
Weekly Horoscope: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, శని వంటి ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఆదాయానికి లోటుండదు. కొద్దిగా పెరిగే అవకాశమే ఉంది. వారమంతా కుటుంబ జీవితం ఉత్సాహంగా గడిచిపోతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగు పడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు తదితర ఆర్థిక లావాదేవీల మీద పెట్టుబడులు పెట్టడం వల్ల ఆశింశిన ప్రయోజనం ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి….