
జర్మనీలో న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం ఓ చారిత్రాత్మిక మైలురాయి: జ్యోతిరాదిత్య సింధియా
మొట్టమొదటిసారిగా స్టట్‌గార్ట్‌లోని ఫుట్‌బాల్ మైదానంలో టీవీ9 నెట్‌వర్క్ ఈ తరహ కార్యక్రమం ఒకటి నిర్వహించడం చారిత్రాత్మకం అని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కొనియాడారు. క్రీడలు కేవలం ఆట మాత్రమే కాదు.. ఓ జట్టు నిర్మాణం అవుతుంది, భాగస్వామ్యాలు సైతం ఏర్పడతాయి. అలాగే వ్యక్తుల మధ్య సంబంధాలు ఏర్పడుతాయని మంత్రి అన్నారు. భారతదేశం, జర్మనీ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. జర్మనీ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్‌కు పెట్టింది పేరు. దీనిని స్టట్‌గార్ట్‌లో చూస్తున్నాం. పోర్షే, మెర్సిడెస్ బెంజ్ లాంటివి ఇక్కడ…