
Weather: కూల్ న్యూస్.. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఏప్రిల్ 12 నుండి 14 వరకు ఉరుముల, మెరుపులు, తీవ్ర గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. హైదరాబాద్ విషయానికొస్తే, ఏప్రిల్ 16 వరకు నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని IMD తెలిపింది. వచ్చే బుధవారం వరకు ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఉంటాయని అంచనా వేసింది. కాగా శుక్రవారం హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో అత్యధికంగా 39.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా 43.3 డిగ్రీల…