాతము, నరములకు సంబంధించిన వ్యాధుల్లో మిక్కిలి ప్రశస్తంగా ఉంటుంది. ఆహారం పూర్తిగా జీర్ణమై తిరిగి ఆహారంపై కోరిక కలిగినపుడు వస్తిని ఇస్తారు.

నస్యకర్మ అను చికిత్స ప్రక్రియను శిరస్సు, మెడ యందలి రోగములకు కారణాలైన దోషతత్త్వాన్ని బయటికి వెడలించటానికి ఉద్దేశించబడినది. పంచకర్మ చికిత్సలే కాక స్నేహం. స్వేదం అను రెండు ప్రక్రియలు విశేషంగా చెప్పబడినవి. ఇవి Panchakarma చికిత్సలో భాగం కాకున్నను పంచకర్మలు ఆచరించటానికి ముందు తప్పక ఆచరించవలసిన ప్రక్రియలుగా చెప్పబడ్డాయి. అందుకే వీనిని పూర్వకర్మలు అని పిలుస్తారు. వమనం, విరేచనం మొదలగు వానిని ప్రధాన కర్మలని పిలుస్తారు. స్నేహ, స్వేదములు చేయకుండ పంచకర్మలు చేసినచో వ్యాధి ఉపశమనము బదులు క్రొత్త వైపరీత్యాలు కలుగుతాయి.

పూర్వకర్మల వలన శరీరంలోని వివిధ ప్రాంతము లందే కేంద్రీకృతమైయున్న వికృతి నొందిన వాత పిత్త కఫములు అనే త్రిదోషములు స్థానచలనం పొంది తిరిగి తమ తమ స్థానాలకు చేరుతాయి. అప్పుడు పంచకర్మల ద్వారా దోషపూరితమైన శరీరతత్త్వములను బయటకు వెడలించి శరీరం నుండి రోగ తత్త్వమును బయలు వెడలించి స్వస్థతి చేకూర్చటమే శోధన థెరపి ముఖ్య స్నేహ, స్వేదములు వికృతి పొందిన దోషములను శమింపచేసి వాటి స్థానములకు చేరుస్తాయి. స్వస్థానమునకు చేరిన దోషతత్త్వములను పంచకర్మలు బయటకు వెడలిస్తాయి, కనుక స్నేహ, స్వేదములకు పూర్వకర్మ అని మాత్రమే కాక శమన చికిత్స ప్రక్రియలు అనే పేరు కూడ ఉంది.

పూర్వకర్మలయిన స్నేహ, స్వేదముల వలన జఠరాగ్ని దీప్తి చెందుతుంది. చర్మమునిర్మలమై మృదుత్వం పొందుతుంది. అన్నంపై శ్రద్ధ కల్గుతుంది. ప్రోతస్సులు నిర్మలంగాఉంటాయి. రక్తప్రసరణ వ్యవస్థ క్రమబద్ధమవుతుంది. జడత్వం, కునికిపాటు తొలగి శరీరం తేలికయి పటుత్వం పొందుతుంది. వస్తికర్మల ద్వారా జీర్ణాశయ, పక్వాశయ,జననేంద్రియ మూత్రవహ సంస్థాగత వ్యాధులే కాక సర్వశరీరగత వ్యాధులు తొలగిసంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. నస్యకర్మద్వారా కన్ను (నేత్రము), చెవులు, ముక్కు,గొంతు సంబంధ వ్యాధులు తొలగి ఆయా ఇంద్రియములకు పటుత్వం చేకూరి మంచి ఆరోగ్యాన్ని ఆయుషును కల్గచేస్తుంది.

  1. స్నేహనము: శరీరానికి మృదుత్వం కలిగించే ప్రక్రియను స్నేహనం అంటారు. దీనిలో వివిధ తైలములు, నెయ్యి, మొదలగు వానిని బాహ్య మరియు అభ్యంతర ప్రయోగముల ద్వారా శరీరమునకు మృధుత్వమును కలుగచేయుటమే స్నేహనము. నోరు, ముక్కు మలద్వారముల ద్వారా అభ్యంతర ప్రయోగము, అభ్యంగము, తర్పణం, పిచు, వస్తి(శిరోవస్తి), ధారా మొదలగు వానిని బాహ్య ప్రయోగము ద్వారా స్నేహనాన్ని నిర్వహిస్తారు. సాధారణంగా ప్రతి చికిత్సా ప్రక్రియకు ముందు, తర్వాత కూడ స్నేహకర్మను తప్పక ఆచరించాలని ఆయుర్వేద శాస్త్రకారుల అభిప్రాయం.

స్నేహకర్మకు అర్హులు: Panchakarma ayurvedic treatment ఉద్దేశించబడినవాడు మద్యపానము,అధిక స్త్రీ సంభోగము, వ్యాయామములందు ఆసక్తి కల్గినవారు, ఎల్లప్పుడు ఏడ్చు స్వభావము కలవారు, వృద్ధులు, బాలురు, బలహీనులు, కృశించినవారు, రక్తక్షీణత గలవారు, శుక్రక్షీణత కలవారు అర్హులు.

అనర్హులు: జఠరాగ్ని మందగించినవారు, మిక్కిలి తీవ్రమైన జఠరాగికలవారు, మిక్కిలి స్థూల శరీరము కలవారు. మిక్కిలి బలహీనులు, అతిసారం, విషము, ఇతరరోగాలు, మూర్ఛ, వాంతి. అరుచి, కఫము, దప్పి, గర్భస్రావమైన స్త్రీలు స్నేహకర్మలకు అనర్హులు.

ఘృతం మొదలగు స్నేహ ద్రవ్యములను మాత్ర, కాలం, భూమి, దోషము మొదలగు వానిని అనుసరించి ఆయా విషయములకు అనుగుణంగా తయారు చేసి వివిధ రకాలైన ఆహార పదార్ధాలతో చేర్చి ప్రయోగిస్తారు. అంతే కాక వస్తి, నస్యకర్మ, అభ్యంగము, శిరోవస్తి, తర్పణం, కర్ణపూరణం, అక్షిపూరణం మొదలగు ప్రక్రియల ద్వారా కూడా ఉపయోగిస్తారు. ఈ స్నేహనమును భోజనమునము ముందు. ప్రయోగించిన అధోదేహమున జనించిన రోగాలు, భోజనానంతరం సేవించిన ఊర్ద్వ శరీరగత వ్యాధులలో ప్రయోజనకరంగా ఉంటుంది. సుకుమారులకు వృద్ధులకు, శిశువులకు, దప్పికతో ఉన్న వారికి స్నేహమును ఆహారపదార్ధములలో కలిపి ప్రయోగిస్తారు. ఈ స్నేహపానం వలన జఠరాగ్ని ప్రజ్వలిస్తుంది. మలబద్ధకం తొలుగుతుంది. శరీరమున ధాతువులకు పుష్టి, బలం కల్గుతుంది. మంచి రంగు వర్చస్సు ఏర్పడి సర్వాంగములకు పటుత్వము కల్గి దీర్ఘాయుస్సు పొందగలరు.

  1. స్వేదనము: ఆయుర్వేదంలో చెప్పబడిన ప్రత్యేక చికిత్స క్రమములో స్వేదన చికిత్సకు కూడ ప్రత్యేకత ఉంది. ఈ ప్రక్రియ వలన వ్యాధినుండి ఉపశమనం కల్గడమే కాకుండా శమనచికిత్సకు ముందు తప్పక ఆచరించవలసిన విధానంగా ఆయుర్వేదంలో చెప్పబడినది. ఉబ్బసం, దగ్గు, ఎక్కిళ్లు, పొట్ట ఉబ్బరము, శరీరంలో వివిధ రకాల నొప్పులు, మూత్ర సంబంధ వ్యాధులు, హెర్నియా, పక్షవాతము స్పర్శ తెలియకపోవటం, కొన్ని రకాల జ్వరాలు, ఈ స్వేదన ప్రక్రియ వలన తగ్గుతాయి.

కాని ఎక్కువగా లావుగా ఉన్నవారికి, వాంతులు విరేచనాలు, మధుమేహము, చర్మవ్యాధులు, కేటరాక్ట్, గుండెకు సంబంధించిన వ్యాధులు, రక్తహీనత, పచ్చకామెర్లు, ఆకలిదప్పులతో ఉన్నవారికి, గర్భిణీస్త్రీలు, బాలింతలు, బహిష్టు అయిన స్త్రీలకు ఈ స్వేద కర్మ చేయకూడదు. విభిన్న ప్రక్రియల ద్వారా శరీరమునకు చెమట పట్టేట్లు చేయటమే స్వేదకర్మ యొక్క ఉద్దేశ్యము. శాస్త్రంలో అనేక ప్రక్రియలు చెప్పబడినప్పటికీ ఆచరణలో ఈ క్రింద చెప్పబడిన కొన్ని ముఖ్యమైన వాటిని మాత్రమే అనుసరిస్తున్నారు.

  1. అవగాహస్వేదము: ఈ విధానము ముఖ్యంగా ఒళ్ళంతా వాతపు నొప్పులు, మూత్రసంబంధ వ్యాధులు, హెర్నియా మొదలగు వాని యందు సూచించబడినది. ఒక తొట్టిలో ఆయా రోగమును అనుసరించి శరీరము భరించగలిగినంత వేడిగా కషాయం, పాలు మొదలగు వానిని పోసి దానిలో రోగిని నిర్ణీత సమయము వరకు కూర్చోబెట్టాలి. వాతపు నొప్పుల్లో మెడవరకు మునిగేలా, మిగిలిన వ్యాధుల్లో నడుము వరకు మునిగేలా రోగిని కూర్చుండబెట్టాలి.
  2. ఊష్మస్వేదము: ఈ పద్ధతిలో రోగిని పడుకోబెట్టి దట్టమైన దుప్పటి కప్పి మంచం క్రింద ఒక పాత్రలో ద్రవాన్ని వేడిచేస్తూ, ఆ ఆవిరి రోగి శరీరానికి తాకేలా చేస్తారు. దీనిని ఆధునిక పరిభాషలో “స్టీబ్బాత్”గా పరిగణిస్తారు.
  3. ఉపనాహ స్వేదము: ఈ పద్ధతిలో నొప్పి, వాపు కలిగిన ప్రదేశంలో అవసరానుసారము తగిన మూలికలను ముద్దగా చేసి దానిని వేడి చేసి పట్టులా వేసి దానిపై గుడ్డను కాని ఆముదము మొదలగు ఆకులతో కప్పి నిర్ణీత సమయం వరకు ఉంచుతారు.
  4. కంబళ స్వేదము: ఈ పద్ధతి ద్వారా వేడి ద్రవములో తడిపిన దట్టమైన దుప్పటి లేదా కంబళిని రోగికి కప్పి చెమట పట్టేలా చేస్తారు.
  5. తాప స్వేదము: ఈ పద్ధతి ద్వారా వేడి చేసిన రాయి, ఇసుక, సీసంలాంటి పదార్థాలతో కాపటం పెడ్తారు,
  6. ధ్యాన స్వేదము: వరి గోధుమ మొదలగు ధాన్యములను ఉడికించి నేలపై పరచి దానిపై పలుచని గుడ్డ వేసి ఆ గుడ్డపై రోగిని పడుకోబెట్టి కంబళిని కప్పి ఉంచుతారు.
  7. ధార స్వేదము: దీనిలో రోగమును బట్టి ఔషధాల కషాయం కాచి ఒక పాత్రలో పోసి ధారగా శరీరమంతట నిర్ణీత సమయం వరకు పోస్తారు,
  8. నాడీ స్వేదము: కెటిల్ లాంటి పాత్రలో ఔషధ ద్రవ్యంపోసి దానిని వేడిచేస్తారు. కెటిల్ ట్యూబుండా వచ్చే ఆవిరిని శరీరముపై ప్రసరింపచేస్తారు.
  9. పత్రస్వేదము: ఒక పలుచని గుడ్డలో రోగమును అనుసరించి ఔషదయుక్త పత్రములు మూటగా కట్టి దానిని కషాయంలోగాని తైలంలోగాని వేడిచేసి కాపడం పెడ్తారు.
  10. పిండస్వేదము: అరవై రోజుల్లో పండే ధాన్యాన్ని పాలు. కొన్ని ఔషదాల కషాయంలో కలిపి అన్నంలో పండుతారు. ఈ అన్నాన్ని చిన్న మూటలాగ కట్టాలి. తర్వాత శరీరమంతా తైలంతో చక్కగా మర్దనచేసి ఈ అన్నం మూటలును. ఔషధుల కషాయంలో ముందుతూ వేడిగా ఉన్నప్పుడు శరీరంపై రుద్దుతారు. ఈ విదంగా నిర్ణీత సమయం వరకు అన్నం మూటలను వేడి ఔషధద్రవ్య కషాయంలో ముంచుతూ వివిధ భంగిమలలో (పద్ధతుల్లో) శరీరముపై రుద్దుతారు. ఈ ప్రక్రియ కనీసము 7,9,11,14 రోజులు వేయాలని శాస్త్రంలో చెప్పబడింది. పక్షవాతం, చచ్చువాతము, కీళ్ళనొప్పులు మొదలగు దీర్ఘకాలిక వ్యాధుల్లో ఇది అత్యంత ప్రయోజనకారిగా ఉంది ఈ విధంగా 10 రకముల స్వేదన ప్రక్రియలు వివరించబడుతూ ఆయా వ్యాధి, రోగి, వయస్సు, బలం, వ్యాధి తీవ్రతను అనుసరించి ఏవేని ఒక పద్ధతిని అనుసరించి స్వేదన ప్రక్రియ చేస్తారు. స్వేదనము వివిధములైన ఔషధయుక్త తైలములతో శరీరానికి అభ్యంగం చేసి, రోగము యొక్క తీవ్రతను బట్టి, అవసరానుసారం కొన్ని రకాల కషాయాలలో, కొన్ని రకాల తైలములు కల్పి కాని, నెయ్యి (ఘృతం) యందు కొన్ని ఔషధాలను చేర్చిగాని రోగికి త్రాగించి తర్వాత స్వేదకర్మ చేయిస్తారు. ప్రత్యేకంగా వివరించబడిన సందర్భములో తప్ప స్వేదకర్మకు ముందు స్నేహపానము చేయిస్తారు. ఈ స్వేదకర్మ వలన చర్మము మృదువుగా తయారవుతుంది. జఠరాగ్ని దీప్తి నొడుతుంది. శోధన చికిత్సలో విశిష్ట స్థానము ఇవ్వబడిన చికిత్స ప్రక్రియ వమనము(వాంతి చేయించటం). శరీరంలో రోగ కారక పదార్ధాలను బయటకు వెడలించు ప్రయత్నంనకు శోధన చికిత్స అని పేరు. ఆయుర్వేద మూల సిద్ధాంతాలయిన త్రిదోషములలో కఫదోష సంబంధాలైన వ్యాధులకు చికిత్సగా వమనకర్మ నిర్దేశింపబడినది. అనగా కేవలము కఫదోషము మాత్రమే కాక కఫము అనుబంధంగా ఉన్న పిత్త, వాత మొదలగు సందర్భములలో కూడ వమన చికిత్స సూచించబడినది. అంతే కాక కొన్ని ప్రత్యేక సందర్భాలలో కూడ కఫ సంబంధము లేకున్నను వమనం చేయమని సూచింపబడటం గమనార్హము.

Panchakarma Ayurvedic Treatment Telugu full Deatalls click hear…

Good Health Tips For Daily Life:మంచి ఆరోగ్యానికి నిత్యం ఆచరించాల్సిన నియమాలు

శారీరకంగా, మానసికంగా,ప్రసన్నమైన ఆత్మ కల్గిన వాడినే ఆరోగ్యవంతుడు. అంటారు. ఆచార్య సుశ్రుతుడు తన సుశ్రుత సంహితలో ఆరోగ్యం గురించి ఇలా వివరించాడు.”సమదోష సమాగ్నిచ్ఛ సమాధాతు మలక్రియః ప్రసన్నాత్మేంద్రియమనః స్వస్థ ఇత్యభిధీయతే”

దోషాలు, అగ్నులు, ధాతువులు, మలాలు అనేవి సమస్థితిలో ఉండి ఆత్మ ఇంద్రియాలు, మనస్సు ఎలాంటి వికారాలకు లోను కాకుండా ప్రసన్నంగా ఉన్నప్పుడే ‘ అతన్ని స్వస్థుడు, ఆరోగ్యవంతుడు అంటారు.

మంచి ఆరోగ్యానికి నిత్యం ఆచరించాల్సిన నియమాలు దినచర్య. రాత్రిచర్య, మరియు రుతుచర్య అను వానిని, పాటిస్తూ అలాగే వ్యక్తిగత పరిశుభ్రతను ఆచరిస్తూ దేశ సౌభాగ్యానికి పాటుపడాలని ఆచార్యుల అభిమతం. వీటి గురించి తెలుసుకుందాం.

Good Health Tips For Daily Life

  1. నిద్ర లేచుట: బ్రహ్మ ముహూర్తమున నిద్రలేవాలి. సూర్యుడు ఉదయించటానికి ముందు గల కాలాన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయంలో పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి. వాతావరణ కాలుష్యముండదు. పరిశుభ్రమైన గాలి వీస్తుంది. ఏకాగ్రతకు, ధ్యానానికి, చదువుకోవటానికి ఆరోగ్యకరమైన సమయం. సూర్యోదయానికి 2 గంటలముందు సమయాన్ని బ్రహ్మముహూర్తంగా పరిగణించవచ్చు.
  2. జలపానము: తెల్లవారు జామున సుమారు ఒక గ్లాసు (లేదా 250-500 ఎం.ఎల్) నీరు త్రాగాలి.
  3. మల, మూత్ర విసర్జన: మల, మూత్రములను ఉదయాన్నే విసర్జించాలి. మల మూత్రాది వేగాల (natural urges) అవరోధం అనేది వ్యాధులు రావటానికి మూలకారణమని చెప్పారు. మల, మూత్రాదులు వచ్చినప్పుడు వెంటనే విసర్జించాలి. అంతేకాని తర్వాత చూద్దాంలే అని వాయిదా వేయకూడదు. సరిగా మల విసర్జన జరిగితే కడుపుబ్బరం, శరీరం బరువుగా ఉండటం జరుగక అసౌకర్యం లేకుండ ఉంటుంది. మొలల (Piles) వ్యాధితో బాధ పడేరోగులు, గర్భినీ స్త్రీలు నిద్ర సరిగా రాని వాళ్ళు, మత్తు పదార్థాలు సేవించేవారిలో మలబద్ధత కనిపిస్తుంది. ఈ వ్యాధిగ్రస్తులు పడుకునే ముందు సునాముఖి; స్వాదిష్ఠ విరేచన చూర్ణము లేదా త్రిఫలా చూర్ణం లేదా అభయారిష్ఠం అను మందులు వాడితే విరేచనం సాఫీగా అవుతుంది.
  4. దంతధావనం-నోరు శుభ్రపరుచుకోవటం: ఉదయమునే దంతాలు, నాలుక, నోరు శుభ్రంగా కడుక్కోవాలి. దంతాలు శుభ్రపరుచుకోవటానికి చేదు, వగరు గలవి మరియు యాంటిసెప్టిక్ గుణముగల వేప పుల్లలు, మర్రి, వేగిస, జిల్లేడు, చండ్ర, కానుగ, వావిలి, ఉత్తరేణి, జాజి, మరియు మద్ది చెట్ల కొమ్మల పుల్లలతో బ్రష్ చేసుకోవాలి. పుల్లల చివర్లను బాగా నమిలి బ్రష్లోగ చేసుకుని దంతాలను తోమాలి. పై దంతాలను క్రిందికి, క్రింది దంతాలను పైకి మృదువుగా తోముకోవాలి. చిగుళ్ళకు గాయాలు కాకుండ చూసుకోవాలి. దంతాలు తోమిన తర్వాత చిగుళ్ళను మృదువుగా నోటినిండా నీకు తీసుకుని షకీల పట్టి ఊచేయాలి. నాలుకను చక్కగా శుభ్రం చేసుకోవాలి. వికిట్టల, చాకెట్లు తినటం త్రాగటం చేయకూడదు. దంతాలు, నాలుక శుభ్రపరచిన తర్వాత గోరువెపని నీళ్ళలో కొద్దిగా ఉప్పు చేర్చి పుక్కిట పట్టి ఊచేస్తే మంచిది.
  5. గంఘాపము: (పుక్కిట పట్టి ఉంచుట); అరిమేధాది తైలాన్ని లేదా నువ్వుం నూనెను 10 మి.లీ నోటిలోకి తీసుకొని పుక్కిట పట్ట ఉంచాలి. ఇది 10 నిమిషాలు ఆచరిస్తే దంతాల చిగుళ్ళు గట్టిపడతాయి.
  6. అభ్యంగము: శరీరం మొత్తానిక నూనె రాసుకొని మర్దన చేసుకోవాలి.అభ్యంగానికి నువ్వులనూనె మంచిది. ఆవనూనే (సర్షపతైలం) మరీ మంచిది. అభ్యంగం వలన శరీరం మృధువుగా తయారవుతుంది. చర్మ వ్యాధులు రావు, చర్మానికి ఇన్ఫెక్షన్ కలుగదు. రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. శరీరంలోని మలినాలు తొలగిపోతాయి, కండరాలు, సంధులు(జాయింట్) తమ తమ విధులు సజావుగా నిర్వహిస్తాయి.
  7. వ్యాయామము: క్రమం తప్పకుండా వ్యాయామము చేస్తే మంచి ఆరోగ్యం కల్గుతుంది. వ్యాయామం వలన శరీరంలోని ప్రతికణం చైతన్యవంతమౌతుంది. రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. ఉచ్చ్వాస, నిచ్ఛ్వాసనలు క్రమబద్ధం చేయబడతాయి. నడక, జాగింగ్, యోగాసనాలు, నాట్యం మొదలగునవి కూడ మంచి వ్యాయామమే. మితిమీరి వ్యాయామం పనికిరాదు. ముఖ్యంగా కీళ్లనొప్పులు ఉన్నవాళ్ళు, రక్తపోటు, గుండెజబ్బులున్నవాళ్లు డాక్టర్లు సూచించిన ఎక్సర్సైజులు మాత్రమే చేయాలి. శరీరానికి చెమట పట్టేవరకు వ్యాయామము చేయాలి.
  8. ధ్యానము: ప్రతిరోజు ఉదయం సాయంత్రం 10 నిమిషాలు ధ్యానము (Meditation) చేయాలి. శవాసనం 5 నిమిషాలు ఆచరించాలి. ప్రాణాయామం 2-5 నిమిషాలు చేయాలి. వీటి వలన మానసిక ఆందోళన, చిత్తోద్వేగం అధిక రక్తపోటు మొదలగునవి తగ్గు ముఖం పడతాయి. మీకు తెల్సు కదా! మానసిక ఆందోళన, అనేక వ్యాధులకు కారణమవుతుంది అని. దీని వలన నూర్రోట్రాన్స్ మీటర్ల సమస్తితి లోపిస్తుంది. అనేక వ్యాదులు రావటానికి ఆస్కారమేర్పడుతుంది. మెడిటేషన్ వలనమానసిక ప్రశాంతత కల్గుతుంది. తద్వార మంచి ఆరోగ్యం, మనోవికాసం కలుగుతుంది. అధిక రక్తపోటు (High Blood Presure hyprtenstion) గల రోగులు శీర్షాసనం వేయకూడదు. క్షయ (టి.బి) రోగులు వ్యాయామం చేయకూడదు.
  9. స్నానవిధి: ఉదయం-సాయంత్రం విధిగా స్నానం చేయాలి.. స్నానం వల్ల శరీరానికి చేరిన మలినాలు తొలిగిపోతాయి. ప్రెజ్నెస్ కల్గుతుంది. చర్మవ్యాధులు రాకుండా ఉంటాయి.
  10. వస్త్రధారణ: వస్త్రాలు శుభ్రమైనవి వేసుకోవాలి. కాటన్ దుస్తులు మంచివి, ఇతరుల అండర్వేర్ లు వాడకూడదు. కొంతమందికి చర్మవ్యాధులుంటాయి. వారిబట్టల ద్వారా ఒకరి నుండి ఒకరికి అవి సంక్రమిస్తాయి. దుస్తులు పచ్చివి, తడివి వేసుకోకూడదు. దుస్తులు ఉతికి బాగ ఎండలో ఆరిన తర్వాత వాడాలి. పచ్చివి, తడివి వాడటం వలన ఫంగస్ మరియు చర్మవ్యాధులు కల్గుతాయి. అండర్వేర్లు (లోపలిదుస్తులు) మధ్యాహ్నం లేదా సాయంత్రం తప్పక మార్చుకోవాలి.మంచి దుస్తులు వేసుకోవటం వలన ఉన్నతత్త్వం కల్గుతుంది. ఆకర్షణ కల్గుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎండ బారి నుండి రక్షణ కల్గుతుంది. కాటన్ దుస్తులు మరీ పొట్టి దుస్తులు ధరించటం ఫ్యాషన్ కావచ్చు కాని అవి మన గౌరవాన్ని పెంచలేవు.
  11. నఖ కేశములు మరియు అలంకరణ: తల వెంట్రుకలు, గడ్డము, మీసాలు, మర్మావయవాల వెంట్రుకలు అతిగా పెంచకూడదు. వీటిని తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. గోళ్ళు అధికంగా పెంచకూడదు. గోళ్ళులోనికి మురికి చేరకుండా శుభ్రం చేసుకోవాలి. గోళ్ళలో మురికి చేరి బ్యాక్టీరియా క్రిములు ఆహారంతో పాటు లోనికి వెళ్ళి అనారోగ్యాన్ని కల్గచేస్తాయి.
  12. అలంకరణ: మితిమీరి అలంకరణ ఎబ్బెట్టుగా ఉంటుంది. కొన్ని రకాల సౌందర్య సాధనాల వల్ల ఎలర్జీ వ్యాధులు వస్తాయి. అలంకరణ సంఘంలో గౌరవాన్ని, మన్ననలను పొందే విధంగా ఉండాలి. ఆయుర్వేదంలో చెప్పిన ఔషధాలు ఉపయోగించిన సుగంధయుక్తంగా ఉండి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండ ఉంటాయి.
  13. అభరణాలు ధరించటం: ఆభరణాలు ధరించటం ఒక కళ. మణి, మాణిక్యాలు, బంగారు ఆభరణాలు ధరించాలి. ఆభరణాలు తమ అంతస్తు పెంచుకోవటానికో లేక గొప్పతనం చాటుకోవటానికో అధికంగా ధరించకూడదు. అలా చేయటం ఎబ్బెట్టుగా ఉండటమే కాకుండ అసహ్యాన్ని కట్టచేస్తాయి. అభరణాలు ఆతీంద్రియశక్తుల నుండి రక్షణ కలిపిస్తాయని జ్యోతిష్కులు సిద్ధులు చెబుతుంటారు. కొన్ని ఆభరణాలు కొందరికి ఎలర్జీ కలిగిస్తాయి. వాటిని మానివేయాలి.
  14. ఆహారం: పాలు, పళ్లు, ఆకుకూరలు, పప్పులు, కొవ్వు పదార్థాలు గల ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం షట్రుడుతో (పడ్రసాలతో) కూడి ఉండాలి. ఆహారం తమతమ జీర్ణశక్తిని గమనించి తీసుకోవాలి మాటిమాటికి ఆహారం తీసుకోవటం, మితిమీరి ఆహారం తీసుకోవటం మంచిది కాదు. కొవ్వు, మాంసం, స్వీట్సు మి మీరి (అధికంగా) తినటం మంచిది కాదు. ఆహార పదార్థాలపై మూతలు ఉండాలి.. పాచిపోయిన, కుళ్ళిపోయిన ఆహారం. ఈగలు వాలిన ఆహారం తినకూడదు. హర్రీ, బర్రీ, కర్రీ పనికి రావు. ఇవి అల్సర్ను కలిగిస్తాయి. బ్రతకటానికి మాత్రమే ఆహారం తినాలి. తినటానికే బ్రతికితే జీవితానికి అర్ధం పరమార్ధం లేదు. ఆహారాన్ని ఇష్టమైన వారితో కలిసి భుజించాలి. ఆహారము తినే సమయమున కోపము, విసుగు, చికాకు, ఏడుపు పనికిరావు. యజ్ఞంలా భావించి తినాలి. అతిధులకు ఆహారము ముందు పెట్టాలి. తర్వాతే మనము భుజించాలి.
  15. ఆహారానికి ముందు: అల్లం మరియు కొద్దిగా ఉప్పు కల్పి భోజనానికి 10-20 నిమిషాల ముందు సేవించాలి. (రక్తపోటు రోగులు ఉప్పు వాడకూడదు). ఆహారాన్ని మెత్తగా నమిలి మ్రింగాలి. ఆహారం మంచి రుచి కల్గి ఉండాలి. వేడిగా ఉండాలి. రాత్రి సమయాల్లో మితిమీరి భోజనం చేయకూడదు. పడుకోవటానికి 2 గంటలు ముందే భోజనం చేయాలి. ఆహారం భుజించిన తర్వాత కొద్ది సమయం విశ్రాంతి తీసుకోవాలి. కొద్ది దూరం నిదానంగా నడవాలి. అంతేగాని ఉరుకులు, పరుగులు పనికి రావు.
  16. తాంబూళ సేవన: భోజనం తర్వాత 2 లేక 3 లేత తమలపాకులు తీసుకుని సున్నం, కాచు, వక్కలు, జాజి, జాపత్రి, పచ్చకర్పూరం, లవంగాలు, మొదలగు వానితో కూడిన తాంబూళం సేవించాలి, ఇది ఆహారాన్ని జీర్ణం చేస్తుంది, నోటి దుర్వాసన లేకుండా చేస్తుంది. అంతే కాని జర్ధాలు, పాన్ మసాలాలు గుట్కాలను వాడకూడదు. వీటి సేవన వలన రకరకాల క్యాన్సర్లు వస్తాయి.
  17. నిద్ర : ప్రతి వ్యక్తికి నిద్ర చాల అవసరం. నిద్ర వలన శరీరశ్రమ అలసట తొలిగి నూతన శక్తి లభిస్తుంది. ఆరోగ్యవంతులకు దాదాపు 6 గంటల నిద్ర సరిపోతుంది. పగటి నిద్ర మంచిది కాదు అయితే చిన్న పిల్లలు, బలహీనులు, రోగులు, పగటినిద్ర పోవచ్చు. పడుకునేముందు గోరువెచ్చని నీటితో స్నానం చేసిన చాల రిలాక్స్ గా ఉంటుంది. పడుకునేముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలను త్రాగాలి. లేదా అశ్వగంధచూర్ణము 3గ్రాములు కలిపి త్రాగితే చక్కగా నిద్రపడుతుంది.
  18. మాట్లాడువిధము: ప్రియంగా మాట్లాడాలి. మనస్సుకు కష్టం కలిగే విధంగా మాట్లాడరాదు.
  19. మైధునము: సెక్స్ ఒక మధురమైన అనుభూతి. సెక్స్ ద్వారా శరీరం రిలాక్స్ అవుతుంది. టెన్షన్ తగ్గుతుంది. సెక్స్ జీవిత భాగస్వామితోనే ఆచరించాలి. తెలియనివారితో, అపరిచితులతో, వేశ్యలతో కలిసి చేయరాదు. సుఖరోగాలతో బాధపడే * స్త్రీ, పురుషులతో సెక్స్లో పాల్గొనరాదు. నెలసరి సమయమున కూడ సెక్స్లో పాల్గొనటము వలన చికాకు, అయిష్టత కలుగుతాయి. సెక్స్ను తనివితీరా అస్వాదించాలంటే మీ జీవితభాగస్వామితో అనురాగము, ఆప్యాయత, ఆరాధనా . భావనలను పెంపొందించుకోండి. సెక్స్ తర్వాత పాలు, పండ్లు సేవించండి. దీని ద్వారా శ్రమ తీరుతుంది. తృప్తి కలుగుతుంది. చికాకు, టెన్షన్లతో సెక్స్లో పాల్గొనకండి. అధిక మధ్యపానము చేసికూడ సెక్స్లో పాల్గొనకండి. భయము, ఆందోళనలు పనికిరావు. సెక్సు ముందు హృదయపూర్తిగా మాట్లాడుకోండి. చక్కని జోక్స్ వేసుకోండి. వాతావరణాన్ని ప్లెజెంట్గా ఉంచుకోండి. చిరుదివ్వె వెలిగించుకొని ఒకరిని ఒకరు ప్రేమపూర్వకంగా హృదయానికి హత్తుకుంటూ మధుర భావనలను పంచుకుంటూ సెక్స్ను ఎంజాయ్ చేయండి. మరోసారి మనవి చేస్తున్నా- సెక్స్ ను మీ భాగస్వామితోనే ఆచరించండి. ఎయిడ్స్న దూరంగా ఉండండి.
  20. సమాజసేవ: మనసమాజములో ఎందరో ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. సాధ్యమైనంతవరకు సహాయము చేయండి. ఆకలి, అవిద్య, రోగాలు, అధికజనాభా, ఇవి సమాజాన్ని పట్టి పీడిస్తున్న జాడ్యాలు. ఆకలితో ఉన్నవారికి కొద్దిగానైనా ఆహారాన్ని ఇవ్వండి. అవిద్య అనేక సమస్యలకు మూలము. ఇరుగుపొరుగు పిల్లలకు చదువురాని వాళ్ళకు చదువుచెప్పండి. వాళ్ళలో జ్ఞానజ్యోతులు వెలిగించండి.lets follow Good Health Tips For Daily Life.